కడప నగరంలో వన్ టౌన్ పోలీసులు బుధవారం సాయంత్రం ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు.
కడప: కడప నగరంలో వన్ టౌన్ పోలీసులు బుధవారం సాయంత్రం ముగ్గురు దొంగలను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ.17 వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. తరచూ చోరీలకు పాల్పడుతున్న కర్నూలు జిల్లా డోన్‌కు చెందిన ఎరుకల కుమార్, గారడి శివ, రామచంద్రలను కడప పట్టణంలో అరెస్ట్ చేశామని పోలీసులు చెప్పారు.
మరోవైపు మోటార్‌బైక్‌ల చోరీకి పాల్పడుతున్న గౌస్‌బాషా అనే దొంగను కూడా బుధవారం కడప వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి రెండు మోటార్ బైక్‌లు స్వాధీనం చేసుకున్నారు. కడప నగరం మరాఠీ వీధికి చెందిన గౌస్‌బాషా బైక్ దొంగతనాలు చేసేవాడని పోలీసులు చెప్పారు.