బాలికను వేధించిన ఇద్దరిపై ‘నిర్భయ’ కేసు | Nirbhaya case filed on two person in girl torture case | Sakshi
Sakshi News home page

బాలికను వేధించిన ఇద్దరిపై ‘నిర్భయ’ కేసు

Published Thu, Feb 12 2015 1:11 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM

Nirbhaya case filed on two person in girl torture case

రంగారెడ్డి జిల్లా : ఓ బాలికను వేధించిన ఇద్దరిపై రంగారెడ్డి జిల్లా జవహర్‌నగర్ పోలీసులు నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి బుధవారం రిమాండుకు తరలించారు. జవహర్‌నగర్‌లోని మార్వాడిలైన్ కాలనీకి చెందిన బాలిక(14) స్థానిక ప్రభుత్వ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. అదే కాలనీకి చెందిన భానుగడ్డ తరుణ్‌కుమార్ (22), అతడి స్నేహితుడు కీసర గ్రామానికి చెందిన నిఖిల్(19)లు కొంతకాలంగా బాలికను వేధించసాగారు. తనను ప్రేమించాలని నిఖిల్ నిత్యం విద్యార్థినిని వెంబడిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నాడు. వేధింపులు తాళలేని బాలిక ఈ విషయాన్ని కుటుంబీకులకు తెలిపింది. బాధితురాలి కుటుంబీకుల ఫిర్యాదు మేరకు నిందితులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement