నెల్లూరు: నెల్లూరు జిల్లాలో ఆదివారం ఉదయం స్వల్ప భూ ప్రకంపనలు సంభవించాయి. జిల్లాలోని దుత్తలూరు, వరికుంటపాడు మండలాల్లో ఈ రోజు ఉదయం రెండు సార్లు.. కొద్ది సెకన్ల పాటు భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు భయాందోళనలకు గురై రోడ్ల పైకి పరుగులు తీశారు. ఈ భూకంపం వల్ల ఎలాంటి ఆస్తి, ప్రాణనష్టం జరుగలేదు.