OP services
-
ప్రభుత్వ ఉద్యోగుల కోసం ‘ప్రత్యేక ఓపీ’
లబ్బీపేట(విజయవాడ తూర్పు): రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు, వారి కుటుంబసభ్యులకు ఎంప్లాయీస్ హెల్త్ స్కీం(ఈహెచ్ఎస్) ద్వారా మెరుగైన వైద్యం అందించేందుకు విజయవాడ ప్రభుత్వాస్పత్రిలోని సూపర్ స్పెషాలిటీ బ్లాక్‌లో ప్రత్యేక ఓపీ కౌంటర్ ఏర్పాటుచేశారు. ఈ కౌంటర్‌ను ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఎస్.డిల్లీరావు గురువారం ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు రాష్ట్రంలోనే తొలిసారిగా విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో ప్రత్యేక ఓపీ సేవలు ప్రారంభించినట్లు తెలిపారు. ప్రతి సోమవారం గ్యాస్ట్రో ఎంట్రాలజీ, మంగళవారం మానసిక వ్యాధులు, జనరల్ మెడిసిన్, బుధవారం గుండె, కిడ్నీ వ్యాధులు, గురువారం ఆర్థోపెడిక్, న్యూరాలజీ, జనరల్ మెడిసిన్, శుక్రవారం చర్మ వ్యాధులు, జనరల్ మెడిసిన్, శనివారం ఊపిరితిత్తుల వ్యాధులకు సంబంధించిన పరీక్షలు చేసి మందులు అందజేస్తారని తెలియజేశారు. రోజూ ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. రక్తపోటు, హైపో థైరాయిడ్, రుమటాయిడ్ ఆర్థరైటీస్, నెఫ్రోటిక్ సిండ్రోమ్, క్రానిక్ కిడ్నీ వ్యాధులు వంటి వాటికి పరీక్షలు చేసి మందులు అందిస్తారని తెలిపారు. ప్రభుత్వాస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బి.సౌభాగ్యలక్ష్మి, సిద్ధార్థ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ విఠల్‌రావు, జిల్లా ఆరోగ్యశ్రీ కో–ఆర్డినేటర్ జె.సుమన్, ఆర్‌ఎంఓలు శోభ, మంగాదేవి, ఎన్జీవో నాయకులు పాల్గొన్నారు. -
నిమ్స్‌లో ఓపీ బంద్!
లక్డీకాపూల్(హైదరాబాద్) : కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ప్రముఖ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(నిమ్స్) ఓపీ, అడ్మిషన్ సేవలను ఆస్పత్రి యాజమాన్యం తాత్కాలికంగా నిలిపేసింది. అధికారికంగా 5 విభాగాల్లోనే ఈ సేవలను ఆపినట్లు ప్రకటించినా..పూర్తిస్థాయిలో ఓపీ బంద్ ఉన్నట్లు సమాచారం. ఇన్ పేషెంట్ సేవలను కూడా చాలా వరకు తగ్గించారు. అలాగే ఉద్యోగుల హాజరుపై కూడా పలు నిర్ణయాలు తీసుకుంటూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో కరోనా వ్యాప్తి తొలినాళ్లలో విధించిన లాక్డౌన్ పరిస్థితులే మళ్లీ ఆస్పత్రిలో నెలకొన్నాయి. లాక్డౌన్ నిబంధనల సడలింపులకు ముందు నిమ్స్‌లోని దాదాపు అన్ని వైద్య విభాగాలకు తాళాలు పడ్డాయి. ఓల్డ్ బిల్డింగ్‌లోని ఏ, బీ, సీ బ్లాక్లైతే ఇంకా తెరుచుకోనేలేదు. ఈ నేపథ్యంలో కార్డియాలజీ విభా గంలో ఓ రోగికి కరోనా రావడం.. అది అలా ప్రొఫెసర్లకు, వైద్యులకు వ్యాప్తి చెందడంతో ఆస్పత్రిలో నియంత్రణ చర్యలు ప్రారంభించారు. వైరస్ వ్యాప్తి చెందకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టేం దుకు సంసిద్ధమయ్యారు. దీని లో భాగంగా రోగుల ప్రవేశంపై ఆంక్షలు విధించారు. అలాగే వైద్యులు, వైద్య సిబ్బంది, ఉద్యోగులు, కార్మి కులు సైతం 70 శాతం మేరకే విధులకు హాజరయ్యేలా చర్యలు తీసుకున్నారు. మిగిలిన 30% మంది విధిగా హోం క్వారంటైన్లో ఉండాలని ఆదేశించారు. ఈ మేరకు నిమ్స్ మెడికల్ సూపరింటెండెంట్ ప్రొఫెసర్ నిమ్మ సత్యనారాయణ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవానికి ఈ ఉత్తర్వులు మంగళవారమే వెలువడినట్లు నిమ్స్ ఉద్యోగ వర్గాలు పేర్కొంటున్నాయి. ఇన్ పేషెంట్లు సైతం ఖాళీ.. ఆస్పత్రిలో వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు చికిత్స పొందుతున్న రోగులను సైతం డిశ్చార్జి చేసి పంపించే చర్యలు చేపట్టారు. గత రెండు రోజుల నుంచి స్పెషాలిటీ బ్లాక్‌లోని కార్డియాలజీ విభాగంలో ఇన్పేషెంట్లుగా చికిత్స పొందుతున్న వారిని ఖాళీ చేయిస్తున్నారు. ఇదే ప్రక్రియను ఆస్పత్రిలోని ఇతర విభాగాలు కూడా అనుసరిస్తున్నాయి. దీంతో ఆస్పత్రిలోని ఆయా విభాగాల్లో వైద్యం అందుకుంటున్న వారు రెండు రోజులుగా డిశ్చార్జి అవుతున్నారు. అయితే, వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న రోగులను ఎక్కడికి తరలించాలన్న దానిపై ఆస్పత్రి యాజమాన్యం తర్జనభర్జన పడుతోంది. కార్డియాలజీ ఐసీయూ సహా ఆస్పత్రిలోని వివిధ విభాగాల్లో దాదాపు 100 మంది వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నట్లు సమాచారం. వీరిలో కొంత మందిని డిశ్చార్జి చేయనున్నారు. మిగిలిన వారిని ఎక్కడికి తరలించాలన్న దానిపై యాజమాన్యం సమాలోచనలు జరుపుతోంది. ముఖ్యంగా ఆదివారం నుంచి స్పెషాలిటీ బ్లాక్‌ను పూర్తిగా బ్లాక్ చేసేందుకు సన్నద్ధమయ్యారు. వైరస్ వ్యాప్తి చెందింది ఈ బ్లాక్ నుంచే కావడంతో హైపో క్లోరైడ్, శానిటైజ్ వంటి ప్రక్రియతో పూర్తిగా శుభ్రపరిచే చర్యలు తీసుకుంటున్నట్లు సూపరింటెండెంట్ సత్యనారాయణ పేర్కొన్నారు. పెరుగుతున్న పాజిటివ్ కేసులు.. ఆస్పత్రిలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు వైద్యులు, వైద్య సిబ్బంది, కార్మికులు.. అంతా కలిపి 20మంది కరోనా వైరస్ బారిన పడినట్లు యాజమాన్యం అధికారంగా వెల్లడించింది. వాస్తవానికి ఈ సంఖ్యకు మూడింతల మంది కరోనాతో బాధపడుతున్నట్లు విశ్వనీయ సమాచారం. ప్రస్తుతం నిమ్స్ మిలీనియం బ్లాక్ మొదటి అంతస్తులో చికిత్స పొందుతున్నది 12 మంది వైద్యులు మాత్రమే. అంతకుముందు దాదాపుగా 20 మంది ప్రొఫెసర్లు, రెసిడెంట్ డాక్టర్లను నిమ్స్ యాజమాన్యం హోం క్వారంటైన్‌కు పంపించింది. కాగా, శనివారం ఓపీ విభాగం మూసివేతతో ఆస్పత్రిలో బంద్ వాతావరణం కనిపించింది. యూరాలజీ విభాగం మాత్రమే ఓపీ సేవలను అందించింది. మిగిలిన విభాగాలకు రోగులు కూడా రాకపోవడం గమనార్హం. -
నిమ్స్ ఓపీ సేవలు షురూ
సాక్షి, హైదరాబాద్: నిజామ్ వైద్య విజ్ఞాన సంస్థ (నిమ్స్)లో అవుట్ పేషెంట్ (ఓపీ) సేవలు మం గళవారం నుంచి మొదలయ్యాయి. దేశంలో అ మలవుతున్న లాక్డౌన్ కారణంగా గత కొంతకాలంగా బోసిపోయినట్లున్న ఆస్పత్రికి మళ్లీ రోగుల రాక మొదలైంది. రవాణా సదుపాయం లేకపోవడం ఒక కారణమైతే..నిమ్స్‌లో కరోనా అనుమానితులకు ప్రత్యేక వార్డును ఏర్పాటు చేస్తున్నారన్న సమాచారంతో చాలామంది ఆస్పత్రికి రావడానికి భయపడిన పరిస్థితి. ఈ పరిణామాల నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిమ్స్‌ను నాన్–కరోనా ఆస్పత్రిగా ప్రకటించింది. దీంతో ఊపిరిపీల్చుకున్న రోగులు నిమ్స్‌కు రావడం మొదలు పెట్టారు. అందుకు అనుగుణంగా ఆస్పత్రి యాజమాన్యం ప్రత్యేక ఏర్పాట్లు చేపట్టింది. సాధారణంగా అవుట్ పేషెంట్ విభాగాలను పాత భవనంలో ఓపీ బ్లాక్‌లోనూ, స్పెషాలిటీ బ్లాక్‌లోనూ నిర్వహిస్తారు. ప్రస్తుతం అన్ని ఓపీ సేవలను ఒక దగ్గరే నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మిలీనియం బ్లాక్‌లో స్క్రీనింగ్ టెస్ట్.. ఓపీ సేవల కోసం వచ్చిన ప్రతిరోగికి ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తున్నారు. కరోనా లక్షణాలు లేవని నిర్థారించుకున్నాకే ఓపీ కార్డులను జారీ చేస్తున్నారు. ఈ టెస్ట్‌లో ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే వారిని గాం ధీ ఆస్పత్రికి సిఫార్సు చేస్తున్నారు. ఇలా మంగళవారం 280 మందికి స్క్రీనింగ్ టెస్ట్‌లు నిర్వహించారు. అందులో తొమ్మిది మందిలో కరోనా వైరస్ లక్షణాలున్నట్టు అనుమానిస్తూ ఆయా రోగులను గాంధీకి తరలించినట్టు సమాచారం. గతంలో ఇద్దరు వైద్యులకు కరోనా వైరస్ లక్షణాలు కన్పించిన నేపథ్యంలో ఈ విధమైన జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. -
