సాక్షి, న్యూఢిల్లీ : కరోనా వైరస్ కేసులు పెరుగుతున్న క్రమంలో వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశ రాజధానిలో కరోనా పరీక్షలు ముమ్మరం చేశామని ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర జైన్ వెల్లడించారు. పరీక్షల సామర్ధ్యాన్ని మూడు రెట్లు పెంచి రోజుకు 60,000 పరీక్షలు నిర్వహిస్తున్నామని తెలిపారు. కోవిడ్-19 కేసులను అరికట్టేందుకు వ్యూహాత్మకంగా పరీక్షల సామర్ధ్యాన్ని పెంచామని చెప్పుకొచ్చారు. ఢిల్లీలో వైరస్ కేసుల సంఖ్య రెట్టింపయ్యే సమయం 50 రోజులకు పెరిగిందని కోవిడ్-19 నుంచి ఇటీవల కోలుకున్న మంత్రి సత్యేంద్ర జైన్ వివరించారు. చదవండి : వైరల్: చీరకట్టులో అదిరిపోయే డాన్స్..
ఢిల్లీలో కరోనా వైరస్ రెండో విడత వ్యాప్తి ఊపందుకుందని సీఎం అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్న క్రమంలో కరోనా పరీక్షలను ప్రభుత్వం పెద్ద ఎత్తున చేపడుతోంది. ఇక ఢిల్లీలో కరోనా మరణాలు తగ్గాయని, మరణాల పదిరోజుల సగటు 0.94 శాతమని మంత్రి తెలిపారు. మొత్తంగా మరణాల రేటు 1.94 శాతంగా నమోదైందని చెప్పారు. ఏడు రోజుల సగటు ఆధారంగా ఢిల్లీలో పాజిటివిటీ రేటు 6.5 శాతమని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment