phone lost
-
ఫోన్ల రికవరీలో అనంతపురం పోలీసుల రికార్డు.. ఏకంగా 18.85 కోట్ల విలువైన
సాక్షి, అనంతపురం: అనంతపురం పోలీస్ మైదానంలో సెల్ఫోన్ల రికవరీ మేళా నిర్వహించారు. సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు క్యూ కట్టడంతో పరేడ్ మైదానం జాతరను తలపించింది. మంగళవారం ఒక్కరోజే 1309 మంది బాధితులకు తమ ఫోన్లను తిరిగి అందజేశారు పోలీసులు. ఫోన్లు రివకరీ చేసిన సిబ్బందిని పోలీసులు ప్రశంసించి రివార్డులు అందించారు.ఇప్పటి వరకు జిల్లాలో 10వేల మందికి సంబంధించిన 18.5 కోట్ల రూపాయల విలువైన సెల్ ఫోన్లను రికవరీ చేసి ఇచ్చామని జిల్లా ఎస్పీ జగదీష్ తెలిపారు. ఇవాళ అందజేసిన ఫోన్ల విలువ రూ. 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని తెలిపారు. ఇప్పటి వరకు 10,195 ఫోన్లు రికవరీ చేయగా.. వీటిలో 19 జిల్లాలకు 2535 ఫోన్లను, 20 రాష్ట్రాలకు 1056 మొబైళ్లను పంపిణీ చేశామని తెలిపారు. రికవరీ చేసి నేడు అందించిన ఫోన్ల విలువ 3 కోట్ల 45 లక్షలు ఉంటుందని చెప్పారు. -
ఫోన్ పోతే.. ఇలా వెతకండి!
షాపింగ్ నుంచి ఇంటికి వచ్చిన వసుధ తెచ్చిన వస్తువులన్నీ లోపల సర్దేసి, వచ్చి కూచుంది. సడెన్‌గా ఏదో గుర్తుకువచ్చినట్టు అయ్యి ఫోన్ కోసం వెతికింది. చూస్తే, ఎక్కడా కనిపించలేదు. బ్యాగ్, ఇంటిలోపల అంతా చెక్ చేసింది. ఫోన్ కనపడకపోయేసరికి ఒక్కసారిగా మైండ్ బ్లాంక్ అయ్యింది. ఖరీదైన ఫోన్, అందులో వందలాది కాంటాక్ట్ నంబర్లు, ముఖ్యమైన ఫొటోలు.. అనుకునేసరికి కాసేపటి వరకు ఏం చేయాలో అర్ధం కాలేదు. తన ముఖ్యమైన డేటా పోతే వచ్చే సమస్యలు తలుచుకుని చెమటలు పట్టేశాయి. ∙∙ వసుధ సమస్య చాలామంది ఎదుర్కొనే ఉంటారు. ఈ సమస్య నుంచి ఎలా బయటపడాలి? ఫోన్ ట్రాక్ చేయాలన్నా, మన వ్యక్తిగత డేటా సురక్షితంగా ఉండటానికి మార్గమే లేదా? అనుకునేవారికి సరైన సమాధానంగా సిఇఐఆర్ వరదాయినిగా మారింది. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని ఎలా ఉపయోగించాలో తెలుసుకుందాం. ∙∙ నకిలీ మొబైల్ ఫోన్ల క్రయవిక్రయాలకు అడ్డుకట్టవేయడానికి, మొబైల్ ఫోన్ దొంగతనాన్ని అరికట్టడానికి, వినియోగదారుల ప్రయోజనాలను పరిరక్షించడానికి, ఎన్ఫోర్స్మెంట్ ఏజెన్సీల ద్వారా చట్టబద్ధమైన రక్షణ కలిగించడానికి సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్ట్రీ (సిఇఐఆర్)ని డిపార్ట్మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ (డాట్) ఏర్పాటు చేసింది. సిఇఐఆర్ పోర్టల్ ప్రయోజనాలు: https://ceir.gov.in పోర్టల్ పోగొట్టుకున్న లేదా దొంగలించిన మొబైల్ పరికరాలను ట్రాక్ చేయడానికి ఐఎమ్ఇఐ నంబర్‌ను ఉపయోగిస్తుంది. సిఇఐఆర్ ద్వారా మొబైల్ పరికరం బ్లాక్ చేశాక, అది ఏ భారతీయ నెట్వర్క్ కంపెనీకి కనెక్ట్ చేయలేరు. ఆ పరికరాన్ని ఇక తిరిగి ఉపయోగించలేనిదిగా మార్చేస్తుంది. పోర్టల్‌లో మొబైల్ ఫోన్‌ను బ్లాక్ చేయడానికి.. ►ముందుగా పోలీస్ స్టేషన్‌కి వెళ్లి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయాలి. లేదా కోల్పోయిన డివైజ్ సర్టిఫికెట్ లేదా మీ అక్నాలెడ్జ్ కాపీని తీసుకోవాలి. ►మీ సర్వీస్ ప్రొవైడర్ నుంచి డూప్లికేట్ సిమ్ తీసుకోవాలి. ►సిఇఐఆర్ పోర్టల్‌కు లాగిన్ అయ్యి, కంప్లైంట్ కాపీ, ఐడెంటిటీ (ఆధార్ కార్డ్) ప్రూఫ్‌ని యాడ్ చేయాలి. https://www.ceir.gov.in/Request/CeirUserBlockRequestDirect.jsp ►మీ ఫారమ్ సబ్మిట్ చేసిన తర్వాత మీ రిక్వెస్ట్ ఐడీ జనరేట్ అవుతుంది. ►మొబైల్ నంబర్‌ను బ్లాక్ చేయడానికి తగిన కారణం ఏంటో తెలియజేయాలి. ►మీ రిజిస్టర్ నంబర్‌కు ఓటీపీ వస్తుంది. దానిని ఎంటర్ చేసి, సబ్మిట్ చేయాలి. ఐఎమ్ఇఐ నంబర్‌ను చెక్ చేయడానికి.. ►ముందు పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/ Device/CeirIMEI Verification.jsp ►మీ మొబైల్ నెంబర్‌ను ఎంటర్ చేయాలి. ►మీ మొబైల్‌కి ఓటీపి వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయాలి. ►15 అంకెల ఐఎమ్ఇఐ నంబర్‌ను నమోదు చేసి, చెక్ రిక్వెస్ట్ అనే దానిపై క్లిక్ చేయాలి. ►ఐఎమ్ఇఐ నంబర్ ధ్రువీకరణ అవుతుంది. సిఇఐఆర్ పోర్టల్‌లో మీ రిక్వెస్ట్ స్టేటస్ చెక్ చేయడానికి.. ►పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాలి. https://ceir.gov.in/Request/CeirRequestStatus.jsp ►రిక్వెస్ట్ స్టేటస్ ఆప్షన్‌ను చెక్ చేస్తే, తెలిసిపోతుంది. పోర్టల్‌లో రికవరీ మొబైల్ ఫోన్‌ని అన్‌బ్లాక్ చేయడానికి.. https://ceir.gov.in/ Request/CeirUser UnblockRequest Direct.jsp పోర్టల్‌కు లాగిన్ అవ్వాలి. ►రిక్వెస్ట్ ఐడీని ఎంటర్ చేయాలి. ►మొబైల్ నంబర్‌ను అన్‌బ్లాక్ చేయడానికి కారణాన్ని ఇవ్వాలి. డివైజ్‌ను గుర్తించాక డేటాను తొలగించడానికి.. ►ఆండ్రాయిడ్ డివైజ్ డేటాను లాక్ లేదా ఎరేజ్ చేయడానికి https://support.google.com/ accounts/answer/6160491?hl=en ►ఐ ఫోన్ అయితే.. iCloud.com లో ఫైండ్ మై ఐఫోన్ అని సెర్చ్ చేసి, డేటా తొలగించాలి. https://support.apple.com/en-in/guide/icloud/mmfc0ef36f/icloud పోయిన మొబైల్ డేటా సురక్షితంగా ఉంచడానికి.. ►ఈ పోర్టల్ పూర్తిగా చట్టబద్ధమైనది. ఫోన్ ట్రాక్ చేయడానికి మాత్రమే ఉపయోగిస్తుంది. మీ డేటా, యాప్స్‌ను డీకంపైల్ చేయదు. https://reports.exodus-privacy.eu.org/en/ ►మీ మొబైల్ నంబర్లను నిర్ధారించడానికి, తీసేయడానికి టెలికాం విభాగాం అనుమతిస్తుంది. https://tafcop.dgtelecom.gov.in ►ఎస్సెమ్మెస్‌లు, బల్క్ ఎస్సెమ్మెస్‌లు పంపినవారిని గుర్తించడానికి అనుమతిస్తుంది. https://smsheader.trai.gov.in ►ఎస్సెమ్మెస్, వాట్సప్, ఇమెయిల్‌లో వచ్చిన షార్ట్ లింక్స్ మీ వ్యక్తిగత డేటాను డామేజీ చేయవచ్చు. అందుకని, షార్ట్ లింక్స్ పూర్తి యుఆర్ ఎల్ వివరాలను https://isitphishing.org/ ద్వారా చెక్‌చేయవచ్చు. ►యాంటీవైరస్, యాంటీ మాల్వేర్, సెక్యూరిటీ యాప్‌లను ఫోన్లో ఇన్స్టాల్ చేసి ఉంటే వాటిని గుర్తించడంలో సహాయపడుతుంది. ∙అన్ని అప్లికేషన్లు, సోషల్‌మీడియా, ఇమెయిల్ అకౌంట్స్ కోసం రెండంచెల ప్రామాణీకరణను ఉపయోగిస్తే, డేటా సురక్షితంగా ఉంటుంది. బ్లాక్ చేస్తే.. పనిచేయదు బ్లాక్ లిస్ట్ చేసిన మొబైల్ పరికరాలను షేర్ చేయడానికి నెట్వర్క్ ఆపరేటర్లకు సెంట్రల్ సపోర్ట్ సిస్టమ్‌గా సేవలందిస్తూ, అన్ని మొబైల్ ఆపరేటర్ల ఇంటర్నేషనల్ మొబైల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ (ఐఎమ్ఇఐ) డేటాబేస్లకు లింక్ చేస్తుంది. సబ్స్క్రయిబర్ ఐడెంటిటీ మాడ్యూల్ (సిమ్) కార్డ్ మార్చినప్పటికీ ఒక నెట్‌వర్క్‌లోని బ్లాక్ చేసిన పరికరాలు ఇతర నెట్‌వర్క్‌లలో పనిచేయవని ఇది నిర్ధారిస్తుంది. ఇన్పుట్స్: అనీల్ రాచమల్ల, డిజిటల్ వెల్బీయింగ్ ఎక్స్పర్ట్, ఎండ్ నౌ ఫౌండేషన్ -
ఫోన్ పోయిందా.. నో వర్రీస్.. ఏపీ పోలీసులు పట్టేస్తారు
కోనేరు సెంటర్ (మచిలీపట్నం): సెల్‌ఫోన్ మనిషికి నిత్యావసరమైపోయింది. అది లేకుండా అడుగు ముందుకు వేయలేని పరిస్థితి. అలాంటి ఫోన్ ఒక్కసారిగా పోతే అన్ని బంధాలు తెగిపోయినట్లుగా జనం భావిస్తున్నారు. ముఖ్యంగా యువతీ, యువకులు చేతిలో సెల్‌ఫోన్ పోతే ఇక జీవితమే లేదన్న స్థాయిలో మదనపడిపోతున్నారు. ఈ నేపథ్యంలో వినియోగదారులు పోగొట్టుకున్న సెల్ఫోన్ల రికవరీపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. దీనికోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే కొత్త సాంకేతికతను తీసుకొచ్చారు. డేటాతోనే ఆందోళన.. జిల్లాలో సెల్‌ఫోన్ చోరీలు సాధారణంగా మారిపోయాయి. