
గడిచిన ఆరు నెలల కాలంలో కమిషనరేట్ పరిధిలోని ప్రజలు పోగొట్టుకున్న మొబైల్ ఫోన్‌లను చాట్‌బాట్ ద్వారా రికవరీ చేశారు

రికవరీ చేసిన ఫోన్‌లను కమాండ్ కంట్రోల్ రూంలో వాటి యజమానులకు బుధవారం అప్పగించారు

చాట్‌బాట్ సేవలను జిల్లాలో ప్రారంభించినట్లు చెప్పారు. ప్రారంభించిన కొద్ది రోజుల్లోనే 300 ఫోన్‌లను రికవరీ చేసి వాటి యజమానులకు అందజేశామన్నారు

ప్రస్తుతం రూ.కోటి విలువ చేసే 628 ఫోన్‌లను రికవరీ చేసినట్లు చెప్పారు

ఫోన్ పోగొట్టుకున్న వెంటనే అధైర్యపడకుండా పోలీసులను సంప్రదించి ఫిర్యాదు చేయాలని కోరారు. 94406 27057కు హాయ్ అని మెసేజ్ పంపితే వెంటనే గూగుల్ పేజీ లింక్ ఓపెన్ అవుతుందని, ఆ లింక్ క్లిక్ చేసి పోయిన మొబైల్ ఫోన్ వివరాలను నమోదు చేస్తే అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పోయిన ఫోన్‌ను గుర్తిస్తామన్నారు

సెకండ్ హ్యాండ్ ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తలు పాటించాలని ఈ సందర్భంగా వారు ప్రజలకు సూచించారు

ఫోన్‌లను దొంగిలించిన వ్యక్తులే అత్యధికంగా అమ్మేందుకు ప్రయత్నిస్తారనే విషయం గుర్తించాలన్నారు







