mangalampalli bala murali krishna
-
శతవసంత స్వరమాధురి
ఇరవయ్యో శతాబ్దంలో భారతీయ సంగీత సామ్రాజ్యంలో ‘భీమ్ సేన్ గురురాజ్ జోషీ’ది అగ్రగణ్య స్థానమని చెప్పాలి. హిందుస్తానీ సంప్రదాయ సంగీతంలో మేరునగ ధీరునిగా పేరుగాంచిన ఆయన 1922 ఫిబ్రవరి 4న కర్ణాటక రాష్ట్రం, గదగ్ జిల్లాలోని రాన్ ప్రాంతంలో జన్మించారు. ‘పండిట్ భీమ్ సేన్ జోషీ’గా ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ఆయన తన చిన్నతనంలో పదకొండవ ఏటనే అబ్దుల్ కరీంఖాన్ గానం విని తన్మయుడై ఆయన స్వరానికి ఉత్తేజం చెంది తానూ సంగీతం నేర్చుకోవాలనే జిజ్ఞాసతో గురువును వెతుక్కొంటూ ఇల్లు వదలి గ్వాలియర్ చేరుకొని ఓ సంగీత పాఠశాలలో చేరి, ఆ తరువాత మంచి గురువు కోసం అనేక చోట్ల తిరిగి తిరిగి చివరకి 1936లో ‘సవాయిగంధర్వ’ వారి వద్ద శిష్యునిగా చేరారు. ఇక అప్పటి నుండి 24 జనవరి 2011న తన 88వ ఏట ఈలోకం వీడి వెళ్లేంత వరకు తన గంధర్వ గానంతో ‘హిందుస్తానీ సంగీతాన్ని’ అజరామరం చేస్తూనే ఉన్నారు. సంగీత నాటక అకాడమీ అవార్డు, మహారాష్ట్ర భూషణ్, కర్ణాటకరత్న లాంటి గౌరవ పురస్కారాలతో పాటు... భారత దేశంలో అత్యున్నత పౌర పురస్కారం ‘భారతరత్న’ కూడా పండిట్ భీమ్ సేన్ జోషీని వరించింది. (సకిన రామచంద్రయ్య: ఆదివాసీ సంప్రదాయ చరిత్రకారుడు) హిందుస్తానీ శాస్త్రీయ సంగీత ఆలాపనలే కాక ఆయన కన్నడ భజనలు, మరాఠీ అభంగులు, ‘బసంత్ బహార్, తాన్ సేన్’ లాంటి చలన చిత్రాల్లో పాటలు తనకు తానే సాటి అన్నట్టుగా గానం చేశారు. భీమ్ సేన్ జోషీ కర్నాటకకు చెందిన పురందర దాసు కృతులు కూడా ఆలపించటం విశేషం. కర్ణాటక సంగీతంలో ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగళంపల్లి బాలమురళీకృష్ణతో ఆయన కలిసి చేసిన ‘జుగల్ బందీ’ కచేరీలు సంగీతాభిమానులకు మరచిపోలేని అనుభూతులు. కర్ణాటక సంగీతంలో ‘సంగీత సామ్రాజ్ఞి’ ‘భారతరత్న’ అవార్డు గ్రహీత ఎమ్మెస్ సుబ్బులక్ష్మితో కలసి కూడా భీమ్ సేన్ జోషీ సంగీత కచ్చేరీలు చేశారు. ‘కిరానా ఘరానా’ స్వరశైలిలో ప్రఖ్యాతి గాంచిన భీమ్ సేన్ జోషీ హిందూస్తానీ సంగీతంలో ఓ ధ్రువ తారలా వెలిగారు. శుద్ధ కళ్యాణ్, పురియా కళ్యాణ్, పురియా, ముత్ లానీ, మారు బిహాగ్, తోడి లాంటి హిందుస్తానీ రాగాల్లో ఆయన సంగీత రసజ్ఞత ఆపూర్వం. ‘మిలేసుర్ మేరా తుమ్హారా’, అంటూ 1980 దశకంలో దూరదర్శన్ వీడియో కోసం ఆయన పాడిన పాట వినని వారుండరు. (చదవండి: తెలుగు కవితా దండోరా ఎండ్లూరి) సంగీతం సార్వత్రికమైనది. దానికి భాషా భేదాలు లేవు. అందునా భారతీయ సంగీతం వేదకాలం నుండి ప్రఖ్యాతమైంది. అటువంటి భారతీయ సంగీత సౌరభాన్ని ఈ ప్రపంచానికి పంచిపెట్టిన మహా విద్వాంసుడు ‘భారతరత్న పండిట్ భీమ్ సేన్ జోషీ’ శత జయంతి ఉత్సవాల సందర్భంగా మరోసారి ఆ మహనీయునికి శ్రద్ధాంజలి. – డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ జర్నలిస్టు (ఫిబ్రవరి 4న పండిట్ భీమ్సేన్ జోషీ శత జయంతి ఉత్సవాలు ప్రారంభమైన సందర్భంగా) -
'కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ర్టం'
సాక్షి, విశాఖ : పద్మభూషణ్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ 90వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో పర్యాటకశాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, తెలుగు భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తదితరులు పాల్గొని నివాళులర్పించారు. ఈ సమావేశంలో లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతూ..కర్ణాటక సంగీతానికి ప్రపంచ వ్యాప్తంగా ఖ్యాతి తెచ్చినవారు తెలుగువారని ప్రశంసించారు. మంగళంపల్లి 400 రచనలు చేశారని పేర్కొన్నారు. కళాకారులను ఆదుకుంటాం : అవంతి శ్రీనివాస్ తూర్పుగోదావరి జిల్లా మారుమూల ప్రాంతంలో జన్మించిన మంగళంపల్లి ఎంతో మందికి స్పూర్తిదాయకంగా నిలిచారని మంత్రి అవంతి శ్రీనివాస్ అన్నారు. చరిత్రలో మంగళంపల్లి పేరు నిలిచిపోతుందన్నారు. కరోనా కారణంగా ఈ సంవత్సరం ఆయన జయంతి వేడుకలను సాధారణంగా నిర్వహిస్తున్నామని దక్షిణాది రాష్ర్టాల్లో సంగీతాన్ని పరిచయం చేసింది మన తెలుగువాళ్లే అని కొనియాడారు. విద్యతో పాటు సంగీతానికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పెద్దపీట వేస్తున్నారని, కళాకారులకు పెన్షన్ ఇస్తున్న ప్రభుత్వం తమదేనన్నారు. కళాకారులను అన్ని విధాలుగా ఆదుకుంటామని ఈ సందర్భంగా వెల్లడించారు. -
‘బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమందరం పయనిస్తున్నాం’
సాక్షి, విజయవాడ : బాలమురళీకృష్ణగారి దారిలోనే మేమంతా పయనిస్తున్నామని, రాబోయే తరం విద్యార్ధులకు ఆయన ఒక మార్గదర్శకమని ఈ ఏడాది మంగళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార గ్రహిత బాంబే జయశ్రీ పేర్కొన్నారు. ఈ పురస్కారాన్ని తీసుకోవడం సంతోషంగా ఉందని ఆనందం వ్యక్తం చేశారు. మంగంళంపల్లి బాలమురళీకృష్ణ పురస్కార ప్రదానోత్సవం శనివారం సాయంత్రం తుమ్మలపల్లి క్షేత్రయ్య కళాక్షేత్రంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి అవంతి శ్రీనివాస్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ముఖ్య కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఈ ఏడాది కర్ణాటక సంగీత విద్వాంసురాలు బాంబే జయశ్రీకి ఈ పురస్కారం ప్రదానం చేశారు. మంత్రి అవంతి శ్రీనివస్ మాట్లాడుతూ.. పర్యాటక శాఖకు ఈ సంవత్సరానికి 72 కోట్లు కేటాయించాయని అన్నారు. 1981లో భాషా సాంస్కృతిక శాఖ ఏర్పాటయిందన్నారు. బాలమురళీకృష్ణ ఫ్రెంచ్ భాషలో కూడా పాటలు పాడారని, వీరు పద్మవిభూషణ్ బిరుదాంకితులని గుర్తు చేసుకున్నారు. సమకాలీన సంగీత ప్రపంచంలో వెలుగొందుతున్న బాంబే జయశ్రీగారికి ఈ పురస్కారం ఇవ్వడం ఎంతో సంతోషమని, జయశ్రీ బహుభాషలలో సినిమా పాటలు పాడారని పేర్కొన్నారు. ప్రతి కళాకారుడిని ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే మల్లాది విష్ణు మాట్లాడుతూ.. విజయవాడ వేదికగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో ఇలాంటి కార్యక్రమం నిర్వహించడం ఎంతో సంతోషమని, విజయవాడలోని ఘంటసాల సంగీత కళాశాలకు మొదటి ప్రిన్సిపాల్‌గా మంగళంపల్లి పనిచేశారని తెలిపారు. విజయవాడలో మొదటి సంగీతయాత్ర మంగళంపల్లి ప్రారంభించారని, ఈ ప్రాంత ప్రజలే మురళీకృష్ణగారిని బాలమురళీకృష్ణగా సత్కరించారని ప్రభుత్వ కార్యదర్శి ఎల్వీ సుబ్రహ్మణ్యం కొనియాడారు. సంగీత ప్రపంచంలో జయశ్రీ ఒక ఆణిముత్యమని కీర్తించారు. -
నగరంతో నాది సంగీత అనుబంధం
- మంగళంపల్లి బాలమురళీకృష్ణ సాక్షి, సిటీబ్యూరో: అగ్రశేణి కర్ణాటక సంగీత విద్వాంసులు, పద్మవిభూషణ్ బిరుదాంకితులు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీ కృష్ణకు హైదరాబాద్‌తో గొప్ప సంగీత అనుబంధం ఉంది. నగరానికి చెందిన హైదరాబాద్ బ్రదర్స్‌గా పేరుగాంచిన రాఘవచారి, శేషాచారి, ఈలపాట శివప్రసాద్‌లు ఆయనకు ప్రియ శిషు్యలు. ఎప్పుడు హైదరాబాద్ వచ్చినా మంగళంపల్లి మొదట వారిదగ్గరే ఆశ్రయం పొందేవారు. డాక్టర్ సి.నారాయణరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం ఉపాధ్యక్షులుగా ఉన్న సమయంలో మూడో స్నాతకోత్సవానికి బాలమురళీకృష్ణను ముఖ్య అతిథిగా ఆహ్వానించి గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేశారు. రవీంద్రభారతి వేదికపై తన శిషు్యడు ఈలపాట శివప్రసాద్‌ను ఇక నుంచి నీవు ‘గళ మురళి’ గా పిలవబడతావని డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ ప్రకటించి, శిషు్యడిపై తనకున్న అభిమానాన్ని చాటుకొన్నారు. ఎన్నో వందలసార్లు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ హైదరాబాద్ నగరానికి వచ్చేసి కచేరీలు నిర్వహించి, ప్రజల హృదయాల్లో నిలిచిపోయారు. వంశీతో 45 ఏళ్ల అనుబంధం... ప్రముఖ కల్చరల్ సంస్థ వంశీతో ఆయనకు 45 ఏళ్ల అనుబంధం ఉంది. 2015 సెప్టెంబర్ 14న రవీంద్రభారతిలో జరిగిన వంశీ సంస్థ 45వ వార్షికోత్సవంలో పాల్గొన్నారు. జీర్ణించుకోలేకపోతున్నాం... డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతిని తాము జీర్ణించుకోలే పోతున్నామని వంశీ సంస్థ నిర్వాహకులు వంశీ రామరాజు, డాక్టర్ తెన్నేటి సుధాదేవి గద్గద స్వరంతో తెలిపారు. మళ్లీ అటువంటి సంగీత విద్వాంసుడ్ని ఈ జన్మలో చూడలేమన్నారు.ఆయన మృతికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. రసమయి సంస్థతో విడదీయలేని అనుబంధం.. ప్రముఖ కల్చరల్ సంస్థ రసమయి సంస్థతో డాక్టర్ మంగళంపల్లిది విడదీయలేని అనుబంధం అని రసమయి సంస్థ నిర్వాహకులు డాక్టర్ ఎంకే రాము తెలిపారు. ప్రతి ఏడాది ప్రదానం చేసే పైడి లక్ష్మయ్య ప్రతిభా పురస్కారాన్ని డాక్టర్ బాలమురళీకృష్ణకు ప్రదానం చేసినట్లు చెప్పారు. ఎస్.రాజేశ్వరరావు సంగీత దర్శకత్వంలో రసమయి నిర్వహించిన ఆడియో క్యాసెట్లో ఒకపాట బాలమురళీకృష్ణ కృతితో పాడించారన్నారు. ఆ సంగీత విద్వాంసుడు తమను వీడి వెళ్లటాన్ని ఊహించలేకపోతున్నామని చెప్పారు. ఈ రోజు నాకు దుర్దినం.. గురువు, తండ్రి..అన్నీ నాకు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణనే అని ఈలపాట శివప్రసాద్ శోకతప్త హృదయంతో వెల్లడించారు. ఈరోజు నా జీవితానికి ఒక దుర్దినమన్నారు. ‘ఈలపాటను చేరదీసిన మహానుభావుడు ఆయన. రవీంద్రభారతిలో ఆయన ఎప్పుడు కచేరీలు చేసినా ఈలపాటకు ప్రాధాన్యం ఇచ్చేవాడు. ఆ పరంపరలోనే రవీంద్రభారతి వేదికపై నాకు ఆయన ‘ గళ మురళి’ అని పేరు పెట్టాడు. గురువు సంకల్పంతోనే నేను ఇంతకాలం రాణిస్తూ వచ్చాను. నా తొలి క్యాసెట్లో బాలమురళీకృష్ణ పాడారు. నాకు ఇంతకాలం దైవంతో సమానంగా ఉన్నారు. నాకు భగవంతుడు బాలమురళీకృష్ణనే. ఆయన కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలుపుతున్నాను..’ అని శివప్రసాద్ గద్గధ స్వరంతో చెప్పారు. పలువురి సంతాపం... డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి తెలుగు వారికి తీరనిలోటని యువకళావాహిని కల్చరల్ సంస్థ నిర్వాహకులు వైకే నాగేశ్వరరావు తెలిపారు. ఆయన కుటుంబీకులకు ప్రగాఢ సంతాపం వ్యక్తం చేస్తున్నట్లు చెప్పారు. పద్మవిభూషణ్, కర్ణాటక సంగీత విద్వాంసుడు డాక్టర్ మంగళంపల్లి బాలమురళీకృష్ణ మృతి సంగీత సామ్రాజ్యానికి తీరనిలోటని, భాషా సాంస్కృతిక శాఖ పక్షాన ప్రగాఢ సానుభూతిని ప్రకటిస్తున్నట్లు డైరెక్టర్ మామిడి హరికృష్ణ తెలిపారు. మరికొందరు... గాన గంధర్వుడు ప్రముఖ శాస్త్రీయ సంగీత వాగ్గేయ కారుడు డాక్టర్ మంగళంపల్లి బాల మురళీకృష్ణ మృతికి గానసభలో పలు సాంస్కృతిక సంస్థలు సంతాపం ప్రకటించాయి. గాన సభ అధ్యక్షులు కళాదీక్షితులు, వంశీరామారాజు, నటులు గుండు హనుమంతరావు, రచయిత ముదిగొండ శివప్రసాద్, దైవిజ్ఞశర్మ, గాన సభ పాత్రికేయులు ప్రగాఢ సంతాపం తెలిపారు. గతేడాది సెప్టెంబర్‌లో రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో మంగళంపల్లి బాలమురళీ కృష్ణ పాల్గొన్నారు. ఆ సందర్భంలో హైదరాబాద్ నగరంతో తనకున్న అనుబంధాన్ని ఆయన ‘సాక్షి’తో పంచుకున్నారు.. ఆ జ్ఞాపకాలు మరోసారి... మిగతా విషయాలతో కన్నా హైదరాబాద్‌తో నాకు సంగీత అనుబంధమే ఎక్కువగా ఉంది. ఎప్పటినుంచో ఇక్కడికి వస్తున్నా.. ప్రజలు నా సంగీతాన్ని విని ఆనందిస్తున్నారు. నన్ను అభిమానిస్తున్నారు. యువత వెస్ట్రన్ సంగీతం విన్నా, ఆకర్షితులైనా, మరే సంగీతం వంటపట్టించుకున్నా అన్ని సంగీతాలు మనవే. మన సంగీతం నుంచి పుట్టినవే అన్నీ. అన్ని రాగాలు మనవే. వెస్ట్రన్ సంగీతం అలవాటు పడ్డ వారు కూడా మన పిల్లలే కదా. ఎటు తిరిగి ఎటుపోయినా మళ్లీ శాస్రీ్తయ సంగీతం దగ్గర వారంతా ఆగాల్సిందే. రోగాలు నయం చేసేందుకంటూ ప్రత్యేక పాటలు, సంగీతం అంటూ ఏమీలేవు.. సంగీతంతో కూడిన రాగాలు వింటూ ఉంటే రోగాలు వాటంతట అవే తగ్గిపోతాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో శాస్రీ్తయ సంగీతం విన్నా, నేర్చుకున్నా మంచే జరుగుతుంది. సంగీతప్రియులు ఇన్ని సంవత్సరాలు నన్ను ఆదరించి ప్రేమించారు. బాగా చూసుకున్నారు.. ఈ ఆదరాభిమా నాలు నేను ఉన్నన్నాళ్లు లభించాలని కోరుకుంటున్నాను. – సాక్షి, సిటీబ్యూరో