ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ చెల్లించాల్సిన రూ.73 కోట్ల బకాయిలకుగాను రూ.61 కోట్లను రికవరీ చేసినట్లు ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌ఓ) తెలిపింది. మార్చి 2020 నుంచి మే 2021 వరకు ఈపీఎఫ్‌ఓకు చెల్లించాల్సిన ఎంప్లాయర్(కంపెనీ) వాటాలో కొంత మొత్తం వసూలైనట్లు పేర్కొంది.
స్పైస్‌జెట్ సంస్థ ఉద్యోగుల వేతనాల్లో కట్ అవుతున్న ఈపీఎఫ్‌ఓ వాటాలో అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించారు. మేనేజ్‌మెంట్ వాటాను ఈపీఎఫ్‌ఓకు జమ చేయడం లేదని, బకాయిపడిన మొత్తాన్ని వడ్డీతో సహా చెల్లించాలని సంస్థకు నోటీసులు అందించారు. దాంతో తాజాగా మార్చి 2020 నుంచి మే 2021 వరకు బకాయిపడిన మొత్తం రూ.73 కోట్లలో రూ.61 కోట్లు రికవరీ అయినట్లు ఈపీఎఫ్‌ఓ తెలిపింది. ఆలస్య చెల్లింపునకు సంబంధించిన వడ్డీ, జనవరి 2022 తర్వాత చెల్లించాల్సిన బకాయిలను కూడా అంచనా వేసినట్లు పేర్కొంది.
ఈ సందర్భంగా స్పైస్‌జెట్ అధికారి ఒకరు మాట్లాడుతూ..‘ఈపీఎఫ్ సెక్షన్ 14బీ, ఇతర నిబంధనల చట్టం 1952 ప్రకారం విచారణ జరుగుతుంది. చట్టంలోని సెక్షన్ 7A కింద మిగిలిన కాలానికి (ఇప్పటి వరకు) ఎంత చెల్లించాలో లెక్కించి దాన్ని రికవరీ చేసే ప్రక్రియ మొదలైంది’ అని చెప్పారు.
ఇదీ చదవండి: అంబానీ చెల్లి.. భర్త చనిపోయినా కోట్ల కంపెనీకి ఛైర్‌పర్సన్‌గా..
ఈపీఎఫ్‌ఓ పరిధిలోని ప్రతి సంస్థ ఎంప్లాయర్ వాటాను ఉద్యోగభవిష్య నిధిలో జమ చేయాలి. ప్రతి నెలా 15వ తేదీలోపు ఈపీఎఫ్‌ఓలో తమ రిటర్న్‌లను ఫైల్ చేయాలి. లేదంటే బకాయిపడిన తేదీ నుంచి ఏటా 12% చొప్పున వడ్డీతో కలిపి చెల్లించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment