ఇండోర్: మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో దారుణం చోటుచేసుకుంది. 34 ఏళ్ల మహిళపై సామూహిక అత్యాచారం చేసి, నగ్నంగా డ్యాన్స్ చేయమని ఒత్తిడి చేసిన ఐదుగురిపై కేసు నమోదైంది. ఈ ఉదంతానికి సంబంధించిన వివరాలను ఓ పోలీసు అధికారి మీడియాకు వెల్లడించారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశాల మేరకు 19 రోజుల తర్వాత ఈ కేసు నమోదైంది. మహిళ ఫిర్యాదును పరిశీలించి, 90 రోజుల్లోగా పరిష్కరించాలని పోలీసులను హైకోర్టు ఆదేశించింది. జూన్ 11న టీవీలో పోర్న్ వీడియో చూసి, తనపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారని, నిందితులు తనను బలవంతంగా గోదాంనకు తీసుకెళ్లారని కనాడియా పోలీస్ స్టేషన్‌లో ఒక మహిళ ఫిర్యాదు చేసింది.
నిందితులు తనను బెల్ట్‌తో కొట్టారని, అరగంట పాటు బలవంతంగా నగ్నంగా డ్యాన్స్ చేయించారని మహిళ ఎఫ్‌ఐఆర్‌లో పేర్కొన్నట్లు ఆ పోలీసు అధికారి తెలిపారు. బాదితురాలి ఐదుగురు నిందితులపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు అధికారి తెలిపారు. కాగా ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు జరుపుతున్నామని, నిందితులను అరెస్టు చేయనున్నామని కమిషనర్ ఆఫ్ పోలీస్ (డీసీపీ) అభినయ్ విశ్వకర్మ విలేకరులకు తెలిపారు. విచారణలో లభించిన సాక్ష్యాల ఆధారంగా ఈ కేసులో చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెప్పారు.
దీనికి ముందు తనపై సామూహిక అత్యాచారం జరిగిందని ఆరోపిస్తూ తాను జూలై 17న కనాడియా పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, అయితే దానిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని బాధిత మహిళ మధ్యప్రదేశ్ హైకోర్టు ఇండోర్ బెంచ్‌లో పిటిషన్ దాఖలు చేసింది. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకుని 90 రోజుల్లోగా పరిష్కరించి తగిన చర్యలు తీసుకోవాలని కనాడియా పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్‌ని ఆగస్టు 14న కోర్టు ఆదేశించింది. ఇదిలావుండగా బీజేపీ ఒత్తిడితో మహిళ ఫిర్యాదుపై ఎఫ్‌ఐఆర్ నమోదు చేయడంలో పోలీసులు జాప్యం చేశారని రాష్ట్ర కాంగ్రెస్ అధికార ప్రతినిధి నీలభ్ శుక్లా ఆరోపించారు. ఈ ఆరోపణలను రాష్ట్ర బీజేపీ అధికార ప్రతినిధి నరేంద్ర సలుజా తోసిపుచ్చారు. నిందితులు ఎవరైనప్పటికీ భాజపా ప్రభుత్వ హయాంలో బాధితురాలికి కచ్చితంగా న్యాయం జరుగుతుందని సలూజా అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment