ఇంట్లో పనిచేసేవారికీ ఈఎస్‌ఐ సేవలు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ
సాక్షి, హైదరాబాద్: ఇళ్లలో పనిచేసే వారికి కూడా ఈఎస్‌ఐ వైద్య సేవలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పెలైట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆదివారమిక్కడి ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఇళ్లలో పనిచేసే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈఎస్‌ఐ ఆస్పత్రులలో ఓపీ సేవలు కల్పించేందుకు నామమాత్రంగా ఏడాదికి రూ.1,200 వసూలు చేయనున్నట్లు వివరించారు.
అయితే వీటిని కూడా పనిచేసే వారి నుంచి కాకుండా ... పనిచేయించుకునే వారి నుంచి వసూలు చేస్తామన్నారు. మొదటి 6 నెలల పాటు ప్రతి నెలా రూ.200 వసూలు చేస్తామన్నారు. మెటర్నిటీ బిల్లు ఆమోదం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 1.8 మిలియన్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు.