కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు.
హైదరాబాద్ : కార్మికుల కోసం ప్రత్యేకంగా బ్యాంకు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన పరిశీలనలో ఉందని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. దీనిపై అధ్యయన కమిటీ వేశామని చెప్పారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఆదివారం మే డే సందర్భంగా కార్మికులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.
రాజకీయాలకు అతీతంగా కార్మిక శక్తి ఎదగాలని ఆశించారు. కార్మికులే దేశ నిర్మాతలుగా అభివర్ణించారు. ఇటీవల ఈపీఎఫ్‌పై వడ్డీ రేటును ఆర్థిక శాఖ తగ్గించడంపై దుమారం రేగిన నేపథ్యంలో కార్మిక శాఖ, ఆర్థిక శాఖల మధ్య ఎటువంటి విబేధాలు లేవని దత్తాత్రేయ స్పష్టం చేశారు. కార్మికుల నిధులు దారి మళ్లిస్తున్నారంటూ చేస్తున్న అబద్ధపు ప్రచారాన్ని నమ్మవద్దన్నారు.