ఆన్‌లైన్ షాపింగ్ సిటీగా ఢిల్లీ | best online shopping city is delhi :flipcart | Sakshi
Sakshi News home page

ఆన్‌లైన్ షాపింగ్ సిటీగా ఢిల్లీ

Published Thu, Dec 17 2015 12:45 AM | Last Updated on Wed, Aug 1 2018 3:40 PM

ఆన్‌లైన్ షాపింగ్ సిటీగా ఢిల్లీ - Sakshi

ఆన్‌లైన్ షాపింగ్ సిటీగా ఢిల్లీ

-ఎన్‌సీఆర్ టైర్-2 పట్టణాల్లో
 -గుంటూరుకు చోటు ఫ్లిప్‌కార్ట్ నివేదిక

 
 బెంగళూరు: దేశంలో ఆన్‌లైన్ షాపింగ్ అత్యధికంగా జరిగే ప్రాంతాల్లో ఢిల్లీ-ఎన్‌సీఆర్ టాప్‌లో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో బెంగళూరు, ముంబై, చెన్నై, హైదరాబాద్ ఉన్నాయి. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ నివేదిక ప్రకారం.. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ పట్టణాల వల్ల దక్షిణ భారతదేశం ఈ-కామర్స్ రంగంలో కీలక పాత్ర పోషిస్తోంది. టైర్-1 పట్టణాల్లో పుణే అగ్రస్థానంలో ఉంది. దీని తర్వాతి స్థానాల్లో కోయంబత్తూరు, అహ్మదాబాద్, లక్నో పట్టణాలు ఉన్నాయి. తూర్పు భారత దేశం నుంచి ఒక్క భువనేశ్వర్ మాత్రమే ఫ్లిప్‌కార్ట్ జాబితాలో చోటు దక్కించుకుంది. ఆన్‌లైన్ షాపింగ్ ఎక్కువగా జరిగే టైర్-2 పట్టణాల్లో మంగళూరు, మైసూర్, డెహ్రాడూన్ ప్రాంతాలు ఉన్నాయి. వీటి తర్వాతి స్థానాల్లో సేలం (తమిళనాడు), గుంటూరు ప్రాంతాలు నిలిచాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement