
సాక్షి ప్రతినిధి, రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసేది వైఎస్సార్‌సీపీ ప్రభుత్వమేనని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి అనిల్‌కుమార్ యాదవ్ స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లాలో పోలవరం నిర్వాసితులకు నిర్మిస్తున్న పునరావాస కాల నీలను సోమవారం మంత్రి పరిశీలించారు. గోకవరం, దేవీపట్నం మండలాల్లో పర్యటించి, రంపచోడవరం ఐటీడీఏ కార్యాలయంలో పునరావాస ప్యాకేజీ అమలుపై అధికారులు, ప్రజాప్రతినిధులతో సమీక్షించారు. అనంతరం మంత్రి మీడియాతో మాట్లాడుతూ..
► 41వ కాంటూరు పరిధిలోని 17 వేల కుటుంబాలను ఆగస్టు మొదటి వారం నాటికి పునరావాస కాలనీలకు తరలించాలని సీఎం వైఎస్ జగన్‌కృతనిశ్చయంతో ఉన్నారు. వచ్చే వరదలకు ఏ ఒక్క కుటుంబమూ ఇబ్బంది పడకూడదనేది ప్రభుత్వ ఉద్దేశం.
► పోలవరంలో అవినీతిపై రాష్ట్రం నుంచి ఎటువంటి నివేదికా పంపలేదని కేంద్రం చెబుతుంటే, రాష్ట్ర ప్రభుత్వమే క్లీన్‌చిట్ ఇచ్చిందంటూ టీడీపీ ఎల్లో రాతలు రాయిస్తోంది.
► పట్టిసీమలో రూ.300 కోట్ల అవినీతి జరిగిందని కాగ్ చెప్పిన విషయాన్ని దాచిపెడతారా?
► వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం వచ్చాక పోలవరంలో రివర్స్ టెండరింగ్ ద్వారా రూ.800 కోట్లు ఆదా చేశాం.
► పోలవరం అంటే ఒక డ్యామ్ మాత్రమే కాదు.. 1.10 లక్షల కుటుంబాలు కూడా ఉన్నాయి.