ముంబై : హౌసింగ్ సొసైటీలో స్థలాలు ఇప్పిస్తానంటూ ఏకంగా 13 మంది పోలీసులను మోసం చేశాడో వ్యక్తి. ఈ సంఘటన మహారాష్ట్రలోని ముంబైలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సిటీ అండ్ ఇండస్ట్రియల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్(సీఐడీకో) తక్కువ డబ్బుతో స్థలాలను అందిస్తోందని, హౌసింగ్ సొసైటీలను నిర్మిస్తోందని ముంబైకి చెందిన సచిన్ పవర్ అనే వ్యక్తి ఓ పోస్ట్ పెట్టాడు. స్థలాలకోసం సీఐడీకో లాటరీ తీస్తోందని పోస్టలో పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో సతీష్ మిసల్ అనే పోలీస్ కానిస్టేబుల్ సచిన్‌ను సంప్రదించాడు. సీఐడీకోతో తనకు సంబంధాలు ఉన్నాయని, కొంత డబ్బు పెట్టుబడిగా పెడితే స్థలం ఇప్పిస్తానని సచిన్ నమ్మబలికాడు. సతీష్ ఇందుకు అంగీకరించాడు. సచిన్ అంతటితో ఆగకుండా ఖరఘర్ పోలీస్ స్టేషన్‌లోని మరికొంతమంది పోలీసులకు కూడా వల వేశాడు. 25 మంది గ్రూపుగా ఏర్పడి హౌసింగ్ సొసైటీ నిర్మించుకోవచ్చని వారితో చెప్పాడు. దీంతో వారు ఓ సొసైటీగా ఏర్పడ్డారు.
సచిన్ ఓ ప్రైవేట్ బ్యాంకులో అకౌంట్ తెరిచి ప్రతీ సభ్యుడి వద్దనుంచి 1.35 లక్షలు వసూలు చేశాడు. కొద్దిరోజుల తర్వాత సతీష్ సీఐడీకో లక్కీ డ్రాలో పాల్గొన్నాడు. సచిన్ చొరవ లేకుండానే లక్కీడ్రాలో వీరి సొసైటీకి కలబొలిలో ఓ ఫ్లాట్ వచ్చింది. దీంతో సచిన్ నిలదీయగా మాట దాటవేసే ప్రయత్నం చేశాడు. దీంతో అనుమానం వచ్చిన సచిన్ సొసైటీ అకౌంట్‌ను క్లోజ్ చేశాడు. అయితే పవర్ తన అకౌంట్‌ను క్లోజ్ చేయలేదు. వేరే పనుల కోసం సతీష్‌తో చెక్కులపై సంతకం పెట్టించుకున్న సచిన్ సొసైటీ అకౌంట్ నుంచి రూ. 1.5 కోట్లు కాజేశాడు. ఇది గుర్తించిన సతీష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
చదవండి.. చదివించండి: ఏంది స్వామి 20 లక్షలు అలా కాల్చినావ్
Comments
Please login to add a commentAdd a comment