ఒక పోలీస్ అకౌంట్‌లో 10 కోట్లు క్రెడిట్ అయ్యాయి. దీంతో అతను ఒక్కసారిగా రాత్రికి రాత్రే కోటిశ‍్వరుడిగా మారిపోయాడు. ఈ ఘటన పాకిస్తాన్‌లోని కరాచీలో చోటు చేసుకుంది. ఒక పోలీస్ అధికారికి తన జీతంతో పాటుగా సుమారు రూ. 10 కోట్లు అకౌంట్‌లో జమ అయ్యాయి. అయితే బ్యాంకు వాళ్లు ఫోన్ చేసి చెప్పేంత వరకు తనకు ఈ విషయం తెలియలేదని సదరు పోలీసు అధికారి చెబుతున్నాడు.
దీంతో అతని అకౌంట్‌ని బ్లాక్ చేసి ఈ డబ్బు ఎలా క్రెడిట్ అయ్యిందని దానిపై దర్యాప్తు ప్రారంభించారు అధికారులు. అచ్చం సదరు పోలీస్‌లానే పాక్‌లోని లర్కానా ప్రాంతంలోనిమరో ముగ్గురు పోలీస్ అధికారుల అకౌంట్లోకి కూడా రూ. 5 కోట్లు చొప్పున క్రెడిట్ అయినట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ఇంత మొతంలో డబ్బు ఎలా ఎక్కడ నుంచి వచ్చిందనే దానిపై అధికారులు ఆరా తీయడం ప్రారంభించారు.
(చదవండి: బ్రేక్ ఇవ్వండి..ఎవరు ఇడియట్స్ అనేది తేలుద్దాం: బైడెన్ ఫైర్)
Comments
Please login to add a commentAdd a comment