
మెరుగైన ఢిల్లీ ఆరోగ్య మంత్రి ఆరోగ్యం
సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్‌తో బాధపడుతూ ఢిల్లీలోని సాకేత్‌లో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ ఆరోగ్యం మెరుగైంది. ఐసీయూలో చికిత్స పొందుతున్న జైన్ చికిత్సకు స్పందిస్తున్నారని, ఆయనను సోమవారం జనరల్ వార్డుకు తరలిస్తారని ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. ఆయన కోలుకోవడంతో 24 గంటలు పరిశీలనలో ఉంచి జ్వరం, శ్వాస ఇబ్బందులు మళ్లీ తలెత్తకుంటే జనరల్ వార్డుకు తరలిస్తామని వెల్లడించాయి.
కరోనా పాజిటివ్‌తో రాజీవ్‌గాంధీ సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిలో చేరిన జైన్ ఆరోగ్యం విషమించడంతో ఆయనను మ్యాక్స్ ఆస్పత్రికి తరలించారు. జైన్‌కు ప్లాస్మా థెరఫీ ఇవ్వడంతో కోలుకున్నారు. సత్యేందర్ జైన్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నామని ఆప్ ఎమ్మెల్యే సోమనాథ్ భారతి ట్వీటీ చేశారు.