ఫేక్ ఎన్కౌంటర్ కేసులో రిటైర్డ్ పోలీసులకు జీవితఖైదు | Ex-SP among 8 cops given life imprisonment in fake encounter | Sakshi
Sakshi News home page

ఫేక్ ఎన్కౌంటర్ కేసులో రిటైర్డ్ పోలీసులకు జీవితఖైదు

Published Wed, Apr 1 2015 9:21 PM | Last Updated on Sat, Sep 2 2017 11:42 PM

ఫేక్ ఎన్కౌంటర్ కేసులో  రిటైర్డ్ పోలీసులకు జీవితఖైదు

ఫేక్ ఎన్కౌంటర్ కేసులో రిటైర్డ్ పోలీసులకు జీవితఖైదు

పోలీసులే తోటి పోలీసుల్ని అత్యంత కిరాతకంగా మట్టుబెట్టి.. ఎన్కౌంటర్గా చిత్రీకరించారు. అయితే అది నకిలీ ఎన్కౌంటర్ అని మృతుల కుటుంబ సభ్యులు న్యాయపోరాటానికి పూనుకున్నారు. 23 ఏళ్లు గడిచింది.. నిందితులు రిటైరయ్యారు కూడా. అయితేనేం.. చేసిన ఘోర నేరానికి శిక్ష పడాల్సిందే అంటూ విశ్రాంత ఎస్పీ సహా ఎనిమిది మంది మాజీ పోలీసులకు జీవిత ఖైదును విధిస్తూ సీబీఐ ప్రత్యేక కోర్టు బుధవారం సంచలన తీర్పు చెప్పింది.

1992.. పంజాబ్ రాష్ట్రమంతా అల్లలర్లతో అట్టుడుకుతోంది.. చాలా చోట్ల ఉగ్రవాదులు పేట్రేగిపోతున్నారు.. జలంధర్ జిల్లా లంబ్రా పోలీస్ స్టేషన్లో ఎస్హెచ్ వోగా విధులు నిర్వహింస్తున్న రాంసింగ్..  తన సిబ్బంది అజిత్ సింగ్, అజైబ్ సింగ్, అమృత్ సింగ్, హర్భజన్ సింగ్ సహాయంతో  సెప్టెంబర్ 1న బల్జీత్ సింగ్ అనే ట్రైనీ కానిస్టేబుల్ను ఎన్కౌంటర్ చేశారు. సెప్టెంబర్ 6 న ఇలాంటిదే మరో ఘటన జరిగింది. సుఖ్వంత్ సింగ్, నందర్ సింగ్, రాజిందర్ సింగ్ అనే పోలీసు అధికారులు.. రాజ్విందర్ సింగ్, ముఖ్తియార్ సింగ్ అనే మరో ఇద్దరు ట్రైనీ కానిస్టేబుళ్లను కిరాతకంగా హతమార్చి శవాల్ని నామరూపాలు లేకుండా చేశారు.

 

ఆ తర్వాతికాలంలో వాళ్లకు ప్రమోషన్లు వచ్చాయి. అప్పట్లో సంచలనం కలిగించిన ఈ రెండు కేసుల్ని సీబీఐ దర్యాప్తు చేయగా.. అవి రెండూ నకిలీ ఎన్కౌంటర్లేనని తేల్చింది. సారూప్యత దృష్ట్యా రెండు కేసుల్ని కలిపి విచారించిన సీబీఐ ప్రత్యేక కోర్టు ఎస్పీగా రిటైర్ అయిన రాంసింగ్ సహా ఎనిమిది మందికి జీవిత ఖైదును విధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement