3 Madhya Pradesh Cops Suspended For Driving Car With Women On Bonnet - Sakshi
Sakshi News home page

కారు బోనెట్ మీద మహిళ ఉండగా అలాగే తీసుకెళ్లిన పోలీసులు.. 

Published Fri, Jul 7 2023 2:07 PM | Last Updated on Fri, Jul 7 2023 2:36 PM

MP Cops Suspended For Driving Car With Women On Bonnet - Sakshi

భోపాల్: మధ్యప్రదేశ్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న నెపంతో అరెస్టైన యువకుడిని విడిచి పెట్టమంటూ ఓ తల్లి పోలీసు కారు బోనెట్ ఎక్కి కూర్చుంది. దీంతో పోలీసులు ఆమెను అలా బోనెట్ పైన కూర్చుండగానే అమానుషంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లారు. స్థానికుల్లో ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. 

మధ్యప్రదేశ్,  నర్సింగ్ పూర్లో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అనిల్ అజ్మేరియా, సంజయ్ సూర్యవంశీ అనే ఇద్దరు ఎస్సైలు నీరజ్ డెహరియా అనే కానిస్టేబుల్ తో కలిసి అక్కడి వెళ్లారు. 

అక్కడ సోను కహార్ అనే యువకుడి ఇంటిని సోదా చేయగా రూ. 3 లక్షలు విలువ చేసే 20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సోను కహర్ ను పోలీసు కస్టడీకి తరలించే క్రమంలో కారు ఎక్కించగానే అతడి తల్లి మోహిని కహార్ వచ్చి వారికి అడ్డుపడింది. తన బిడ్డను విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళమీద పడి ప్రాధేయపడింది. 

అయినా కూడా వారు కనికరించకపోవడంతో పోలీసు వాహనం బోనెట్ ఎక్కి కూర్చుని బ్రతిమాలింది. అంతలో చుట్టూ జనం గుమికూడటంతో కారుని అలాగే పోలీసు స్టేషన్ కు పోనిచ్చారు పోలీసులు. అక్కడున్న వారిలో ఎవరో ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. వెంటనే ఆ ఇద్దరు ఎస్సైలను, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ.   

ఇది కూడా చదవండి: ఆన్‌లైన్‌లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. 


 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement