పాట్నా: బీహార్లో మరోసారి బాంబుల కలకలం చెలరేగింది. సోమవారం కిషన్గంజ్ జిల్లాలో ప్యాసింజర్ రైల్లో నుంచి ఎనిమిది బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఓ బోగీలో బాంబులు ఉంచినట్టు రైల్వే పోలీసులు గుర్తించారు.
కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు రైల్వే పోలీస్ అధికారి తెలిపారు. ఈ సంఘటనకు సంబంధించి ఇంతవరకు ఎవరినీ అరెస్ట్ చేయలేదని వివరించారు. ఎవరికో బాంబులను సరఫరా చేసేందుకు తీసుకెళ్తున్నట్టు భావిస్తున్నామని చెప్పారు. రైలును లక్ష్యంగా చేసుకుని బాంబులు అమర్చారా అన్న ప్రశ్నకు సమాధానమిచ్చేందుకు ఆయన నిరాకరించారు.
రైల్లో 8 బాంబులు స్వాధీనం
Published Mon, Jun 30 2014 3:23 PM | Last Updated on Wed, Sep 26 2018 3:36 PM
Advertisement
Advertisement