హైదరాబాద్‌లో వైరాలజీ ల్యాబ్
కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డాకి దత్తాత్రేయ విజ్ఞప్తి
సాక్షి, న్యూఢిల్లీ: స్వైన్‌ఫ్లూ, మలేరి యా వంటి వ్యాధుల నివారణలో భాగంగా వాటిపై మరింత లోతైన పరిశోధన కోసం హైదరాబాద్‌లో ఒక వైరాలజీ ల్యాబొరేటరీని ఏర్పా టు చేయాలని కేంద్ర కార్మిక మంత్రి బండారు దత్తాత్రేయ, కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి జేపీ నడ్డాకు విజ్ఞప్తి చేశారు. తెలంగాణలో స్వైన్‌ఫ్లూ పరి స్థితిని వివరించడంతోపాటు, రాష్ట్రం లో వైద్య సదుపాయాలు మెరుగుపర్చాలని కోరుతూ దత్తాత్రేయ ఆరోగ్యశాఖ మంత్రికి ఓ వినతి పత్రాన్ని అందజేశారు.
శుక్రవారం ఢిల్లీలోని నిర్మాణ్‌భవన్‌లో ఆయన మంత్రి జేపీ నడ్డాను కలిశారు. దత్తాత్రేయతోపాటు కేంద్ర జలవనరులశాఖ సలహాదారు వెదిరె శ్రీరాం ఉన్నా రు. నడ్డాతో సమావేశం అనంతరం దత్తాత్రేయ మీడియాతో మాట్లాడారు. ‘హైదరాబాద్, రంగారెడ్డితోపాటు మహబూబ్‌నగర్, కరీంనగర్ జిల్లాల్లో స్వైన్‌ఫ్లూ కేసులు నమోదవుతున్న విషయాన్ని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి నడ్డా దృష్టికి తెచ్చాను’ అని దత్తాత్రేయ తెలిపారు.
గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక నిధులు ఇవ్వాలని కోరినట్టు చెప్పారు. ఏటా ఆదిలాబాద్ జిల్లా గిరిజన ప్రాం తాల్లో చాలామంది మలేరియాతో చనిపోతున్నారని, కొత్తగా స్వైన్‌ఫ్లూ విజృంభిస్తోందని ఈ నేపథ్యంలో వ్యాధులపై పరిశోధనకు హైదరాబాద్‌లో వైరాలజీ రీసెర్చ్ ల్యాబ్ ఏర్పాటు చేయాలని కోరినట్టు వివరించారు. ఈ సమస్యలను పరిష్కరిస్తామని నడ్డా హామీ ఇచ్చినట్టు తెలిపారు. గాంధీ, ఉస్మానియా ఆస్పత్రుల్లో సదుపాయాలు పెంచేందుకు వీలుగా సీఎం కేసీఆర్‌తో త్వరలోనే సమావేశమవుతానని చెప్పారు.