గాంధీనగర్: ప్రస్తుతం మన దేశంలో టిక్‌టాక్ యాప్‌కున్న క్రేజ్.. ఇతర ఏ యాప్‌లకు లేదనడంలో సందేహం లేదు. ఈ సోషల్ మీడియా యాప్ ఒక్కరోజులో కొందరిని సెలబ్రిటీలని చేస్తే.. మరోవైపు ఒక్క రోజులోనే మనుషుల్ని విగత జీవులుగా కూడా మారుస్తుంది. ఈ మధ్య కాలంలో కొందరు ప్రభుత్వ ఉద్యోగులు కూడా టిక్‌టాక్ మోజులో పడి.. విధులను నిర్లక్ష్యం చేస్తూ.. సస్పెన్షన్ ఆర్డర్స్ అందుకుంటున్న వార్తల్ని నిత్యం చూస్తూనే ఉన్నాం. ఇంత జరుగుతున్నా వారిలో మార్పు రావడంలేదు. ప్రస్తుతం ఈ జాబితాలోకి గుజరాత్ పోలీసులు కూడా వచ్చి చేరారు.
వీరు ఏకంగా ప్రధాని నరేంద్ర మోదీని అనుకరిస్తూ.. వీడియో చేసి టిక్‌టాక్‌లో పోస్ట్ చేసి అడ్డంగా బుక్కయ్యారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోన్న ఈ వీడియోలో ఐదుగురు పోలీసు అధికారులు పోలీస్ వాహనం ముందు నిల్చుని ఉన్నారు. వారిలో ఒక అధికారి మోదీ ప్రసంగంలోని కొన్ని వ్యాఖ్యలకు అనుగుణంగా పెదాలను కదిలిస్తూ.. హావభావాలు వ్యక్తం చేశాడు. మిగతా నలుగురు అధికారులు చోద్యం చూస్తూ, నవ్వుతూ నిల్చున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ.. చివరకూ ఆ రాష్ట్ర డీజీపీ దృష్టికి చేరింది. దాంతో ఇక మీదట అధికారులు సోషల్ మీడియాను వినియోగించే అంశంలో.. జాగ్రత్తగా వ్యవహరించాలంటూ ఓ సర్క్యిలర్ జారీ చేశారు డీజీపీ.
Comments
Please login to add a commentAdd a comment