డ్రైవర్ గితేశ్‌ను బెల్ట్‌తో కొడుతున్న అధికారి (ఫోటో కర్టెసీ: ఎన్‌డీటీవీ)
న్యూఢిల్లీ: దేశ రాజధానిలో సినిమాను తలపించే సన్నివేశం ఒకటి చేసుకుంది. ఓ పోలీసు అధికారి కారు డ్రైవర్‌ని బెల్ట్‌తో విచక్షణారహితంగా బాదాడు. అతడి చర్యలకు ఆగ్రహించిన జనాలు.. సదరు అధికారిని రోడ్డు మీద పడేసి మరి చితకబాదారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. హౌజ్ ఖాస్ ప్రాంతంలోని ఢిల్లీ ఐఐటీ సమీపంలో ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర పోలీసు సిబ్బంది కారును ఆపడంతో ఈ వివాదం చోటు చేసుకుంది. ఆ వివరాలు.. ఢిల్లీలో కరోనా విజృంభిస్తుండటంతో పోలీసు అధికారులు మాస్క్ చెకింగ్ డ్రైవ్ చేపట్టారు. ఈ క్రమంలో అధికారులు హౌజ్ ఖాస్ ప్రాంతంలో ఓ కారు డ్రైవర్‌ని ఆపారు. ఇంతలో ట్రాఫిక్ సిగ్నల్ పడటంతో గితేశ్ దాగర్ అనే వ్యక్తి సెడెన్‌గా బ్రేక్ వేశాడు.
దాంతో గితేశ్ కారు, మరో కారుకి డ్యాష్ ఇచ్చింది. ఆగ్రహించిన గితేశ్.. సిగ్నల్ దగ్గర కారు ఆపిన అధికారుల దగ్గరకు వెళ్లి గొడవపెట్టుకున్నాడు. ఈ వివాదం కాస్త ముదరడంతో సహనం కోల్పోయిన ఓ పోలీసు అధికారి గితేశ్‌పై బెల్టుతో దాడి చేశాడు. అతడి పక్కన ఉన్న అధికారులు, రోడ్డు మీద ఉన్న జనాలు సదరు అధికారిని ఆపేందుకు ప్రయత్నించారు. కానీ అతడు వారిని పట్టించుకోకుండా నడిరోడ్డుపై బెల్ట్‌తో గితేశ్‌ని బాదుతూనే ఉన్నాడు. దాంతో భారీగా ట్రాఫిక్ జామ్ అయ్యింది.
దాంతో ట్రాఫిక్‌లో చిక్కుకుని ఇబ్బంది పడుతున్న జనాలు ఆగ్రహంతో సదరు అధికారి మీద దాడి చేశారు. అతడిని రోడ్డు మీద పడేసి మరి కొట్టారు. ఈ ఘటనలో సదరు అధికారి తీవ్రంగా గాయపడటంతో అతడిని ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించని వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరలవుతున్నాయి. ఇక ఘటనపై దక్షిణ ఢిల్లీ డిప్యూటీ కమిషనర్ స్పందించారు. సదరు అధికారి, కారు డ్రైవర్ మీద ఎఫ్‌ఐఆర్ నమోదు చేశామని తెలిపారు. పూర్తిగా విచారించి అవసరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment