
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్‌ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్‌ఫోన్‌లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.
ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment