municipal minister
-
మున్సిపల్ కార్మికుల సమస్యలపై చర్చించాం: మంత్రి ఆదిమూలపు
-
ఏపీ: మున్సిపల్ కార్మికుల డిమాండ్‌కు సానుకూల స్పందన
సాక్షి, తాడేపల్లి: మున్సిపల్ కార్మికుల డిమాండ్ల విషయంలో సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని.. ఏపీ మున్సిపల్ శాఖ మంత్రి అదిమూలపు సురేష్ తెలిపారు. మున్సిపల్ వర్కర్స్ సమ్యలపై కేబినెట్ సబ్ కమిటీ సమావేశం అయ్యాం. సమస్యలపై చర్చించాం. ఓహెచ్వో ఇచ్చేందుకు 6 వేలు అలానే ఉంచాలనే డిమాండ్‌కు సీఎం జగన్ సానుకూలంగా స్పందించారు. ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 6వేల రూపాయలు యథాతధంగా ఉంటుంది. జీతంతో పాటు, 6 వేలు OHA కలిపి రూ. 21 వేలు వారికి అందించాలని నిర్ణయం తీసుకున్నాం. రాబోయే రోజుల్లో కూడా ఈ ఆక్యుపేషనల్ అలవెన్స్ కొనసాగిస్తాం. మున్సిపల్ ఉద్యోగులు సమ్మె విరమించాలని కోరుతున్నాం అని మంత్రి ఆదిమూలపు వెల్లడించారు. -
ఉన్నత జీవన ప్రమాణాలు అందివ్వడమే లక్ష్యం : సీఎం జగన్
అమరావతి: నగరాలు, పట్టణాల్లోని మధ్య తరగతి ప్రజలకు సొంత ఇంటికల నిజం చేసే దిశగా ముమ్మరంగా కృషి చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంబంధిత అధికారులకు ఆదేశించారు.పట్టణాలు, నగరాల్లోని మధ్య తరగతి ప్రజలకు లాభాపేక్షలేకుండా సరసమైన రేట్లకే ఫ్లాట్లు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. సాలిడ్ వేస్ట్ మేనేజిమెంట్, అర్భన్ హౌసింగ్‌పై క్యాంపు కార్యాలయంలో సోమవారం సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్షించారు. పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ, సాలిడ్ అండ్ లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ టాస్క్‌ఫోర్స్ ఛైర్మన్ ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి వై శ్రీలక్షి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్ ఎం.ఎం.నాయక్, సీసీఎల్ఏ స్పెషల్ కమిషనర్ నారాయణ భరత్ గుప్త, ఆర్ధిక శాఖ కార్యదర్శి గుల్జార్, టిడ్కో ఎండీ సిహెచ్ శ్రీధర్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. స్మార్ట్ టౌన్షిప్లో ఉండాల్సిన మౌలిక సదుపాయాలపై ప్రతిపాదనలను అధికారులు సమర్పించగా వాటిపై సీఎం జగన్ కొన్ని మార్పులు, సూచనలు చేశారు. ప్రజలకు అత్యున్నత జీవన ప్రమాణాలను అందించాలన్నదే లక్ష్యమని సీఎం స్పష్టం చేశారు. వివాదాలు, ఇబ్బందులు లేని, అన్ని అనుమతులతో కూడిన క్లియర్ టైటిల్‌తో లాభాపేక్ష లేకుండా సరసమైన ధరలకు ప్లాట్లు మధ్యతరగతికి అందుబాటులోకి తీసుకురావాలని గతంలోనే ఆదేశించిన విషయాన్ని ప్రస్తావించారు.వివిధ రాష్ట్రాల్లో ఇదివరకే అమలవుతున్న పలు పట్టణ ప్రణాళికలపై ఈ సందర్భంగా అధికారులు సీఎంతో చర్చించారు. ఈ స్కీం కోసం భూములను ఎలా అందుబాటులోకి తీసుకురావాలి? మౌలిక సదుపాయాలను ఎలా కల్పించాలి? తదితర అంశాలపై సమావేశంలో విస్తృతంగా చర్చించారు. మధ్యతరగతి ప్రజలకు సరసమైన ధరలకు ప్లాట్లు ఇవ్వడం అనేది నిరంతర ప్రక్రియ అని సీఎం జగన్ స్పష్టం చేశారు. అర్హులైన వారు ఎప్పుడు దరఖాస్తు చేసుకున్నా ప్లాట్లు ఇచ్చేలా ప్రణాళిక వేసుకోవాలని సూచించారు. ఈ అవసరాలను దృష్టిలో ఉంచుకుని భూములు అందుబాటులో ఉండేలా చూసుకోవాలని తెలిపారు. కొంత ల్యాండ్ బ్యాంకు ఉండడంతో కొత్తగా వచ్చే దరఖాస్తుదారులకు ప్లాట్లు ఇవ్వగలుగుతామని పేర్కొన్నారు. రింగురోడ్ల చుట్టూ స్మార్ట్‌టౌన్స్ లే అవుట్లు పట్టణాల చుట్టూ రింగురోడ్ల నిర్మాణానికి అధికారుల ప్రతిపాదనలపై సీఎం చర్చించారు. భూములు ఇచ్చిన వారికి, ప్రభుత్వానికి ఉభయతారకంగా ప్రయోజనం కలిగేలా నిర్మాణం జరగాలని తెలిపారు. తొలివిడతగా 12 పట్టణాల్లో 18 లే అవుట్స్ చేపట్టాలని ప్రాథమిక నిర్ణయం లే అవుట్ ప్రతిపాదనలు చేశారు. నగరాలు, పట్టణాల్లోని జనాభా ప్రాతిపదికన కనీసం 25 ఎకరాల నుంచి 200 ఎకరాల వరకు స్మార్ట్‌టౌన్స్ రూపకల్పనకు ప్రతిపాదనలు రూపొందించినట్లు అధికారులు తెలిపారు. పనులు ప్రారంభించిన తర్వాత 18 నెలల్లోగా లేఅవుట్ సిద్ధంచేసేలా ప్రణాళిక వేసినట్లు వివరించారు. ‘క్లాప్’ ప్రారంభించండి రాష్ట్రాన్ని పరిశుభ్రంగా ఉంచేలా 100 రోజుల కార్యాచరణ రూపొందించాలని సీఎం జగన్ ఆదేశించారు.క్లీన్ ఆంధ్రప్రదేశ్ సీఎల్ఏపీ (క్లాప్) పేరిట కార్యక్రమం నిర్వహించాలని, వీటిలో ఎన్జీఓలు, ప్రజల భాగస్వామ్యం ఉండేలా చేయాలని సూచించారు. కొత్తగా 3,825 చెత్తను సేకరించే వాహనాలు, మరిన్ని ఆటో టిప్పర్లు 6 వేలకు పైగా బిన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు. మున్సిపాల్టీల్లో వేస్ట్ మేనేజ్మెంట్ వ్యవస్థలు, బయోమైనింగ్‌ను కూడా ప్రారంభించాలని సీఎం ఆదేశించారు. ఈ కార్యక్రమాలతో పరిశుభ్రత విషయంలో మార్పు కనిపించాలని అధికారులకు సీఎం జగన్ స్పష్టం చేశారు. -
ఏప్రిల్ 2 నుంచి టీఎస్–బీపాస్
సాక్షి, హైదరాబాద్: పురపాలక శాఖలో ప్రవేశపెట్టబోతున్న ‘టీఎస్–బీపాస్’విధానం కింద 21 రోజుల్లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేయాల్సిందేనని, ఈ విషయంలో రాజీపడబోమని పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు స్పష్టంచేశారు. ఏప్రిల్ 2 నుంచి రాష్ట్రంలోని 141 మున్సిపాలిటీలు, నగరపాలక సంస్థలతో పాటు ఆరు పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలో టీఎస్–బీపాస్‌ను అమలు చేస్తామన్నారు. టీఎస్–ఐపాస్ ద్వారా పరిశ్రమలకు 35 రకాల అనుమతులను వేగంగా జారీ చేస్తున్నామన్నారు. భవన నిర్మాణాలకు అగ్నిమాపక, విద్యుత్, ట్రాఫిక్, టౌన్ ప్లానింగ్ శాఖల అనుమతులను టీఎస్–బీపాస్ ద్వారా సింగిల్ విండోలో జారీ చేస్తామన్నారు. అనుమతుల జారీలో జాప్యం చేసే అధికారులను బాధ్యు లు చేసి వారిపై జరిమానాలు విధించాలని యోచిస్తున్నామన్నారు. మున్సిపల్ కమిషనర్లు, టౌన్ ప్లానింగ్ సిబ్బందితో మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో గురువారం కేటీఆర్ సమావేశం నిర్వహించారు. రాష్ట్ర పారిశ్రామిక విధానం టీఎస్–ఐపాస్ తరహాలోనే టీఎస్–బీపాస్‌ను ప్రభు త్వం తెస్తోందని, దీనికి అమలుకు సమాయత్తం కావాలన్నారు. హైదరాబాద్ నుంచి పర్యవేక్షిస్తాం పురపాలనలో అవినీతి అరికట్టేలా కఠిన చట్టాలు, విధానాలు రూపకల్పన చేస్తున్నామని, వీటి అమలులో కూడా అంతే కఠినంగా వ్యవహరిస్తామని కేటీఆర్ అన్నారు. ఎవరైనా అధికారి అవినీతికి పాల్పడినట్లు రుజువైతే సస్పెన్షన్ వంటి నామమాత్రపు చర్యలు కాకుండా విధుల నుంచి పూర్తిస్థాయిలో తొలగించే కఠిన చర్యలుంటాయని హెచ్చరించారు. భవన నిర్మాణ అనుమతులను హైదరాబాద్ నుంచి ప్రత్యేకంగా పర్యవేక్షిస్తామన్నారు. టౌన్ ప్లానింగ్ విభాగంలో సిబ్బంది కొరతను అధిగమించేందుకు ఔట్సోర్సింగ్ సిబ్బంది నియామకాలకు అనుమతిస్తామన్నారు. టీఎస్పీఎస్సీ ద్వారా రెగ్యులర్ నియామకాలు జరిగే వరకు ఈ వెసులుబాటు కల్పిస్తామన్నారు. పౌరులే కేంద్రంగా పాలన పౌరులే కేంద్రంగా పురపాలన జరగాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కొత్త మున్సిపల్ చట్టాన్ని మున్సిపల్ కమిషనర్లు జాబ్‌చార్ట్‌గా పరిగణించాలని సూచించారు. ప్రజల ఆకాంక్షలకు తగ్గట్టు పని చేయాలన్నారు. వికేంద్రీకరణ ఫలాలు ప్రజలకు అందా లంటే స్థానిక కమిషనర్లు తమతో పాటు పనిచేసే సిబ్బందితో, స్థానిక ప్రజలతో కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పారిశుద్ధ్యమే ప్రాథమిక విధి.. కొత్త మున్సిపల్ చట్టంలోని పారిశుద్ధ్యం, పచ్చదనం, పౌర సేవలు, పురపాలనలో ఆన్లైన్ సేవ లు, సాంకేతిక వినియోగం, ఫిర్యాదుల పరి ష్కారం, అవినీతి నిర్మూలనకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యతనిస్తోందని గుర్తించుకోవాలని కేటీఆర్ చెప్పారు. పారిశుద్ధ్యం ప్రాథమిక విధి అని, తెల్లవారు జాము 4:30 గంటలకే కమిషనర్లు రోడ్ల మీదకు వచ్చిన పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలన్నారు. పట్టణాలు, నగరాల్లో అవసరమైన రీతిలో పబ్లిక్ టాయిలెట్లను ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు ‘షీ టాయి లెట్ల’ను ఏర్పాటు చేయాలన్నారు. కొత్త మున్సిపల్ చట్టం ప్రకారం మున్సిపల్ బడ్జెట్లో 10% నిధులను హరిత ప్రణాళిక అమలుకు ఖర్చు చేయాలన్నారు. -
పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలు వద్దు: బొత్స
సాక్షి, విజయనగరం : నలభై ఏళ్ల క్రితం విజయనగరం జిల్లాగా ఏర్పడినప్పుడు ఎంతో అభివృద్ధి చేయాలనుకున్నాం కానీ మూడు దశాబ్దాలు ఎమ్మెల్యేగా ఉన్న ఒక వ్యక్తి అభివృద్దిపై దృష్టి సారించకపోవడం మన దురదృష్టమని ఆ జిల్లా నేత, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. శనివారం ఆయన జిల్లా కేంద్రంలో విలేకర్లతో మాట్లాడుతూ.. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల విజయనగరం అభివృద్ధి కుంటుపడిందని విమర్శించారు. టీడీపీ ప్రభుత్వం కార్పొరేషన్లను మున్సిపాలిటీలుగా మార్చినప్పుడు ఆనందపడ్డాం గానీ, తర్వాత వాటిని ఒక్క జీవోతో రద్దు చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల నుంచి వలసలు పెరగడంతో పట్టణాల్లో జనసాంద్రత పెరుగుతోందని, దానికి తగ్గట్టు మౌలిక సదుపాయాల కల్పనపై దృష్టి సారించాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించారు. ప్రజలకు అత్యవసరమని భావించిన పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్న సంకల్పంతో శత పనుల శంఖుస్థాపన కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. పట్టణంలో 24 గంటల నీటి సరఫరాకు కృషి చేస్తున్నామన్నారు. వర్షం వల్ల రోడ్లపై నీరు నిలవకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించామని పేర్కొన్నారు. ఇసుక సమస్యను అధిగమించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. సోషల్ మీడియాలో రాతల గురించి ప్రభుత్వంపై చంద్రబాబు చేస్తున్న వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. అందరిళ్లల్లోనూ మహిళలు ఉంటారని వారిని కించపరుస్తూ మాట్లాడవద్దని హితవు పలికారు. పెయిడ్ ఆర్టిస్టులతో డ్రామాలాడడం మానుకోవాలని చంద్రబాబుకు సూచించారు. -
పన్నులు వేయక తప్పదు: మంత్రి నారాయణ
విజయనగరం: రాష్ట్రంలో మున్సిపాలిటీలు అభివృద్ధి చెందాలంటే పన్నులు వేయక తప్పదని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ చెప్పారు. ఆయన మంగళవారం ఇక్కడ ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దాదాపు 70 మున్సిపాలిటీలు అప్పుల్లో ఉన్నాయని తెలిపారు. విజయవాడ కార్పొరేషన్ రూ. 350 కోట్లు, నెల్లూరు కార్పొరేషన్ రూ. 50 కోట్ల అప్పుల్లో కూరుకుపోయాయని అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 110 మున్సిపాలిటీలను అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. గ్రీన్ కార్పొరేషన్ ద్వారా పార్కులను అభివృద్ధి చేస్తామన్నారు. జిల్లాకొక పవర్ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు జూన్‌లో టెండర్లు పిలుస్తామన్నారు. రాష్ట్రంలో 5 లక్షల మరుగుదొడ్లు నిర్మిస్తామని, విద్యుత్‌ను పొదుపు చేసేందుకు 5,50,000 ఎల్ఈడీ బల్బ్‌లు ఇస్తామని చెప్పారు. మున్సిపల్ పాఠశాలలను కార్పొరేట్ స్థాయికి అభివృద్ధి చేస్తామని చెప్పారు. కార్పొరేషన్ ఎన్నికలు నిర్వహిస్తామని అన్నారు. కొందరు కోర్టుకు వెళ్లడం వల్ల ఎన్నికలు నిలిచాయని, కేసులు వేసిన వారిని వెనక్కి తీసుకోవాలని కోరామన్నారు. -
మంత్రి అక్రమాలన్నీ నిరూపిస్తాం
నెల్లూరు జిల్లా: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మున్సిపల్ పరిపాలన శాఖ మంత్రి పి.నారాయణ అక్రమాలన్నీ నిరూపిస్తామని నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ తెలిపారు. మంగళవారం నెల్లూరులో అనిల్ కుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ... నెల్లూరు నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. నగర అభివృద్ధికి ఏం చర్యలు తీసుకుంటున్నారని మంత్రి నారాయణను ప్రశ్నిస్తే ఆయన తమపైఆరోపణలకు దిగడం సరికాదన్నారు. అదికాక వైజాగ్‌లో తన పనితనం చూడాలని ఆయన చెప్పడం విడ్డూరంగా ఉందని అనిల్ కుమార్ యాదవ్ వెల్లడించారు. -
తెనాలి- గన్నవరం మధ్య ఔటర్ రింగ్‌రోడ్డు
తెనాలి, ఇబ్రహీంపట్నం, విజయవాడ, గన్నవరం పరిధిలో ఔటర్ రింగ్ రోడ్డు నిర్మిస్తామని ఏపీ పురపాలక శాఖ మంత్రి నారాయణ తెలిపారు. ఇందుకు సుమారు 6 లక్షల ఎకరాల భూమి అవసరం అవుతుందన్నారు. రాజధాని సలహా కమిటీ సమావేశం అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 22 నుంచి 26 వరకు సింగ్‌పూర్, పుత్రజయలో పర్యటిస్తామని, అలాగే వచ్చే నెల 5 నుంచి 9వరకు చైనాలోని కుజో, షాంజో నగరాల్లో పర్యటిస్తామని ఆయన తెలిపారు. మన దేశంలోని చండీగఢ్, గాంధీనగర్, నయారాయ్‌పూర్‌లో పర్యటించామని, అన్ని ప్రాంతాల్లో ల్యాండ్ పూలింగ్ విధానాన్ని అమలు చేస్తున్నారని నారాయణ చెప్పారు. ఏపీ రాజధాని నగరాన్ని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలోనే ఏర్పాటు చేస్తామని, దీనికి కనీసం 12,500 ఎకరాల భూమి అవసరమని అంచనా వేస్తున్నామని అన్నారు. భూములు గుర్తించాల్సిందిగా కృష్ణా-గుంటూరు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చామని ఆయన తెలిపారు. ల్యాండ్ పూలింగ్‌లో రైతులకు ఎంత భూములివ్వాలో ఇంకా నిర్ణయించలేదన్నారు. రాజధానుల్లో చండీగఢ్ మోడల్ చాలా బాగుందని మంత్రి నారాయణ చెప్పారు.