దొంగతనం నెపంతో చిత్రహింసలు | robbery blame.. boy tortured | Sakshi
Sakshi News home page

దొంగతనం నెపంతో చిత్రహింసలు

Published Sun, Oct 16 2016 1:25 AM | Last Updated on Wed, Apr 3 2019 3:50 PM

robbery blame.. boy tortured

భీమవరం టౌన్‌ : ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఇద్దరు చిన్నారులను చెట్టుకు కట్టి కొట్టడంతో పాటు ఒకరికి వాతలు పెట్టిన çఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. స్థానిక దుర్గాపురం ప్రాంతానికి చెందిన 13 ఏళ్ల వయసున్న కాపవరపు డేవిడ్‌రాజు, బొద్దూరి నాగేశ్వరరావు అనే చిన్నారులు కొవ్వాడ సెంటర్‌లో పి.పద్మ అనే మహిళ ఇంట్లో దొంగతనం చేశారన్న అనుమానంతో ఈనెల 11న ఆమె తరఫు వ్యక్తులు చెట్టుకు కట్టి కొట్టారు. దొంగిలించిన సొమ్ము, సెల్‌ఫోన్, బంగారు వస్తువు ఇవ్వాలని దౌర్జన్యం చేశారు. డేవిడ్‌రాజుకు వాతలు కూడా పెట్టారు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. దీనిపై బొద్దూరి నాగేశ్వరరావు కుటుంబ సభ్యులు శనివారం టూ టౌన్‌ పోలీస్‌స్టేçÙన్‌లో ఫిర్యాదు చేశారు. డేవిడ్‌ తల్లి కువైట్‌లో ఉండగా తండ్రి లేకపోవడంతో మావ య్య ఇంట్లో ఉంటున్నాడు.  6వ తరగతి వరకు ^è దువుకుని మానేశాడు. బొద్దూరి నాగేశ్వరరావుకు తల్లి ఉండగా తండ్రి లేడు. 3వ తరగతి వరకూ చదువుకుని మానేశాడు. దీనిపై సీఐ ఎం.రమేష్‌బాబు మాట్లాడుతూ ఇద్దరు బాలురను ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేర్పించామని, కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement