అక్రమాలకు పాల్పడుతున్న పోలీసు సిబ్బందిపై సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ సస్పెన్షన్ వేటు వేశారు. గురువారం లింక్‌రోడ్డు పోలీస్ స్టేషన్‌ను ఆకస్మికంగా తనిఖీ చేసిన సీనియర్ పోలీసు సూపరింటెండెంట్ లాకప్‌లో ఒక మహిళను, మరో పురుషుడిని నిర్భందంలో ఉండగా గమనించారు. లాకప్‌లో మద్యం సీసాలు, ఆహారపదార్థాల ప్యాకెట్లను ఎస్‌ఎస్పీ యాదవ్ గుర్తించారు.
ఈ వ్యవహారానికి బాధ్యులైన కానిస్టేబుల్స్ సుశీల్‌కుమార్, బ్రిజేశ్‌యాదవ్, గుడ్డుకుమార్, విరేందర్ కుమార్‌ను అరెస్టు చేసి సస్పెండ్ చేయాలని యాదవ్ ఆదేశించారు. నిర్లక్ష్య విధి నిర్వహణకు బాధ్యుడిగా స్టేషన్ అధికారి నంద్‌జీ యాదవ్‌ను పోలీస్‌లైన్‌కు బదిలీ చేశారు.
అక్రమ వ్యవహరానికి బాధ్యులయిన కానిస్టేబుల్స్‌లో ఒకరు అరెస్టవగా, మిగతా ముగ్గురు తప్పించుకు పోయారు. నిర్భందితులకు సంబంధించిన వివరాలను కనుగోవడానికి ప్రయత్నిస్తున్నామని, ఈ ఘటనపై సంస్థగత విచారణ జరుపుతున్నామని ఎస్‌ఎస్పీ వివరించారు.
ఘజియాబాద్‌లో నలుగురు పోలీసుల సస్పెన్షన్
Published Fri, Aug 16 2013 9:08 PM | Last Updated on Fri, Sep 1 2017 9:52 PM
Advertisement