ఇస్లామాబాద్: గత కొంత కాలంగా ఆర్ధిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ ఈ పరిస్థితుల్లో నుంచి బయట పడటానికి కొంత సమయం పడుతుందన్నారు పాకిస్తాన్ ఆర్థిక శాఖ మంత్రి ఇషాక్ దార్.
గతంలోనూ ఇదే పరిస్థితి...
కరాచీ వాణిజ్య మండలి పరిశ్రమ నిర్వహించిన ఓ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక మంత్రి ఇషాక్ దార్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ బలోపేతం చేయడానికి అనుసరిస్తున్న విధానాలను, భవిష్యత్తు కార్యాచరణను వివరించే ప్రయత్నం చేశారు ఇషాక్ దార్. ఆయన మాట్లాడుతూ.. 1998, 2013 లో మనం ఇంతకంటే ఘోరమైన పరిస్థితులను ఎదుర్కొన్నాం. కానీ కొంత కాలానికి ఆ సంక్షోభం నుంచి బయటపడ్డాము.
పడి లేచిన ఆర్ధిక వ్యవస్థ...
2017 సమయానికి పాకిస్తాన్ ఆర్ధికంగా అత్యుత్తమ స్థాయికి చేరుకుంది. కానీ ప్రస్తుతం దేశంలో ఉన్న రాజకీయ అస్థిరత కారణంగా ఇప్పుడు మళ్ళీ పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థ పతనావస్థకు చేరుకుంది. ఇటువంటి సంక్షోభాలకు తక్షణ పరిష్కారం అంటూ ఉండదు. తేరుకోవడానికి కొంత వ్యవధి పడుతుంది. తొందర్లోనే మనం ఈ దుస్థితి నుండి బయటపడి ఆర్ధికంగా నిలదొక్కుకుంటామన్నారు ఇషాక్ దార్.
నూతన కార్యాచరణ..
కఠినమైన సంస్కరణలు తీసుకొచ్చి సమిష్టిగా సవాళ్ళను ఎదుర్కొంటే పాకిస్తాన్ ఆర్ధిక వ్యవస్థను తిరిగి గాడిలో పడుతుంది. ఇప్పటికే ఈ కార్యాచరణను కూడా మొదలుపెట్టాము. విదేశీ చెల్లింపులకే మా మొదటి ప్రాధాన్యత. వ్యవసాయ రంగంలోనూ ఐటీ రంగంలోనూ విప్లవాత్మక మార్పులను తీసుకురానున్నాము కాబట్టి త్వరితగతినే కుదురుకుంటామన్న ఆశాభావాన్ని వ్యక్తం చేసారు.
ఇది కూడా చదవండి: బీజేపీ ప్రధాని కాదు, భారత దేశ ప్రధాని
Comments
Please login to add a commentAdd a comment