
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, మంచిర్యాల : పట్టణంలోని ఓ రెస్టారెంట్‌లో దారుణం చోటుచేసుకుంది. రెస్టారెంట్ యాజమాన్యం అక్కడ పనిచేస్తున్న కుకింగ్ మాస్టర్స్, వేటర్స్‌ను గదుల్లో బంధించి చిత్రహింసలకు గురి చేసిన ఘటన కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మంచిర్యాల పట్టణం హైటెక్ కాలనీ సమీపంలోని టేబుల్7 రెస్టారెంట్‌లో పనిచేస్తున్న మొత్తం 11మందిని మూడు గదుల్లో బంధించి యాజమాన్యం విచక్షణా రహితంగా చితకబాదింది. రెస్టారెంట్ ఓనర్ ప్రవీణ్‌కు వీడియో కాల్‌లో చిత్రహింసల దృశ్యాలను చూపిస్తూ యాజమాన్యం కిరాతకంగా వ్యవహరించింది. ప్రాణాపాయ స్థితిలో ఉన్న బాధితులు 100కు డయల్ చేయటంతో పోలీసులు రంగప్రవేశం చేసి వారిని రక్షించారు. అయితే పనివాళ్లను చిత్రహింసలకు గురిచేయటానికి గల కారణాలు తెలియరాలేదు. పోలీసులు నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బాధితులు కోరారు.
Comments
Please login to add a commentAdd a comment