దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం | one arrested and 12 lakhs recovered by police | Sakshi
Sakshi News home page

దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం

Published Thu, Aug 4 2016 2:11 PM | Last Updated on Mon, Aug 20 2018 4:27 PM

దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం - Sakshi

దొంగ అరెస్ట్..రూ.12 లక్షల సొత్తు స్వాధీనం

మదనపల్లి రూరల్(చిత్తూరు జిల్లా): మదనపల్లి పట్టణంలో చోరీలకు పాల్పడుతున్న మహ్మద్ రఫీక్(40) అనే వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రూ.12 లక్షల విలువ చేసే బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. పట్టణంలో 13 ఇళ్లలో దొంగతనాలకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. వారం క్రితం ఓ ఇంట్లో దొంగతనానికి వచ్చి దొరికిపోవడంతో విషయం వెలుగులోకి వచ్చింది.

దొంగను అదుపులోకి తీసుకున్న పోలీసులు సొత్తును రికవరీ చేయడానికి విషయాన్ని గోప్యంగా ఉంచారు. మహ్మద్ రఫీక్ స్థానికంగా ఉన్న పైనాన్స్ కంపెనీలో రూ.45 లక్షలు తీసుకుని ఓ లారీ కొనుగోలు చేశాడు. తీసుకున్న లారీకి ఇన్‌స్టాల్‌మెంట్లు కట్టలేక, చెడు అలవాట్లకు బానిసై అప్పులపాలయ్యాడు. దీంతో తేలికగా డబ్బులు సంపాదించాలనే ఆలోచనతో చోరీలకు పాల్పడుతూ అడ్డంగా దొరికిపోయాడు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement