సెల్‌ఫోన్‌ రికవరీలో ‘అనంత’ టాప్‌ | Massive Mobile Phone Recovery in Anantapur | Sakshi
Sakshi News home page

సెల్‌ఫోన్‌ రికవరీలో ‘అనంత’ టాప్‌

Published Wed, Oct 30 2024 3:57 AM | Last Updated on Wed, Oct 30 2024 3:57 AM

Massive Mobile Phone Recovery in Anantapur

ఇప్పటివరకు రూ.18.85 కోట్ల విలువైన 10,195 సెల్‌ఫోన్ల రికవరీ 

ఒక్కరోజే 1,309 ఫోన్లు బాధితులకు అందజేత

అనంతపురం: సెల్‌ఫోన్ల రికవరీలో 10 వేల మైలురాయిని దాటి అనంతపురం పోలీసులు దేశంలోనే అగ్రస్థానంలో నిలిచారు. ఇప్పటివరకు మొత్తం 10,195 ఫోన్ల రికవరీ చేసి, బాధితులకు అందజేశారు. వీటివిలువ సుమారు రూ.18.85 కోట్లుగా నిర్ధారించారు.

 తాజాగా రికవరీ చేసిన 1,309 మొబైల్‌ ఫోన్లను బాధితులకు మంగళవారం అనంతపురంలోని పోలీస్‌ పరేడ్‌ మైదానంలో ఎస్పీ పి.జగదీష్‌ అందజేశారు. వీటివిలువ రూ.3.45 కోట్లు ఉంటుందని పోలీస్‌ అధికారులు తెలిపారు. సెల్‌ఫోన్‌ పోగొట్టుకున్న తర్వాత ఆచూకీ దొరకదనుకునే ఫోన్లను సైతం రికవరీ చేసి అందజేయడంతో బాధితులు హర్షం వ్యక్తం చేస్తూ పోలీసులను అభినందించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని బాధితులకు 1,156 ఫోన్లు అందజేశారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement