లక్నో: వరుస హత్యలకు, దొంగతనాలకు పాల్పడుతోన్న కరడుగట్టిన నేరస్తుడిని ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. ఎతాహ్ జిల్లా వ్యాప్తంగా జరిగే దోపిడీలు, హత్యాయత్న ఘటనలన్నీ కూడా అతడు చేసినవేనంట. ఈ నెల(సెప్టెంబర్) 10న సర్వేశ్ అనే వ్యక్తిని హత్య చేసి దోచుకొని పుష్పేంద్ర అనే దొంగ పరారయ్యాడు.
అతడి కోసం వారం రోజులుగా గాలింపులు జరుపుతున్న పోలీసులకు సిద్ధపురా ప్రాంతంలో పారిపోతుండగా అతడిని అదుపులోకి తీసుకున్నారు. అతడి ఇంట్లో నుంచి పదునైన ఆయుధాలను, రక్తంతో తడిసిన వస్త్రాలను, 900 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
900 మొబైల్ ఫోన్లు, రక్తపు వస్త్రాలు స్వాధీనం
Published Mon, Sep 19 2016 12:51 PM | Last Updated on Wed, Apr 3 2019 4:24 PM
Advertisement
Advertisement