టెలీ డాక్టర్లు
సాక్షి, అమరావతి, సాక్షి నెట్వర్క్: లాక్డౌన్ కారణంగా కాలు బయట పెట్టలేక అనారోగ్యంతో బాధపడుతున్న వారికి టెలీ మెడిసిన్ సేవలు ఉపశమనాన్ని కలిగిస్తున్నాయి. ప్రజా రవాణా వ్యవస్థ లేకపోవడంతో రాష్ట్రవ్యాప్తంగా ఔట్‌పేషెంటు (ఓపీ) సేవలు నిలిచిపోయాయి. రాష్ట్రంలో నిత్యం సగటున 4.75 లక్షల మంది ఔట్‌పేషెంట్ సేవల కోసం ఆస్పత్రులకు వెళుతుంటారు. వీరు ఎదుర్కొంటున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని కొన్ని ప్రైవేట్ ఆస్పత్రులు, వైద్య సంఘాలు ఆన్లైన్ కన్సల్టెన్సీ సేవలను ఉచితంగా నిర్వహిస్తున్నాయి. ఆడియో, వీడియో కాల్స్ ద్వారా పేషెంట్లతో మాట్లాడి అత్యవసరం కాని వాటికి ఫోన్లోనే పరిష్కారం చూపిస్తున్నారు. ఆర్థోపెడిక్, సైకియాట్రీ అసోసియేషన్లతో పాటు ఇండియన్ మెడికల్ అసోసియేషన్లు టెలిఫోన్ ద్వారా రోగులకు ఉచితంగా సేవలందిస్తున్నాయి. రోజూ ఆన్లైన్ సేవలు పొందుతూ చికిత్స తీసుకుంటున్నవారు 30 వేల మంది వరకు ఉన్నట్లు తేలింది. ప్రతి జిల్లాలో ఉచితంగా సేవలు ‘ఆర్థోపెడిక్ సర్జన్ల సొసైటీ తరఫున రాష్ట్రంలోని 13 జిల్లాల్లోనూ ఆన్లైన్లో ఓపీ సేవలు ఉచితంగా అందిస్తున్నాం. హెల్ప్ లైన్ నెంబరు 8801446611 కు ఫోన్ చేస్తే ఏ జిల్లాలో సేవలు కావాలంటే ఆయా డాక్టర్లు మాట్లాడతారు. ఉచిత టెలీ కన్సల్టేషన్ సేవలు లాక్డౌన్ పూర్తయ్యేవరకూ ఈ సేవలు అందుబాటులో ఉంటాయి’ –డా.జె.నరేష్‌బాబు, వెన్నుపూస వైద్య నిపుణులు, జనరల్ సెక్రటరీ, ఆర్థోపెడిక్ సర్జన్స్ అసోసియేషన్ – గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన 42 ఏళ్ల గృహిణికి అకస్మాత్తుగా వెన్నెముక, ఎడమ కాలు మోకాలి భాగంలో తీవ్ర నొప్పి మొదలైంది. లాక్‌డౌన్‌తో ఆసుపత్రికి వెళ్లే పరిస్థితి లేనందున గుంటూరుకు చెందిన ఆర్థోపెడిక్ డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ జె.నరేష్‌కు ఫోన్ చేసి సమస్య వివరించింది. వీడియో కాల్ ద్వారా ఆమెతో మాట్లాడిన డాక్టర్ ఏ మందులు వాడాలో సూచించడంతో ఉపశమనం లభించింది. – నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలలో టెలీమెడిసిన్ సేవల కోసం ఏర్పాటైన 18004256040 టోల్‌ఫ్రీ నంబర్‌కు తొలి రోజే విశేష స్పందన లభించింది. శనివారం సాయంత్రానికి 67 మంది ఫోన్ చేసి వైద్య సలహాలు పొందారు. వైద్య ఆరోగ్యశాఖ తరపున సత్యనారాయణ కాల్స్ రిసీవ్ చేసుకుని సంబంధిత డాక్టర్‌కు కనెక్ట్ చేస్తున్నారు. రోగులకు ఎంతో ఉపయోగం – డాక్టర్ గౌరీనాథ్, పల్మనాలజిస్ట్, అపోలో స్పెషాలిటీ ఆస్పత్రి టెలీ మెడిసిన్‌కు విశేష స్పందన లభిస్తోంది. లాక్డౌన్ వల్ల ప్రజలు ఇబ్బంది పడకుండా ప్రభుత్వం టెలీమెడిసిన్ ద్వారా రోగులకు ప్రత్యామ్నాయ సేవలు అందించడం అభినందనీయం. మానసిక సమస్యలకు ఫోన్లో పరిష్కారాలు – డాక్టర్ ఎస్.అఖిలేష్, కన్సల్టంట్ సైకియాట్రిస్టు, డిస్ట్రిక్ట్ మెంటల్ హెల్త్ ప్రోగ్రాం, ప్రకాశం జిల్లా గత 15 రోజుల్లో 40 మంది వ్యక్తులకు టెలీ మెడిసిన్ ద్వారా మానసిక సమస్యలకు సలహాలు ఇచ్చాం. జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారు కరోనా సోకినట్లు భ్రమపడి నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. అల్కహాల్ తీసుకునే వారు కూడా ఎక్కువగా ఫోన్లు చేస్తున్నారు. వీరందరికీ సూచనలు, అవసరమైన మందులను టెలీ మెడిసిన్ ద్వారా సూచిస్తున్నాం. ‘మధుమేహానికి మందులు వాడుతున్నా. మార్చి 31 సాయంత్రం ఒక్కసారిగా షుగర్ లెవల్స్ పడిపోయాయి. రెగ్యులర్‌గా వెళ్లే ప్రైవేట్ హాస్పిటల్‌కి ఫోన్ చేస్తే లాక్డౌన్ వల్ల డాక్టర్లు అందుబాటులో లేరని చెప్పారు. టెలి మెడిసిన్ నంబర్‌కి కాల్ చేస్తే డాక్టర్ దాదాపు 10 నిమిషాలపాటు మాట్లాడి మందులిచ్చారు. అవి వాడిన కొద్ది గంటలకే సాధారణ స్థితికి చేరుకున్నా. – సుధాకర్‌రావు, విశ్రాంత ఉద్యోగి, అగనంపూడి అమెరికాలో మా సంస్ధ ద్వారా మారుమూల ప్రాంతాలకు కూడా టెలి మెడిసిన్ సేవలను అందించాం. రాష్ట్రంలో కూడా కాల్ సెంటర్ ఏర్పాటు చేశాం. రోగులు 9703446611 నంబర్‌కు ఫోన్ చేస్తే వైద్యులతో అనుసంధానం చేస్తాం. కష్టకాలంలో మావంతు సాయంగా ఈ సేవలను ఉచితంగా అందిస్తున్నాం. – లోకేష్, సీఈఓ, వెబ్‌ట్విక్ సొల్యూషన్స్ ప్రభుత్వ నిర్ణయం అభినందనీయం.. ప్రభుత్వం టెలీ మెడిసిన్ విధానానికి అవకాశం కల్పించడం మంచి నిర్ణయం. ఆర్థోపెడిక్ వైద్యులంతా కలిసి ఒక కాల్ సెంటర్‌ను ఏర్పాటు చేశాం. హెల్ప్ లైన్ నంబరు 8801446611కు ఫోన్ చేసి అనారోగ్యం వివరాలు చెబితే మందులను సూచిస్తాం. – ఎస్ సుబ్రమణ్య రావు, ఆర్ధోపెడిక్ వైద్య నిపుణులు, కడప, వైఎస్సార్ జిల్లా చిత్తూరులోని ముఖ్యమంత్రి ఆరోగ్య కేంద్రాలు, పీహెచ్‌సీల్లో వైద్యులు టెలిమెడిసిన్ ద్వారా విస్తృతంగా పరీక్షలు నిర్వహించి మందులు సూచిస్తున్నారు. తిరుపతిలోని రుయాలో గైనకాలజిస్టు, పీడియాట్రిక్, ఆర్థోపెడిక్, జనరల్‌మెడిసిన్, కార్డియాలజీ వైద్యులు వీడియా కాల్స్ ద్వారా పేషెంట్లతో నేరుగా మాట్లాడి మందులు సూచిస్తున్నారు. టెలిమెడిసన్ ద్వారా రోజు 20 మందికి వైద్యం చేస్తున్నామని చిత్తూరులోని సత్యనారాయణపురం ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి అనురాధ పేర్కొన్నారు. -
ఆరోగ్యానికి భరోసా.. ఎయిమ్స్‌తో కులాసా!
సాక్షి, హైదరాబాద్: ప్రతిష్టాత్మక బీబీనగర్ ఎయిమ్స్‌లో వచ్చే డిసెంబర్ నుంచి ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు అందుబాటులోకి రానున్నాయి. అక్కడ నిమ్స్ ఆధ్వర్యంలో సేవలు కొనసాగుతుండగా, త్వరలో ఎయిమ్స్ సేవలు ప్రారంభం కానున్నాయి. దేశవ్యాప్తంగా అత్యంత ప్రతిభ గల ప్రముఖవైద్యులు, ప్రొఫెసర్లు అక్కడ అందుబాటులో ఉంటారు. వారి సేవలు బీబీనగర్ చుట్టుపక్కల జిల్లాల ప్రజలకు అం దనున్నాయి. ఇప్పటికే నిమ్స్ ద్వారా రోజుకు 500 మంది వరకు ఓపీ రోగులు వస్తున్నా రని అంచనా. ఎయిమ్స్ సేవలు అందుబాటులోకి వస్తే రోజుకు 2వేల మంది వరకు వచ్చే అవకాశముందంటున్నారు. ఈ ఏడాది నుంచి బీబీనగర్ ఎయిమ్స్‌లో ఎంబీబీఎస్ తరగతులు ప్రారంభమ య్యాయి. పలు రాష్ట్రాలకు చెందిన 50మంది విద్యార్థులు వైద్య విద్యను అభ్యసిస్తున్నారు. మార్చి నుంచి ఇన్ పేషెంట్ సేవలు... వచ్చే మార్చి నుంచి ఇన్‌పేషెంట్(ఐపీ) సేవలు ప్రారంభం కానున్నాయని అధికారులు చెబుతున్నారు. ప్రధానంగా జనరల్ మెడిసిన్, గైనిక్ విభాగాల్లో ఇన్ పేషెంట్లకు ముందుగా వైద్య సేవలు ప్రారంభించి తదుపరి విడతల వారీగా ఇతర వైద్య సేవలన్నింటినీ ప్రారంభిస్తారని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు చెబుతున్నాయి. ఎయిమ్స్ వర్గాలు ముందుగా 750 పడకలతో అనుబంధ ఆస్పత్రి ప్రారంభించాలని అనుకున్నారు. కానీ ఇక్కడి రద్దీని దృష్టిలో ఉంచుకొని వెయ్యి పడకలకు పెంచాలని వైద్య ఆరోగ్యశాఖ వర్గాలు కేంద్ర ఎయిమ్స్ వర్గాలకు విజ్ఞప్తి చేశాయి. అందుకు కేంద్ర వర్గాలు సుముఖత వ్యక్తంచేసినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖకు చెందిన కీలకాధికారి ఒకరు తెలిపారు. ఇన్‌పేషెంట్లు 2 వేల వరకు రోజూ ఉంటే, పడకల సంఖ్య తప్పనిసరిగా వెయ్యి ఉండాలని అంటున్నారు. నిమ్స్‌లో ప్రస్తుతమున్న ఫీజుల మాదిరిగానే ఎయిమ్స్‌లో ఉంటాయని అంటున్నారు. దీనిపై ఇంకా ఎలాంటి సమాచారం లేదని చెబుతున్నారు. మూడేళ్లలో నిర్మాణం పూర్తి.. బీబీనగర్ ఎయిమ్స్ కోసం తెలంగాణ ప్రభుత్వం దేశంలో ఎక్కడా లేని విధంగా 200 ఎకరాలు కేటాయించింది. అధికారులు పలుమార్లు దీనిపై ఢిల్లీకి వెళ్లి ఎయిమ్స్ కోసం కృషిచేశారు.ఎట్టకేలకు ఇది సాకారం కావడంతో ఇక్కడి ప్రజలు సంతోషంలో ఉన్నారు. ఇప్పటికే అక్కడ నిమ్స్ భవనాలు ఉండటంతో తాత్కాలికంగా ఎయిమ్స్ నడిపిస్తున్నారు. మూడేళ్లలోగా పూర్తిస్థాయిలో 200 ఎకరాల్లో హాస్టళ్లు, ప్రొఫెసర్లు, డాక్టర్ల వసతి గృహాలు పూర్తికానున్నాయి.అద్భుతమైన మైదానాలు, స్విమ్మింగ్ ఫూల్స్, బృందావనాలు కూడా రూపుదిద్దుకుంటాయని అధికారులు చెబుతున్నారు. అందుకోసం ఎయిమ్స్ ఇప్పటికే నిధులు కేటాయించింది. మున్ముందు పీజీ సీట్లు కూడా వచ్చాక ఎయిమ్స్ ద్వారా ఇక్కడి ప్రాంత వాసులకు మరింత మెరుగైన వైద్యం అందుబాటులోకి రానుంది. హైదరాబాద్‌లోని కార్పొరేట్ ఆసుపత్రులకు మించి వైద్యం ఉంటుందని, అదే రాష్ట్రంలో వైద్యానికి బెంచ్‌మార్క్‌గా ఉంటుందని అంటున్నారు. అంతేగాక అనేక పరిశోధనలు కూడా ఇక్కడ జరగనున్నాయి. -
ఓపీ సేవలు అదనం?
మెదక్‌జోన్: ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఆరోగ్య సేవలు గణనీయంగా మెరుగుపడ్డాయి. వైద్య సిబ్బందిని నియమించడంతోపాటు రోగులసంఖ్యకు అనుగుణంగా ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన వసతులు కల్పిస్తున్నారు. ఆస్పత్రి అప్‌గ్రేడ్ చేయడం వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. దీంతో ఒకప్పుడు సర్కార్ దవాఖానా అంటేనే భయపడే వారు ప్రస్తుతం బారులు తీరి చికిత్స పొందుతున్నారు. కేసీఆర్ కిట్ పథకంతో ప్రభుత్వ ఆస్పత్రుల్లో ప్రసవాల సంఖ్య పెరిగింది. బయటనుంచి వచ్చే రోగులకు (ఓపీ) చికిత్స అందించే సమయం ప్రస్తుతం ఉదయం 9 నుంచి 12 గంటల వరకు కొనసాగుతోంది. ఈ లెక్కన రోజుకు 3గంటలు మాత్రమే సేవలు అందుతున్నాయి. ఆస్పత్రుల్లో మెరుగైన వైద్య సేవలు అందుతున్న క్రమంలో జిల్లా నలుమూలల నుంచి నిత్యం వేలాది మంది జిల్లా కేంద్ర ఆస్పత్రికి చికిత్స కోసం వస్తున్నారు. ఆస్పత్రికి వచ్చిన వారికి చికిత్స అందకుండానే సమయం దాటిపోతుండడంతో నానా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయాన్ని గమనించిన సంబంధిత ఆరోగ్యశాఖ అధికారులు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 2గంటల వరకు బయటనుంచి వచ్చే రోగులకు చికిత్సలు అందజేసేలా సమయాన్ని పొడిగించినట్లు తెలిసింది. ఇకపై నిత్యం 5గంటలపాటు వైద్య సేవలు అందనున్నాయి. జిల్లాలోని 21 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలతోపాటు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో సైతం ఈ సమయం మారనుంది. డయాగ్నస్టిక్ (ల్యాబ్) సేవల సమయాన్ని సైతం అదనంగా రెండు గంటలు పెంచనున్నారు. ఆదేశాలు రాగానే ప్రభుత్వ ఆస్పత్రుల్లో నిత్యం ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు కొనసాగే ఓపీ సమయం అదనంగా రెండు గంటలు పెంపు విషయం ఇంకా అధికారికంగా అందలేదు. ప్రస్తుతం ఎన్నికల కోడ్ ఉన్నందున ఆదేశాలు రాలేదని భావిస్తున్నాం. ఆదేశాలు రాగానే ఉదయం సమయాన్ని అమలు చేస్తాం. – వెంకటేశ్వర్రావు, జిల్లా వైద్యాధికారి -
ఇక ఈవినింగ్ ఓపీ సేవలు
