రైట్ బ్రదర్స్ విమానాన్న కనిపెడితే..ఈ బ్రదర్స్ కారుని హెలికాప్టర్‌గా మార్చారు. అది తమ జీవనోపాధికి ఉపయోగపడుతుందనుకున్నారు. కానీ ఇలా మార్పులు చేయాలంటే అధికారులు అనుమతి తప్పనసరి. అది తెలియక ఈ అన్నదమ్ములూ తయారు చేసిన కారు కమ్ హెలికాప్టర్ పోలీసులు సీజ్ చేయడం జరిగింది. దీంతో అన్నదమ్ములిద్దరు తలలుపట్టుకున్నారు. ఈ ఘటన ఉత్తప్రదేశ్‌లో చోటుచేసుకుంది.
వివరాల్లోకెళ్తే..ఉత్తరప్రదేశ్‌లోని అంబేద్కర్ నగర్‌కు చెందిన ఇద్దరు అన్నదమ్ములు.. పాత మారుతీ సుజుకీ వ్యాగన్‌ఆర్‌ను హెలికాప్టర్‌గా మార్చారు. ఈశ్వర్దీన్, పరమేశ్వర్దీన్ అనే ఈ అన్నదమ్ములు.. వివాహాలకు ప్రత్యేకంగా కనిపించేలా కారును హెలీకాప్టర్లా మార్చారు. వధూవరులను తీసుకుని వెళ్లాలా ప్రత్యేకతగా ఉండాలనుకున్నారు. అందుకోసం హెలికాప్టర్ రోటర్ బ్లేడ్‌ను కారు పైకప్పుపై వెల్డింగ్ చేసి అతికించారు. కారు బూట్‌కు హెలీకాఫ్టర్ కు ఉండే తోకను జోడించారు. ఇలా కారు కమ్ హెలికాప్టర్‌లా విలక్షణంగా రూపొందిచారు. పైగా దీనివల్ల తమ కుటుంబానికి మంచి జీవనోపాధిగా ఉంటుందనేది వారి ఆలోచన.
ఆ నిమిత్తమే ఈ ఇద్దరు సోదరులు కారుని హెలికాప్టర్‌లా మార్పుల చేసి చక్కగా రంగులు వేసేందుకు తీసుకువెళ్తుండగా ఊహించని విధంగా పోలీసుల వారిని అడ్డుకుని వాహనాన్ని చీజ్ చేశారు. అయితే ఈ అన్నదమ్ములు కారుని హెలికాప్టర్‌గా మార్చారు గానీ అందుకు అనుమతలు తప్పనసరి. ఇది తెలియకపోవడంతోనే ఈ బ్రదర్స్ అధికారులతో సమస్యను ఎదుర్కొన్నారు. ఇక పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం...రవాణా నిబంధనలను పాటించనందుకు, సంబంధిత అధికారుల నుండి సరైన అనుమతి లేకుండా ఇలా మార్పులు చేసినందుకు సీజ్ చేశామని చెప్పారు.
ఈ మేరకు అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ విశాల్ పాండే మాట్లాడుతూ, "మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అమలు కారణంగా, పోలీసులు నిరంతరం వాహన తనిఖీలు చేస్తున్నట్లు తెలిపారు. అలాంటి ఒక తనిఖీ సమయంలో, ట్రాఫిక్ పోలీసులు ఈ కారును పట్టుకున్నట్లు తెలిపారు. మార్పులకు అనుమతి అవసరం కాబట్టి ఆర్టీవో విభాగం, వాహనాన్ని మోటారు వాహనాల చట్టంలోని సెక్షన్ 207 కింద సీజ్ చేసినట్లు వెల్లడించారు." పాండే. అయితే ఈ అన్నదమ్ములు చివరికీ జరిమాన చెల్లించి ఏదోలా వాహనాన్ని విడిపించుకున్నట్లు సమాచారం. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
यूपी के अंबेडकर नगर में दो भाईयों ने जुगाड़ से कार को हेलीकॉप्टर बना दिया. डेंट- पेंट कराने जा रहे थे तभी पुलिस ने पकड़ लिया. और गाड़ी(हेलीकॉप्टर) सीज कर दी. pic.twitter.com/wK9QLaFZ1k
— Priya singh (@priyarajputlive) March 17, 2024
Comments
Please login to add a commentAdd a comment