మహిళలకు మెగాస్టార్ మాట | Big B urges women to stop compromising | Sakshi
Sakshi News home page

మహిళలకు మెగాస్టార్ మాట

Published Wed, Sep 14 2016 7:00 PM | Last Updated on Mon, Sep 4 2017 1:29 PM

మహిళలకు మెగాస్టార్ మాట

మహిళలకు మెగాస్టార్ మాట

ముంబై: మహిళలు సాధికారతతో తమ భాగస్వాములతో సమాన స్థాయిలో జీవించాలని, జీవితంలో ఎక్కడా రాజీపడి సంతృప్తి చెందరాదని బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ చెబుతున్నారు. కల్చర్ మిషన్ బ్లష్ చానెల్, వివెల్ కంపెనీతో కలసి అమితాబ్ 'అబ్ సంఝౌతా నహీ' పేరుతో ఓ వీడియోను రూపొందించారు. ఈ వీడియోలో అమితాబ్ మహిళలకు స్ఫూర్తి కలిగించేలా సాధికారత, హోదా గురించి మాట్లాడారు.

మహిళల జీవితం రాజీపడుతూ సాగరాదని అమితాబ్ అన్నారు. మనసులో సంఘర్షణ పడుతున్న మహిళలు వాస్తవిక భావోద్వేగాలతో వాటి నుంచి బయటపడాలని సూచించారు. హక్కు అన్నది ఎప్పుడూ నిశ్శబ్ధంగా ఉండరాదని చెప్పారు. మహిళల ఆత్మవిశ్వాసంతో దేన్నైనా  సాధించగలరని, సానుకూల దృక్పథాన్ని అలవర్చుకోవాలని ఈ వీడియోలో అమితాబ్ చెప్పారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement