పాక్ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్‌ను అరెస్ట్ చేయొద్దని కోర్టులు ఆదేశించినా.. ప్రభుత్వం మాత్రం ఆ ఆదేశాలను బేఖాతరు చేస్తూ అరెస్ట్ చేసేందుకు యత్నిస్తున్నట్లు సమాచారం. ఈ మేరకు ఇమ్రాన్ ఖాన్ బుధవారం తనను మరోసారి అరెస్టు చేసే అవకాశం ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. తన ఇంటిని పోలీసులు పెద్ద ఎత్తున చుట్టుముట్టారని ఏ క్షణంలోనైన అరెస్టు చేసే అవకాశం ఉందని ట్వీట్టర్‌లో పేర్కొన్నారు. బహుశా ఇదే నా చివరి ట్వీట్ కాబోలు ఆ తదనంతరం తాను అరెస్టు అవుతానేమో అని సందేహం వ్యక్తం చేశారు.
ఇదిలా ఉండగా, అవినీతి కేసులో పాక్ మాజీ ప్రధానిని గతవారం అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. ఆయన అరెస్టుతో పాక్ ఒక్కసారిగా హింసాత్మకంగా మారిపోయింది. ఆ తదనంతరం నాటకీయ పరిణామాల మధ్యలో సుప్రీం కోర్టు జోక్యంతో బెయిల్‌పై విడుదలయ్యారు. ఆ తర్వాత కూడా అదే కోర్టు బయట అల్‌ఖాదీర్ ట్రస్ట్ కేసు విషయమై ఇమ్రాన్ ఖాన్‌ను మిలటరీ బలగాలు అరెస్టు చేసి కోర్టు ముందు ప్రవేశపెట్టి మరో ఉత్కంఠకు తెరలేపింది.
మళ్లీ తదనంతరం జరిగిన నాటకీయ పరిణామాల మధ్య ఇస్లామాబాద్ కోర్టు ఆయనకు ఆ కేసులో రెండు వారాల బెయిల్ మంజూరు చేస్తూ ఊరటనిచ్చింది. ఈ వరుస అరెస్టు మరువక మునుపై మరోసారి ఇమ్రాన్ ఖాన్ అరెస్టుకు రంగం సిద్ధం కావడం గమనార్హం.
(చదవండి: పాక్‌లో అరెస్టు భయం..పరుగులు తీస్తున్న మాజీ మంత్రి)
Comments
Please login to add a commentAdd a comment