Bollywood Actress Rakhi Sawant Fire On Husband Adil Durrani Affair - Sakshi
Sakshi News home page

Rakhi Sawant: ఆ అమ్మాయితో ఉంటానని వెళ్లాడు.. నేనేంటో చూపిస్తా: రాఖీ సావంత్

Published Mon, Feb 6 2023 5:32 PM | Last Updated on Mon, Feb 6 2023 6:01 PM

Bollywood Actress Rakhi Sawant Fire On Husband Adil Durrani Affiair - Sakshi

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌, బాలీవుడ్ నటి రాఖీసావంత్‌ వివాహం రోజుకో మలుపు తిరుగుతోంది. కొద్ది రోజుల క్రితమే తన భర్త అదిల్ దురానీతో ఎలాంటి వివాదం లేదని ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో అందరూ ఈ జంట మధ్య సయోధ్యం కుదిరినట్లు భావించారు. కానీ కథ మరోసారి అడ్డం తిరిగింది. మొదట ఈ పెళ్లి ఫేక్ అని కొట్టి పారేసిన ఆమె ప్రియుడు ఆదిల్ మళ్లీ ప్లేట్ ఫిరాయించాడు. 

అతనికి మరొకరితో వివాహేతర సంబంధముందని ఆరోపించిన రాఖీ సావంత్ ఆమె పేరును సైతం మీడియాకు వెల్లడించింది. ఈ క్రమంలోనే కన్నీటి పర్యంతమైంది రాఖీ.  ఆమె ఏడుస్తూ తన బాధలను మీడియాకు వివరించింది. ఆదిల్ ఆ అమ్మాయితోనే ఉండాలనుకుంటున్నాడని రాఖీ ఆరోపిస్తోంది. రాఖీ బోరున విలపిస్తూ మీడియా ముందు తన బాధను వ్యక్తం చేసింది. నా వద్ద వారిద్దరికీ సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా ఉన్నాయని తెలిపింది. నన్ను మానసికంగా, శారీరకంగా వేధింపులకు గురి చేస్తున్నారని వాపోయింది. ఈ సందర్భంగా ఆమె భర్త ఆదిల్‌.. తను అనే అమ‍్మాయితో వెళ్లాడని వివరించింది.

రాఖీ సావంత్ మాట్లాడుతూ..'ఆదిల్.. తను అనే అమ్మాయితోనే ఉండాలని నిర్ణయం తీసుకున్నాడు. బాలీవుడ్‌లో నా సొంత కష్టంతోనే ఎదిగాను. బాలీవుడ్‌ల సంపాదించిన నా డబ్బు అంతా ఆదిల్ తీసుకున్నాడు. నా వద్ద అన్ని ఆధారాలు ఉన్నాయి. ఫిజికల్‌గా, మెంటల్‌గా, ఎమోషనల్‌గా నన్ను టార్చర్ చేశాడు. పెళ్లి తర్వాత అతనిపై క్రిమినల్ కేసులు ఉన్నాయని తెలిసింది. ఆదిల్ తనను అత్యంత దారుణంగా హింసించాడు.' అంటూ రోదించింది. ఈ వీడియోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మరికొందరు రాఖీ సావంత్‌కు అండగా ఉంటామని పోస్టులు పెడుతున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement