When Manisha Koirala Said My Husband Is My Biggest Enemy Recalls Divorce, Deets Inside - Sakshi
Sakshi News home page

Manisha Koirala: విడాకుల గురించి షాకింగ్‌ విషయాలు వెల్లడించిన మనీషా కొయిరాలా

Published Mon, Apr 3 2023 12:22 PM | Last Updated on Mon, Apr 3 2023 1:19 PM

Manisha Koirala Said My Husband Is My Biggest Enemy Recalls Divorce - Sakshi

'నెల్లూరి నెరజాణ' అంటూ తెలుగు ప్రేక్షకులను అలరించిన నటి మనీషా కొయిరాలా. చాలాకాలం తర్వాత మళ్లీ బాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన ఈమె ప్రస్తుతం వరుసగా హిందీ సినిమాల్లో నటిస్తూ బిజీ అవుతుంది. తాజాగా ఓ జాతీయ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో పర్సనల్‌, ప్రొఫెషనల్‌ లైఫ్‌కు సంబంధించి పలు విషయాలను షేర్‌ చేసుకుంది.

నేపాల్‌కి చెందిన సమ్రాట్‌ దహల్‌తో 2010లో ఈమెకు వివాహం జరగగా, పెళ్లైన ఆరు నెలలకే వీరిమద్య భేదాభిప్రాయాలు వచ్చి 2012లో విడాకులు తీసుకుంది. ఈ విషయం గురించి మాట్లాడుతూ.. 'పెళ్లి తర్వాత ఎన్నో కలలు కన్నాను. కానీ ఆర్నెళ్లకే మాకు గొడవలు ప్రారంభమయ్యాయి.తాను ప్రేమించిన భర్తే తనకు శత్రువుగా మారాడు.

స్త్రీకి ఇంతకంటే దారుణం ఏముంటుంది.దీంతో విడాకులు తీసుకోకుండా తప్పలేదు. నాలాంటి సమస్య ఎవరికి రాకూడదు. నేను మాత్రమే కాదు, మీరు మీ పెళ్లి బంధంలో సంతోషంగా లేకుంటే, విడిపోవడమే మంచిది' అంటూ మనీషా కొయిరాలా పేర్కొంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement