లంగర్‌హౌజ్(హైదరాబాద్ క్రైం): పంచలోహ విగ్రహాన్ని అమ్మేందుకు ప్రయత్నిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ సంఘటన లంగర్‌హౌజ్‌లోని సనా హోటల్‌లో గురువారం జరిగింది. వివరాలు.. ఉత్తరప్రదేశ్‌కు చెందిన హుస్సేన్‌షేక్(25) ఓల్డ్ అల్వాల్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే, ఆరు రోజుల క్రితం సునీల్ అనే వ్యక్తి నుంచి మహవీర్ పంచలోహ విగ్రహాన్ని రూ. 2.5 లక్షలకు విక్రయించారు.
ఈ క్రమంలోనే ఆ విగ్రహన్ని తిరిగి రూ. 5 లక్షలకు అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా లంగర్‌హౌజ్‌లోని సనా హోటల్‌లో నార్త్‌జోన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. విగ్రహం విషయం ఆరా తీయగా జరిగిన విషయం పోలీసులకు తెలిపాడు. దీంతో పోలీసులు పరారీలో ఉన్న సునీల్ ఆచూకి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.