cops suspended
-
కారు బోనెట్ మీద మహిళ... అలాగే తీసుకెళ్లిన పోలీసులు..
భోపాల్: మధ్యప్రదేశ్ లో అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్నాడన్న నెపంతో అరెస్టైన యువకుడిని విడిచి పెట్టమంటూ ఓ తల్లి పోలీసు కారు బోనెట్ ఎక్కి కూర్చుంది. దీంతో పోలీసులు ఆమెను అలా బోనెట్ పైన కూర్చుండగానే అమానుషంగా పోలీసు స్టేషన్ వరకు వెళ్లారు. స్థానికుల్లో ఒకరు ఈ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. విషయం ఎస్పీ దృష్టికి వెళ్లడంతో వెంటనే ఆ పోలీసులను సస్పెండ్ చేశారు. మధ్యప్రదేశ్, నర్సింగ్ పూర్లో గంజాయి రవాణా చేస్తున్నారని సమాచారం అందడంతో అనిల్ అజ్మేరియా, సంజయ్ సూర్యవంశీ అనే ఇద్దరు ఎస్సైలు నీరజ్ డెహరియా అనే కానిస్టేబుల్ తో కలిసి అక్కడి వెళ్లారు. అక్కడ సోను కహార్ అనే యువకుడి ఇంటిని సోదా చేయగా రూ. 3 లక్షలు విలువ చేసే 20 గ్రాముల గంజాయిని పట్టుకున్నారు. సోను కహర్ ను పోలీసు కస్టడీకి తరలించే క్రమంలో కారు ఎక్కించగానే అతడి తల్లి మోహిని కహార్ వచ్చి వారికి అడ్డుపడింది. తన బిడ్డను విడిచిపెట్టమని పోలీసుల కాళ్ళమీద పడి ప్రాధేయపడింది. అయినా కూడా వారు కనికరించకపోవడంతో పోలీసు వాహనం బోనెట్ ఎక్కి కూర్చుని బ్రతిమాలింది. అంతలో చుట్టూ జనం గుమికూడటంతో కారుని అలాగే పోలీసు స్టేషన్ కు పోనిచ్చారు పోలీసులు. అక్కడున్న వారిలో ఎవరో ఈ తంతు మొత్తాన్ని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ విషయం జిల్లా ఎస్పీ దృష్టికి చేరింది. వెంటనే ఆ ఇద్దరు ఎస్సైలను, కానిస్టేబుల్ ని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు ఎస్పీ. ఇది కూడా చదవండి: ఆన్లైన్లో కండోమ్స్ ఆర్డర్.. అడ్రస్ మార్చడం మర్చిపోయాడు.. #MadhyaPradesh के #Narsinghpur जिले से रोंगटे खड़े करने वाला वीडियो सामने आया है.वायरल वीडियो में एक प्राइवेट नम्बर की चलती कार में लटकी महिला को थाने में ले जाते देखा जा सकता है.तीन पुलिस वाले सस्पेंड कर दिए गए है.@abplive @drnarottammisra @DGP_MP @brajeshabpnews pic.twitter.com/ltVroZuigX — AJAY TRIPATHI (ABP NEWS) (@ajay_media) July 5, 2023 -
పెట్రోల్, టైర్లతో దహనం.. ఐదుగురు పోలీసులపై వేటు
లక్నో: కరోనా మన జీవిన విధానాన్ని పూర్తిగా మార్చేసింది. సంబరాలు సంతోషాలు లేవు.. కనీసం నలుగురు మనుషుల కూడి దహన సంస్కారాలు చేయడానికి కూడా వీలు లేని పరిస్థితులు. మహమ్మారి భయంతో కోవిడ్‌తో మరణించిన వారి శవాలను అలాగే వదిలేసి వెళ్తున్నారు. కొద్ది రోజల క్రితం గంగా నదిలో పదుల కొద్ది శవాలు కొట్టుకొచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఉత్తరప్రదేశ్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు వచ్చాయి. దీన్ని మరువక ముందే మరో హృదయవిదారక ఘటన చోటు చేసుకుంది. కోవిడ్ మృతదేహాలను పోలీసులు రోడ్డు మీద అత్యంత అమానవీయ రీతిలో దహనం చేశారు. టైర్లు, పెట్రోల్ పోసి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలవుతోంది. దీనిపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తడంతో ఉన్నతాధికారులు ఇందుకు బాధ్యులైన ఐదుగురు పోలీసులును సస్పెండ్ చేశారు. ఈ సంఘటన బల్లియాలో మాల్దేపూర్ ఘాట్ వద్ద చోటు చేసుకుంది. రెండు రోజుల క్రితం నదిలో రెండు శవాలు కొట్టుకువచ్చాయి. పోలీసులకు సమాచారం అందిచడంతో వారు సంఘటన స్థలానికి చేరుకుని శవాలను బయటకు తీశారు. ఆ తర్వాత వాటిని దహనం చేయడానికి ఇంధనం లేకపోవడంతో టైర్లు వేసి.. పెట్రోల్ పోసి దహనం చేశారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరలయ్యింది. పోలీసు అధికారి సమక్షంలో ఈ సంఘటన చోటు చేసుకోవడంతో దీనిపై నెటిజనులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఐదుగురు పోలీసు అధికారులను సస్పెండ్ చేశారు. సంఘటనపై దర్యాప్తునకు ఆదేశించారు. చదవండి: ఎవరూ లేకున్నా.. కడసారి వీడ్కోలుకు ఆ నలుగురు -
హత్య కేసులో ఐపీఎస్ అధికారిపై వేటు
లక్నో: ఉత్తరప్రదేశ్ కాన్పూర్‌లో కలకలం సృష్టించిన ప్రైవేట్ ల్యాబ్ టెక్నీషియన్ సంజీత్ యాదవ్ కిడ్నాప్, హత్య కేసులో పోలీసు డిపార్ట్మెంట్ నలుగురిని సస్పెండ్ చేసింది. వీరిలో ఐపీఎస్ అధికారి అపర్ణ గుప్తా కూడా ఉన్నారు. సంజీత్ యాదవ్‌ను గత నెల 22న కిడ్నాప్ చేసి రూ. 30లక్షలు ఇవ్వాల్సిందిగా నిందుతులు అతడి కుటుంబాన్ని డిమాండ్ చేశారు. ఈ క్రమంలో జూలై 13న పోలీసుల సమక్షంలో కిడ్నాపర్లు అడిగిన మొత్తం చెల్లించామని.. అయినా సంజీత్‌ను వదిలివేయలేదని అతడి కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ క్రమంలో పోలీసులు గురువారం ఈ కేసుకు సంబంధించి ఐదుగురిని అరెస్ట్ చేశారు. దర్యాప్తులో సంజీత్ యాదవ్‌ను గత నెల 26న చంపి, నదిలో పడేసినట్లు వెల్లడించారు. అయితే సంజీత్ కుటుంబ సభ్యులు మాత్రం ఓ నెల రోజుల నుంచి కిడ్నాపర్లు తమకు ఫోన్ చేస్తున్నారని.. రూ. 30లక్షలు ఇస్తే సంజీత్‌ని వదిలేస్తామని చెప్పినట్లు తెలిపారు. (‘హత్య చేసి నదిలో పడేశారు’) ఈ క్రమంలో ఏరియా ఇన్చార్జ్ అపర్ణ గుప్తాను కలిసి కిడ్నాపర్లు డిమాండ్ చేసిన డబ్బును అందించామన్నారు. అంతేకాక డబ్బు సంచిన ఓ రైల్వేట్రాక్‌పై పడేశామని చెప్పారు. కానీ పోలీసులు కిడ్నాపర్లకు డబ్బు ముట్ట చెప్పి.. వారికి పారిపోయే అవకాశం ఇచ్చారని సంజీత్ కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. అంతేకాక ఇంతవరకు సంజీత్ మృతదేహాన్ని కూడా కనుక్కోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వీరి వాదన ఇలా ఉండగా పోలీసులు మాత్రం ఆ సంచిలో డబ్బు లేదని వెల్లడించారు. అంతేకాక సంజీత్ కుటుంబ సభ్యులు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు అపర్ణ గుప్తాతో పాటు మరో ముగ్గురిని సస్పెండ్ చేశారు. అంతేకాక ‘సంజీత్ కుటుంబ సభ్యులు కిడ్నాపర్లకు డబ్బు చెల్లించామని చెబుతున్నారు. కానీ ఇంతవరకు జరిగిన దర్యాప్తులో డబ్బు చెల్లించినట్లు తెలియలేదు. ఏది ఏమైనా కేసును అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. డబ్బు చెల్లించినట్లు తెలిస్తే.. వారికి అందజేస్తాం. ఈ కేసుతో మా డిపార్ట్మెంట్ అధికారులకు సంబంధం ఉన్నట్లు తెలిస్తే.. వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అన్నారు. (నటి కిడ్నాప్ ప్లాన్: ముఠా అరెస్టు) -
రోడ్డుపై తల్లీకూతుళ్ల ఆత్మహత్యాయత్నం
లక్నో: పోలీసుల నిర్లక్ష్యం తల్లీకూతుళ్లను ఆత్మహత్యకు ప్రేరేపించింది. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇందుకు బాధ్యులైన ఇద్దరు పోలీసులను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. అయితే షాకింగ్ న్యూస్ ఏంటంటే వీరిద్దరికి కరోనా పాజిటివ్‌గా తేలింది. వివరాలు.. అమేథి జామో ప్రాంతానికి చెందిన గుడియాకు పొరుగువారితో మురికి కాల్వకు సంబంధించి వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో గత నెల 9న ఇద్దరికి గొడవ జరిగింది. దాంతో ఇరు పక్షాలు పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు. ఆ తర్వాత కూడా పొరుగువారు తమను బెదిరిస్తున్నారంటూ గుడియా పోలీసులకు తెలిపింది. కానీ వారు పట్టించుకోలేదు. దాంతో పోలీసులు పొరుగువారి దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నారని.. తన ఫిర్యాదు గురించి పట్టించుకోలేదని గుడియా ఆవేదనకు గురయ్యింది. ఈ క్రమంలో శుక్రవారం కుమార్తెను తీసుకుని రాష్ట్ర అసెంబ్లీ సమీపంలోని లోక్ భవన్ దగ్గరకు వెళ్లింది. అక్కడే రోడ్డు మీద తల్లీకూతుళ్లిద్దరు ఒంటికి నిప్పంటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ ఘటనలో తీవ్ర గాయలైన గుడియాను, ఆమె కుమార్తెను లక్నో ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిపారు. ఈ క్రమంలో ఉన్నతాధికారులు ఇందుకు కారణమయిన జామో ఇంచార్జ్ పోలీసు అధికారితో పాటు మరొకరిని సస్పెండ్ చేశారు. ఈ ఘటన పట్ల విపక్షాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. -
కిందపడేసి మెడ మీద మోకాలు పెట్టి..
లండన్: అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ మృతి తర్వాత ‘బ్లాక్‌లైవ్స్ మ్యాటర్’ ఉద్యమం ఉధృతంగా కొనసాగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో తాజాగా ఇలాంటి సంఘటన ఒకటి లండన్‌లో చోటు చేసుకుంది. పోలీసు అధికార్లు మారణాయుధాన్ని కలిగి ఉన్నాడనే నెపంతో ఓ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఓ అధికారి అతడిని కిందపడేసి మెడ మీద మోకాలు పెట్టి కూర్చున్నాడు. దాంతో ఆ వ్యక్తి ‘నా మెడ మీద నుంచి లేవండి’ అంటూ వేడుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ కావడంతో బ్రిటీష్ పోలీసులు ఇందుకు బాధ్యులైన వారిలో ఒక అధికారిని సస్పెండ్ చేశారు. మరొకరిని విధుల నుంచి తొలగించారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ‘పోలీసు శిక్షణలో మేం ఇలాంటి పద్దతులను బోధించలేదు. ఇప్పుడు వీరు ఉపయోగించే పద్దతులు చూస్తే నాకు చాలా ఆందోళన కల్గుతుంది’ అన్నారు. (‘అలాంటి వారికి ట్రంప్ తోడయ్యారు’) -
పోలీసులు X టెంపో డ్రైవర్
న్యూఢిల్లీ: పోలీసులు చుట్టుముట్టి లాఠీలతో కొడుతుంటే మూడు చక్రాల టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసిన వైనానికి సంబంధించిన వీడియో ఢిల్లీలో సంచలనం సృష్టించింది. ఢిల్లీలోని ముఖర్జీనగర్‌లో ఆదివారం ఈ ఘటన జరిగింది. పోలీసుల వాహనం, టెంపో ఢీకొనడంతో ఘర్షణ జరిగినట్లు తెలుస్తోంది. తమ సహోద్యోగుల్లో ఒకరి కాలిపైకి టెంపో (గ్రామీణ సేవ) చక్రం ఎక్కడంతో పోలీసులు డ్రైవర్‌తో ఘర్షణకు దిగారు. ఆటోలో ఉన్న అతని కొడుకుని బయటకు లాగి కొట్టారు. దీనితో టెంపో డ్రైవర్ కత్తి బయటకు తీసి వారి వెంటపడ్డాడు. డ్రైవర్ కుటుంబాన్ని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ సోమవారం పరామర్శించారు. ఈ కేసులో నిందితుడికి తగిన న్యాయం జరిగేలా అమిత్ షా చర్యలు తీసుకోవాలని పంజాబ్ సీఎం అమరీందర్ కోరారు. శిరోమణి అకాలీదళ్ (ఎస్ఏడీ) అధ్యక్షుడు సుఖ్బీర్ సింగ్ బాదల్ఈ ఘటనను ఖండించారు. ముగ్గురు పోలీసుల సస్పెన్షన్ కాగా వీడియోలో ఉన్నట్టుగా గుర్తించిన ఇద్దరు సబ్ ఇన్స్పెక్టర్లు, ఒక కానిస్టేబుల్‌ను సస్పెండ్ చేసినట్లు ఢిల్లీ పోలీసు ప్రతినిధి అనిల్ మిట్టల్ చెప్పారు. కాగా ఈ ఘటనపై కేంద్ర హోం శాఖ ఢిల్లీ పోలీసుల నుంచి వివరణ కోరింది. -
పాశవిక హత్యపై ప్రకంపనలు
అలీగఢ్ (యూపీ)/ముంబై: ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో చిన్నారిని పాశవికంగా హత్య చేయడంపై తీవ్ర నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. గత నెల 30వ తేదీన జరిగిన ఈ ఘటనపై నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఐదుగురు పోలీసులను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఓ వ్యక్తి రూ.10 వేలు అప్పు తీర్చలేదనే కారణంతో దుండగులు అభం శుభం తెలియని అతడి కుమార్తె (రెండున్నరేళ్లు)ను గొంతు పిసికి, కనుగుడ్లు పెరికి చంపి చెత్తకుప్పలో పారేయడం సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై దర్యాప్తునకు యూపీ ప్రభుత్వం ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకుని జాతీయ భద్రతా చట్టం కింద కేసులు నమోదు చేసింది. టప్పల్ పట్టణానికి చెందిన రెండున్నరేళ్ల బాలిక మే 30వ తేదీన కనిపించకుండాపోయింది. దీంతో మరుసటి రోజు అంటే మే 31వ తేదీన ఆమె తండ్రి బన్వరీలాల్ శర్మ టప్పల్ పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకపోవడంతో పాటు బాలిక ఆచూకీ కనుగొనేందుకు ఎలాంటి ప్రయత్నం చేయలేదు. మరో మూడు రోజుల తర్వాత జూన్ 2వ తేదీన బాలిక మృతదేహం ఆమె నివాసానికి సమీపంలోనే చెత్తకుప్పలో కనిపించింది. రూ.10వేల అప్పు బాలిక తండ్రి బన్వరీలాల్ తిరిగి ఇవ్వనందునే ఈ దారుణానికి పాల్పడినట్లు తమ అదుపులో ఉన్న జహీద్, అస్లాం అంగీకరించారని పోలీసులు తెలిపారు. రాహుల్, ప్రియాంక దిగ్భ్రాంతి ‘మనిషనే వారెవరైనా చిన్నారులపై ఇంత దారుణంగా వ్యవహరిస్తారా?. పోలీసులు సత్వరం స్పందించి దోషులకు శిక్షలు పడేలా చూడాలి’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. ఈ ఘటన అమానవీయమని ప్రియాంకగాంధీ అన్నారు. ‘అందరూ సిగ్గుపడాల్సిన∙ఘటన’ అని బీఎస్పీ చీఫ్ మాయావతి అన్నారు. బాలీవుడ్ ప్రముఖులు అక్షయ్‌కుమార్, అభిషేక్, షబనా ఆజ్మీ, అనుపమ్ ఖేర్ తదితరులు ట్విట్టర్ వేదికగా తీవ్ర ఆవేదన వెలిబుచ్చారు. -
మహిళపై దాడి.. పోలీసులపై చర్యలు
చండీగఢ్ : మహిళను బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టినందుకు గాను ఐదుగురు పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్నారు. వివరాలు.. ఫరిదాబాద్‌కు చెందిన ఓ ఐదుగురు పోలీసు అధికారులు.. ఓ మహిళపై దాడి చేశారు. బెల్ట్‌తో విచక్షణారహితంగా కొట్టారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో అధికారులు దీనిపై స్పందించారు. వీడియోలో ఉన్న అధికారులపై కేసు నమోదు చేయడమే కాక వారిని విధుల నుంచి సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇద్దరు హెడ్ కానిస్టేబుల్స్‌ని సస్పెండ్ చేయగా.. మరో ముగ్గురు స్పెషల్ ఆఫీసర్లను విధుల నుంచి తొలగించారు. అంతేకాక సదరు అధికారుల మీద ఆదర్శ నగర్ పోలీసు స్టేషన్లో కేసు కూడా నమోదు చేశారు. అయితే ఈ వీడియో సంవత్సరం క్రితం నాటిదని అధికారులు తెలిపారు. బాధితురాలితో మాట్లాడి పూర్తి వివరాలు తెలుసుకుంటామన్నారు. Now that's #Faridabad #Police trying to practice #BetiBachao #BetiPadhao ethos. Even if this #woman is guilty of any crime, how justified is the act ? #NCR pic.twitter.com/2tr78SGFrt — PRAVEEN DUTTA (@PraveenDutta) May 28, 2019 -
నేరస్థుడి పరారీ.. పోలీసుల సస్పెన్షన్
కోర్టుకు తీసుకెళ్తుండగా ఓ నిందితుడు పోలీసు కస్టడీ నుంచి తప్పించుకుని పారిపోయాడు. దీంతో అతడికి కాపలాగా ఉన్న ఇద్దరు పోలీసులు సస్పెండయ్యారు. ఈ సంఘటన ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ ప్రాంతంలో జరిగింది. జబ్బార్ అనే నిందితుడిని బస్సులో కోర్టుకు తీసుకెళ్తున్నారు. అతడి చేతులను తాడుతో కట్టేశారు. అయితే, జబ్బార్ ఆ తాడును కత్తిరించి, పోలీసుల కన్నుగప్పి బస్సులోంచి ఉడాయించాడు. తితావీ ప్రాంతంలో జరిగిన చోరీ కేసులో అతడిని శుక్రవారం నాడు అరెస్టు చేశారు. అయితే, నాటకీయంగా జబ్బార్ తప్పించుకోవడంతో.. అతడికి కాపలాగా వెళ్లిన ఇద్దరు పోలీసులను సస్పెండ్ చేసినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. -
ఘజియాబాద్‌లో నలుగురు పోలీసుల సస్పెన్షన్
అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిపై సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం లింక్‌రోడ్డు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ లాకప్‌లో ఒక మహిళను, మరో పురుషుడిని నిర్భందంలో ఉండగా గమనించారు. లాకప్‌లో మద్యం సీసాలు, ఆహారపదార్థాల ప్యాకెట్లను ఎస్ఎస్పీ యాదవ్ గుర్తించారు. ఈ వ్యవహారానికి బాధ్యులైన కానిస్టేబుల్స్ సుశీల్‌కుమార్, బ్రిజేశ్యాదవ్, గుడ్డుకుమార్, విరేందర్ కుమార్‌ను అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని యాదవ్ ఆదేశించారు. నిర్లక్ష్య విధి నిర్వహణకు బాధ్యుడిగా స్టేషన్ అధికారి నంద్జీ యాదవ్‌ను పోలీస్‌లైన్‌కు బదిలీ చేశారు. అక్రమ వ్యవహరానికి బాధ్యులయిన కానిస్టేబుల్స్‌లో ఒకరు అరెస్టవగా, మిగతా ముగ్గురు తప్పించుకు పోయారు. నిర్భందితులకు సంబంధించిన వివరాలను కనుగోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ ఘటనపై సంస్థగత విచారణ జరుపుతున్నామని ఎస్ఎస్పీ వివరించారు.