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు వాటి ఖరీదు గురించి ఆలోచించనప్పటికీ ఫోన్లో భద్రపరచుకుంటున్న డేటా విషయంలో ఎక్కువ ఆవేదనకు గురవుతున్నారు. సుదూర ప్రాంతాల్లో ఉన్న హితులు, స్నేహితులు, బంధువుల ఫోన్ నంబర్లతో పాటు పలు విలువైన, అత్యంత కీలకమైన పత్రాలను సైతం సెల్ఫోన్లోనే భద్రపరచుకోవటం ప్రస్తుత పరిస్థితుల్లో పరిపాటిగా మారింది. వినియోగంలో ఉంటేనే.. జిల్లాలో 200 సెల్ఫోన్లు రికవరీ చేసిన పోలీసులు మిగిలిన ఫోన్లు వాడుకలో లేకపోవటంతో రికవరీ చేయటం ఒకింత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ దొంగిలించిన మొబైల్‌ను ఏ క్షణాన ఉపయోగించినా రికవరీ చేస్తారు. అయితే బాధితులు ఫిర్యాదులో పూర్తి పేరు, చిరునామాతో పాటు కాంటాక్ట్ నంబరు, 15 అంకెలతో కూడిన ఐఎంఈఐ నంబర్‌ను తెలియజేయాలి. పై వాటిలో ఏ ఒక్కటి సరిగా లేకపోయినా ఫోన్లు రికవరీ చేయటం కష్టం. ఈ నేపథ్యంలో వాట్సాప్ నంబర్లో సమాచారం పొందుపరిచేటప్పుడు బాధితులు తగిన జాగ్రత్తలు తీసుకుని పూర్తి సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. ఇలా ఫిర్యాదు చేయాలి.. సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపట్టిన ఎస్పీ అందుకోసం మిస్సింగ్ మొబైల్ ట్రాకింగ్ సిస్టం (ఎంఎంటీఎస్) అనే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగంలోకి తీసుకువచ్చారు. సెల్‌ఫోన్ పోగొట్టుకున్న బాధితులు ఈ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 9490617573 అనే వాట్సాప్ నంబర్‌కు ‘హాయ్’ అని లేదా ‘హెల్ప్’ అని మెసేజ్ పెట్టి యాప్ అడిగే ప్రశ్నలకు పూర్తి సమాధానాలు ఇచ్చి, ఫిర్యాదును ఆన్లైన్ చేసుకోవాలి. వాట్సాప్ నంబరు ద్వారా అందిన ఫిర్యాదును ఐటీ కోర్ టీం సిబ్బంది, సీసీఎస్ సిబ్బంది స్వీకరించి సెల్ఫోన్లను రికవరీ చేసేందుకు చర్యలు చేపతారు. ఈ విధానాన్ని జనవరి మాసంలో ఎస్పీ ప్రారంభించగా.. మొదటి మూడు నెలల్లోనే దాదాపు 1700 ఫిర్యాదులు జిల్లా పోలీసులకు అందినట్లు గణాంకాలు చెబుతున్నాయి. వీటిల్లో ఇప్పటి వరకూ దాదాపు రూ. 50 లక్షల విలువ చేసే సుమారు 200 సెల్ఫోన్లను రికవరీ చేశారు. ఉపయోగంలో ఉంటే వెంటనే రికవరీ.. జిల్లాలో ఇప్పటి వరకు 1700 ఫిర్యాదులు అందాయి. వీటిని ఐటీ కోర్ టీంకు అందజేస్తున్నాం. ఫోన్లను రికవరీ చేసేందుకు జిల్లాలో ప్రత్యేక టీంలను రంగంలోకి దింపాం. రూ. 50 లక్షల విలువ చేసే 200 సెల్ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేశాం. అతి త్వరలోనే మిగిలిన ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందజేస్తాం. – జాషువ, ఎస్పీ, కృష్ణా జిల్లా -
ఫోన్ పోతే ఇలా తేలికగా కనిపెట్టొచ్చని తెలుసా?
Trace Lost Android Phone Method: పడుకున్నా.. మెలకువతో ఉన్నా పక్కన స్మార్ట్ ఫోన్ కనిపించకుండా పోతే గుండె ఆగినంతగా ఫీలయిపోతుంటారు చాలామంది. ఒకవేళ నిజంగా ఫోన్ పోతే.. ఏం చేయాలో పాలుపోక ఆందోళన చెందుతుంటారు. అలాంటి టైంలో వేరే డివైజ్ నుంచి ఫోన్‌ను కనిపెట్టేందుకు సైతం ఆప్షన్స్ ఉన్నాయి. ఫోన్ ఆన్‌లో ఉండడం, ఇంటర్నెట్ కనెక్టివిటీ, జీపీఎస్ ఇవిగనుక ఆన్‌లో ఉంటే.. ‘ఫైండ్ మై డివైజ్’ యాప్, గూగుల్ అకౌంట్‌కు కనెక్ట్ అయ్యి ఉండడం.. ఇవన్నీ ఉండాలి. లేకుంటే పోయిన ఫోన్‌ను కనుగొనడం కష్టం అవుతుంది. గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్ ద్వారా ఎలా కనిపెట్టాలో చూద్దాం ఇప్పుడు. ► ముందుగా మరో డివైజ్‌ను తీసుకుని android.com/find లో గూగుల్ అకౌంట్‌తో (పోయిన ఫోన్లోని గూగుల్ అకౌంట్‌తోనే) లాగిన్ కావాలి. అప్పుడు ఆ రెండు ఫోన్లు ఒకే అకౌంట్‌కు లింక్ అయ్యి ఉంటాయి. కాబట్టి. ఫోన్ ఎక్కడుందనే ఆప్షన్‌ను ట్రేస్ చేసి లొకేషన్‌ను(సరైన లొకేషన్/లేదంటే ఆ దగ్గరి ప్రాంతంలో) గుర్తించడం తేలిక అవుతుంది. అయితే ఫోన్ ఉన్న లొకేషన్ చూపించినప్పుడు.. అక్కడికి ఒంటరిగా వెళ్లకపోవడం మంచిది. ► గూగుల్ ఫైండ్ మై డివైజ్ ఫీచర్లో ‘ప్లే సౌండ్’ అనే ఆప్షన్ ఉంటుంది. ఫోన్‌ను ఎక్కడో పెట్టి మరిచిపోయినప్పుడు, లేదంటే ఫోన్ దొంగతనానికి గురై దగ్గర్లోనే ఉన్నప్పుడు గుర్తించడానికి ఈ ఫీచర్ సాయపడుతుంది. ఫోన్ కనిపెట్టిన ప్రాంతానికి వెళ్లినప్పుడు ఈ ఆప్షన్‌ను గనుక క్లిక్ చేస్తే.. ఫోన్ సైలెంట్ మోడ్‌లో ఉన్నా సరే ఐదు నిమిషాలపాటు ఏకధాటిన టోన్ మోగుతూనే ఉంటుంది. అప్పుడు ఫోన్‌ను కనిపెట్టుకోవచ్చు. ► ఫోన్ దొంగతనం అవ్వాలనే గ్యారెంటీ ఏం ఉండదు. ఒక్కోసారి ఎక్కడో పెట్టి మరిచిపోవచ్చు కూడా. ఆ టైంలో ఫోన్ రిటర్న్ చేయాలనే ఉద్దేశం ఉన్నవాళ్ల కోసం ‘సెక్యూర్ డివైజ్’ ఆప్షన్ ఉంటుంది. దానిని గనుక క్లిక్ చేస్తే.. పోయిన ఫోన్ స్క్రీన్‌పై అవతలి వాళ్లకు ఓ మెసేజ్ పంపడానికి ఛాన్స్ వస్తుంది. అంతేకాదు ప్రత్యామ్నాయ నెంబర్‌ను కూడా వాళ్లకు పంపొచ్చు. అయితే ఈ ఆప్షన్, ఫోన్లోని డేటా సంరక్షణ కోసం ఫోన్‌ను లాక్ చేస్తుంది కూడా. ► ఒకవేళ ఫోన్‌ను కనుక్కోవడం కష్టతరంగా మారిన టైంలో.. ఆ ఫోన్లోని డేటాను మొత్తం ఎరేజ్ చేయొచ్చు. అందుకోసం అదే పేజీలో ఉండే.. ‘ఎరేజ్ డివైజ్’.. బటన్‌ను క్లిక్ చేసి కన్ఫర్మ్ చేయాలి. అప్పుడు ఇంటర్నల్ స్టోరేజ్‌లో ఉన్న డేటా మొత్తం డిలేట్ అయిపోతుంది. కానీ, ఎక్స్టర్నల్గా ఉన్న ఫోన్ డేటా మాత్రం అలాగే ఉండిపోతుంది. క్లిక్ చేయండి: బుల్లెట్ బండి! పుట్టింది ఇలా.. -
ఫ్యామిలీ గ్రూప్‌లో నగ్న చిత్రాలు.. కాపురంలో చిచ్చు
ఫోన్ పోతే లైట్ తీసుకునేవాళ్లకు ఒక అలర్ట్ లాంటిది ఈ ఘటన. ఫోన్ చోరీకి గురైందని పట్టించుకోకుండా ఉండిపోయింది ఆమె. అయితే నెలరోజుల తర్వాత ఆమె వాట్సాప్ నుంచే ఫ్యామిలీ గ్రూప్‌లో ఆమెవేనంటూ నగ్న ఫొటోలు, అశ్లీల వీడియోలు షేర్ చేశాడు ఆ దొంగ. అంతేకాదు పని చేసే చోట ఆమె ఎఫైర్లు పెట్టుకుందంటూ ఆమె భర్తకే కాల్ చేసి చెప్పాడు. కాపురంలో చిచ్చు పెట్టిన ఫోన్ చోరీ ఘటన మధ్యప్రదేశ్‌లో చోటు చేసుకుంది. భోపాల్: గ్వాలియర్‌కు చెందిన మహిళ(28) స్థానికంగా ఆస్పత్రిలో నర్స్‌గా పనిచేస్తోంది. నెల క్రితం ఫోన్ పోగా.. ఆ విషయాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఆపై కొత్త ఫోన్ కొనుక్కుని వాడుకుంటోంది. పది రోజుల కిందట కుటుంబ సభ్యులకు, ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్‌లో ఆమె నగ్న చిత్రాలు, అశ్లీల దృశ్యాలు షేర్ అయ్యాయి. అవి చూసి ఆమె కంగుతింది. తన ప్రమేయం లేకుండా తన వాట్సాప్ నుంచే అవి పోస్ట్‌కావడంతో భయపడింది. ఈలోపు ఆమె భర్తకు ఓ ఫోన్ కాల్ వచ్చింది. ప్రతీకాత్మక చిత్రం ఖంగుతిన్న భర్త ఆమె పనిచేస్తున్న ఆస్పత్రిలో మేల్ స్టాఫ్‌తో శారీరక సంబంధం పెట్టుకుందని, అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు తన దగ్గర ఉన్నాయని ఆ ఆగంతకుడు ఆమె భర్తకి ఫోన్లో చెప్పాడు. అంతటితో ఆగకుండా కొన్ని పంపాడు కూడా. దీంతో ఆమె భర్త షాక్ తిన్నాడు. నిలదీయడంతో భార్యాభర్తల మధ్య గొడవలు మొదలయ్యాయి. ఈ మొత్తం వ్యవహారంతో పరువు పొగొట్టుకున్న ఆ యువతి.. మహరాజ్‌పుర పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ప్రతీకాత్మక చిత్రం అవి మార్ఫింగ్‌వి! కాగా, తనవని ప్రచారం జరుగుతన్న ఫొటోలు, వీడియోలు ఎవరో మార్ఫ్ చేసినవని ఆమె వాపోయింది. ఈ మేరకు మీడియా ముందుకు వచ్చిన ఆమె.. వాటిని షేర్ చేయొద్దని ప్రజలకు రిక్వెస్ట్ చేసింది. ఈ విషయంలో భర్త కుటుంబంతో రాజీ చర్చలు జరుపుతున్నామని ఆమె బంధువు ఒకరు తెలిపారు. కాగా, వేధింపులు, బ్లాక్‌మెయిలింగ్ నేరాల కింద కేసు నమోదు చేసుకున్న మహరాజ్‌పుర పోలీసులు.. సైబర్ క్రైమ్ వింగ్సాయంతో కేసును చేధించి నిందితుడిని పట్టుకునే పనిలో పడ్డారు. -
పేటీఎమ్ మొబైల్ ఇన్సూరెన్స్
ముంబై: మనం ఎంతో ఇస్టపడి, వేలకు వేల రూపాయలు పోసిన కొన్న ఫోన్ పోతే మనం ఎంతో ఫీల్ అవుతాం.. ఫోన్ కు ఇన్సూరెన్స్ చేసుకొని ఉంటే బాగుండేది అని బాధపడతాం. కానీ ఇప్పుడు మీ ఫోన్ పోయినా, దానికి ఇప్పుడు ఆ దిగులు అవసరం లేదు. మీ ఫోన్లో పేటీఎమ్ ఉంటే చాలు. మీ ఫోన్‌కు ఇన్సూరెన్స్ వస్తుంది. ఇందుకు చేయాల్సిందల్లా ఒకటే, మీ పోన్లో పేటీఎమ్ యాప్ ఇన్స్టాల్ చేసుకొంటే చాలు. పేటీఎమ్ వాలెట్ యాప్ ఉన్న పోన్ పోతే, పేటీఎమ్ అకౌంట్లో ఉన్న డబ్బుతో పాటు, మీఫోన్‌కు పేటీఎమ్ ఇన్సూరెన్స్ ఇస్తోంది. ఇది గురువారం నుంచి అందుబాటులోకి వచ్చింది. పేటీఎమ్వాడుతున్న వినియోగదారులు అందరూ ఈ ఇన్సూరెన్స్‌ను పొందవచ్చు. ఎలా వస్తుందంటే..?: పేటీఎమ్ వాలెట్ ఉన్న ఫోన్, పేటీఎమ్ అకౌంట్లో ఉన్న డబ్బు పోయిన 24గంటల్లో పేటీఎం కష్టమర్ కేర్ నంబర్‌కు(+91 9643979797) ఫోన్ చేసి కంప్లెయింట్ చేయాలి. ఫోన్ పోతే పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి ఎఫ్ఐఆర్ నమోదు చేయించాల్సి ఉంటుంది. అనంతరం పేటీఎమ్ అన్ని వివరాలు పూర్తిగా ఎంక్వైరీ చేసిన తర్వాత 5రోజుల్లో మీ పేటీఎమ్ అకౌంట్‌కు మీ డబ్బు జత చేయబడుతుంది. ఈ 5రోజులు మీ పేటీఎమ్ అకౌంట్ బ్లాక్ చేస్తారు. 5 రోజుల తర్వాత కొత్త పాస్వర్డ్ మీ నెంబర్‌కు మెస్సేజ్ వస్తుంది. దానితో మీ పాత పేటీఎమ్ అకౌంట్లోకి లాగిన్అవ్వొచ్చు. అయితే ఇన్సూరెన్స్ కింద వినియోగదారునికి రూ.20వేలు మాత్రమే అందిస్తుంది.