సుల్తాన్‌బజార్: పేదల ధర్మాసుపత్రిగా పేరుగాంచిన ఉస్మానియా ఆసుపత్రిలో త్వరలో పేద ప్రజలు, ఉద్యోగులకు ఓపీ సేవలను అందించేందుకు ఉస్మానియా ఆసుపత్రి పాలక వర్గం సిద్ధమవుతోంది. గతంలో ఆసుపత్రిలో ఉద్యోగులకు వైద్య సేవలు అందించేందుకుగాను ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ పేరుతో ఈహెచ్ఎస్ క్లినిక్‌ను ఓపీ బ్లాక్‌లో ఏర్పాటు చేసి మధ్యాహ్నం రెండు గంటల నుంచి నాలుగు గంటల వరకు పలు విభాగాల వైద్యులు వైద్య సేవలు అందించేవారు. కాగా ఈ ఈహెచ్ఎస్ సేవలు నిలిచిపోవడంతో ఆసుపత్రి పాలక వర్గం ఈసారి ఉద్యోగులతో పాటు ప్రజలకు కూడా వైద్య సేవలను అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తోంది. త్వరలోనే ఈవినింగ్ ఓపీ సేవలు అందుబాటులోకి వచ్చే అవకాశంఉంది. నిత్యం రద్దీ పెరగడంతోనే.. ఉస్మానియా ఆసుపత్రికి నిత్యం రద్దీ పెరుగుతున్న దృష్ట్యా ఉద్యోగులతో పాటు రోగులకు అందుబాటులో ఉండే విధంగా ఈవినింగ్ క్లినిక్‌ను ఏర్పాటు చేసేందుకు కసరత్తు ప్రారంభించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు నిత్యం దవాఖానాలోని ఓపీలో నిత్యం సేవలు అందిస్తున్న ఆసుపత్రి పాలక వర్గం.. ఇక ముందు సాయంత్రం సమయాల్లో కూడా వైద్య సేవ అందుబాటులో ఉంటాయి. ఈవినింగ్ క్లినిక్‌లో మెడిసిన్, సర్జరీ, ఆర్థోపెడిక్ విభాగాలకు చెందిన వైద్యులు అందుబాటు ఉండి సేవల అందిస్తారు. గతంలో ఈహెచ్ఎస్ కొనసాగిన గదులలోనే తిరిగి ఈవినింగ్ క్లినిక్‌ను ప్రారంభించేందుకు పాలక వర్గం అన్ని విధాలా కసరత్తు చేస్తోంది. -
ఆస్పత్రుల్లో ఓపీ బంద్ నేడు
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం ప్రజలకు, డాక్టర్లకు అనుకూలంగా ఉన్న ఐఎంసీ(ఇండియన్ మెడికల్ కౌన్సిల్) చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో నూతనంగా ఎన్ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్)ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీల్లో వైద్య సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎమ్వీవీ ప్రసాద్ అన్నారు. ఓపీల బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను స్థానిక దర్గామిట్టలోని ఐఎంఏ హాల్లో మంగళవారం డాక్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టం వస్తే గతంలో మాదిరిగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు నేరుగా ప్రాక్టీసు చేసేదానికి లేదని, కోర్సు చేసిన వారు ట్ పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా తాము కూడా బుధవారం సత్యాగ్రహ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు ఐఎంఏ హాలు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, డాక్టర్లంతా తరలిరావాలని కోరారు. ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసన్ నూతన చట్టం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఐఎంఏసీనియర్ నాయకులు డా.అశోక్, గౌరవాధ్యక్షుడు డా.భక్తవత్సలం, డా.మల్లిఖార్జునయ్య, డా.బీవీ రవిశంకర్, డా.సుస్మిత పాల్గొన్నారు. -
ఇంట్లో పనిచేసేవారికీ ఈఎస్ఐ సేవలు
కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ సాక్షి, హైదరాబాద్: ఇళ్లలో పనిచేసే వారికి కూడా ఈఎస్ఐ వైద్య సేవలు కల్పించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ చెప్పారు. పెలైట్ ప్రాజెక్టుగా హైదరాబాద్‌ను ఎంపిక చేసినట్లు తెలిపారు. ఆదివారమిక్కడి ప్రాంతీయ భవిష్యనిధి కార్యాలయంలో విలేకరుల సమావేశంలో దత్తాత్రేయ మాట్లాడారు. ఇళ్లలో పనిచేసే వారికి సామాజిక ఆరోగ్య భద్రత కల్పించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నామన్నారు. ఈఎస్ఐ ఆస్పత్రులలో ఓపీ సేవలు కల్పించేందుకు నామమాత్రంగా ఏడాదికి రూ.1,200 వసూలు చేయనున్నట్లు వివరించారు. అయితే వీటిని కూడా పనిచేసే వారి నుంచి కాకుండా ... పనిచేయించుకునే వారి నుంచి వసూలు చేస్తామన్నారు. మొదటి 6 నెలల పాటు ప్రతి నెలా రూ.200 వసూలు చేస్తామన్నారు. మెటర్నిటీ బిల్లు ఆమోదం వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న 1.8 మిలియన్ల మహిళా ఉద్యోగులకు ప్రయోజనం చేకూరనుందన్నారు. -
ఓపీ సేవలపై ఉద్యోగుల అనాసక్తి!
♦ 20 లక్షల మందికిగాను సేవలు పొందింది 2,393 మందే ♦ స్పెషలిస్టులు లేక వెలవెలబోతున్న ప్రభుత్వాసుపత్రులు ♦ అగమ్యగోచరంగా మారిన హెల్త్ కార్డుల పథకం సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో హెల్త్‌కార్డుల పథకం కింద.. మధుమేహం, బీపీ లాంటి దీర్ఘకాలిక వ్యాధులకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకోవడానికి ఉద్యోగులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. దీర్ఘకాలిక వ్యాధుల ఓపీ(ఔట్ పేషెంట్) సేవలను తప్పనిసరిగా ప్రభుత్వాసుపత్రుల్లోనే పొందాలనే నిబంధన ఉంది. ఉద్యోగులకు మెరుగైన ఓపీ సేవలు అందించడానికి ప్రత్యేక వేళల్లో వైద్యులను ప్రభుత్వం అందుబాటులో ఉంచింది. కానీ, ఉద్యోగులు మాత్రం సర్కారు ఆసుపత్రులకు వెళ్లడానికి ససేమిరా అంటుండడం గమనార్హం. సంవత్సర కాలంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు పొందిన వారి వివరాలను ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ అధికారులు సేకరించారు. ఈ ఏడాది కాలంలో 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల్లో ఓపీ సేవలను వినియోగించుకున్నారని తేలింది. రాష్ట్రంలో దాదాపు 20 లక్షల మందికిపైగా ఉద్యోగులు, వారి కుటుంబ సభ్యులు, పెన్షనర్లు హెల్త్‌కార్డుల పథకం కింద వైద్య సేవలు పొందడానికి అర్హులు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఓపీ సేవలు, ఔషధాలను అందించడానికి ప్రభుత్వం రూ.46.748 లక్షలు ఖర్చు చేసింది. స్పెషలిస్టులు ఎక్కడ?..: దీర్ఘకాలిక వ్యాధులకు సంబంధించి ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులు ప్రభుత్వాసుపత్రుల్లోనే ఔట్‌పేషెంట్ సేవలు వినియోగించుకోవాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. అయితే, ప్రభుత్వాసుపత్రుల్లో స్పెషలిస్టులు అందుబాటులో లేరు. జనరల్ మెడిసిన్ డాక్టర్లు మాత్రమే ఉన్నారు. ఎండోక్రినాలజీ, కార్డియాలజీ, న్యూరాలజీ వంటి స్పెషలిస్టులు ఏ ఆస్పత్రిలోనూ లేరు. మధ్యాహ్నం 2 గంటల నుంచి 4 గంటల వరకూ ప్రత్యేక ఓపీ సేవలు అందిస్తామని ప్రకటించారు. దీనికోసం ప్రత్యేకంగా వైద్యులు రావడం లేదు. ఉద్యోగులు, పెన్షనర్లు, కుటుంబ సభ్యులు 20 లక్షలకు పైగా ఉంటే కేవలం 2,393 మందే ప్రభుత్వాసుపత్రుల మెట్లు ఎక్కడం గమనార్హం. ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే ఔట్‌పేషెంట్ సేవలు సక్రమంగా అందడం లేదని ఉద్యోగులు వాపోతున్నారు. -
ముహూర్తం ఖరారు
25న బీబీనగర్ నిమ్స్‌లో ఓపీ సేవలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: బీబీనగర్ నిమ్స్ ప్రారంభానికి ఎట్టకేలకు ముహుర్తం ఖరారైంది. స్థానికులకు తక్షణ వైద్యం అందించే చర్యల్లో భాగంగా ఈ నెల 25న ఓపీ సేవలు ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తొలి దశలో గైనిక్, ఆర్థో, పిడియాట్రిక్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ వంటి సేవలు అందుబాటులో ఉం టాయి. ఆ తర్వాత ఇన్‌పేషంట్ సర్వీసులు కూడా అందుబాటులోకి తీసుకురావాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి పంజగుట్ట నిమ్స్‌లో పని చేస్తున్న వైద్యులనే ఇందుకు వినియోగించుకోవాలని నిర్ణయించింది. బీబీనగర్‌లో ఓపీ ప్రారంభంతో నల్లగొండ, వరంగల్, ఖమ్మం, రంగారెడ్డి, మెదక్ జిల్లా ప్రజలకు ప్రయోజనం చేకూరుతుంది. నాలుగు అంతస్తుల్లో నాలుగు వందల పడకల సామర్థ్యంతో నిర్మించిన ఈ భవనంలో 4 ఆపరేషన్ థియేటర్లు, క్యాజువాలిటీ, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, ఆర్థోపెడిక్స్, స్పైన్, హెడ్ ఇంజూరీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, విభాగాలతో పాటు అధునాతన బ్లడ్ బ్యాంక్, ఎక్సరే, సీటీ, ఎంఆర్ఐ విభాగాల్ని ఏర్పాటు చేశారు. ప్రతి విభాగానికి ఆరుగురు నిష్ణాతులైన వైద్యులతో పాటు ప్రాథమిక అవసరాలకు 700 మంది నర్సింగ్, పారామెడికిల్, నాన్ పారామెడికల్ స్టాఫ్ అవసరం. కానీ ఇప్పటివరకు నియా మకాలు చేపట్టలేదు. దీంతో దశల వారీగా సేవలు అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. ఆ మేరకు తొలి దశలో బేసిక్ (ఆర్థోపెడిక్స్, గైనిక్, పీడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ) ఓపీ వైద్య సేవల్ని ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు భువనగిరి ఎంపీ బూర నర్సయ్య గౌడ్ చెప్పారు. -
వైద్యుల సమ్మె విరమణ
♦ నేటి నుంచి యథావిధిగా ఓపీ సేవలు ♦ రెండు రోజులుగా బోధనాసుపత్రుల్లో వైద్య సేవల బంద్ ♦ తీవ్ర ఇబ్బందులకు గురైన రోగులు సాక్షి, హైదరాబాద్: ఆంధ్ర వైద్యులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ తెలంగాణ వైద్యుల జేఏసీ ఆధ్వర్యంలో వైద్యులు చేస్తున్న ఆందోళనను గురువారం రాత్రి విరమించారు. వైద్యుల విభజన జాబితాను కమలనాథన్ కమిటీ వెల్లడించిన అనంతరం రెండురోజులుగా వైద్యులు నిరసన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించింది. రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సి.లక్ష్మారెడ్డి వైద్య ప్రతినిధులతో గురువారం చర్చించారు. వైద్యులు జాబితాను రద్దు చేయాలని కోరగా.. అది ప్రభుత్వ పరిధిలో లేనందున, జాబితాపై ప్రభుత్వ నిర్ణయాన్ని కమలనాథన్ కమిటీకి చెబుదామని మంత్రి హామీ ఇచ్చారు. వైద్యుల జేఏసీ ఇచ్చిన వినతిపత్రాన్ని ఆధారంగా చేసుకుని ప్రభుత్వం తరపున వెంటనే కమలనాథన్ కమిటీకి లేఖను పంపించారు. విభజన జాబితా ఆమోదయోగ్యంగా లేదని, జాబితాపై అభ్యంతరాలను పంపించడానికి నెలరోజుల సమయం ఇవ్వాల్సిందిగా మంత్రి కోరారు. దీనికి ప్రభుత్వ వైద్యులు సంతృప్తిని వ్యక్తం చేశారు. తమ ఆందోళనను విరమిస్తున్నట్టుగా ప్రకటించారు. ప్రధాన ఆస్పత్రుల్లో స్తంభించిన సేవలు కాగా తెలంగాణ వైద్యుల ఆందోళనలతో ఉస్మానియా, గాంధీ సహా అన్ని ప్రభుత్వ ప్రధాన ఆస్పత్రుల్లో వైద్య సేవలు గురువారం పూర్తిగా స్తంభించి పోయాయి. అవుట్ పేషంట్ సేవలతో పాటు 300కి పైగా సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన గర్భిణులు, రోగులు, క్షతగాత్రులకు తీరని వ్యధే మిగిలింది. ఉస్మానియా, గాంధీ జనరల్ ఆస్పత్రి, నీలోఫర్ చిన్న పిల్లల ఆస్పత్రి, ఈఎన్టీ, ఫీవర్ ఆస్పత్రి, ఎంఎన్‌జే కేన్సర్, సరోజినీదేవి కంటి ఆస్పత్రి, ఎర్రగడ్డలోని ఛాతీ, మానసిక చికిత్సాలయంతో పాటు సుల్తాన్‌బజార్, పేట్లబురుజు ప్రసూ తి ఆస్పత్రుల వైద్యులు గురువారం ఉదయం అవుట్ పేషెంట్ సేవలు నిలిపివేసి ఆందోళనకు దిగారు. ఓపీతో పాటు సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడటంతో రోగులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. గాంధీలో 70 శస్త్రచికిత్సలు వాయిదా గాంధీ వెద్యుల ఆందోళన వల్ల గురువారం ఓపీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా 70కిపైగా సాధారణ శస్త్రచికిత్సలు వాయిదా పడ్డాయి. రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఉస్మానియాలో అత్యవసర శస్త్రచికిత్సలు మినహా ఎలక్టివ్ (50-60 సాధారణ) శస్త్రచికిత్సలను నిలిపివేశారు. విషయం తెలియక ఉదయం ఐదు గంటలకే ఆయా ఆపరేషన్ థియేటర్ల వద్దకు చేరుకున్న రోగులకు నిరాశే మిగిలింది. నీలోఫర్‌లో ఓపీ సేవలతో పాటు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్లు పూర్తిగా నిలిచిపోయాయి. కోఠి ఈఎన్టీ ఆస్పత్రి, సుల్తాన్‌బజార్ ప్రభుత్వ ప్రసూతి ఆస్పత్రి, కింగ్‌కోఠి ఆస్పత్రుల్లో వైద్యులు విధులు బహిష్కరించి ఆందోళన నిర్వహించారు. ఆందోళనపథంలో డాక్టర్లు సీమాంధ్రకు చెందిన వైద్యులను తెలంగాణకు కేటాయించడాన్ని నిరసిస్తూ ఉస్మానియా, గాంధీ సహా అన్ని ప్రధాన ప్రభుత్వ ఆస్పత్రుల్లోని వైద్యులు గురువారం ఉదయం ఓపీ సేవలు బహిష్కరించి, కోఠి డీఎంఈ కార్యాలయం ముందు ఆందోళనకు దిగారు. డాక్టర్ బొంగు రమేశ్, డాక్టర్ వీరేశం, డాక్టర్ పుట్ల శ్రీనివాస్, డాక్టర్ నాగేందర్, డాక్టర్ లాలూ ప్రసాద్ రాథోడ్, డాక్టర్ నరహరి, తదితరులు మాట్లాడుతూ... రాష్ట్ర విభజనలో భాగంగా కమల్‌నాథన్ కమిటీకి విరుద్ధంగా అధికారులు ఆంధ్రాకు చెందిన వైద్యులకు తెలంగాణ రాష్ట్రంలో పోస్టింగ్‌లు ఇచ్చారని ఆరోపించారు. విభజన స్క్రూట్నీలో అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. తమ సమక్షంలోనే తుది జాబితాను రూపొందించాలని వారు డిమాండ్ చేశారు. -
నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్!
పంజగుట్ట (హైదరాబాద్): నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. శుక్రవారం సాయంత్రం ఓపీ సేవలు బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ డిమాండ్ల సాధనకు మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. శనివారం నుంచి ఆసుపత్రి అసోసియేట్ డీన్స్ నలుగురూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తనను కలిసిన ఫ్యాకల్టీ అసోసియేషన్, జూనియర్ వైద్యుల బృందం ప్రతినిధులను ఉద్దేశించి నిమ్స్ డెరైక్టర్... ఇక్కడి సర్జన్స్ కన్నా గుంటూరు హౌస్ సర్జన్స్ ఎంతో నయం అని అనడంతో వైద్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు. గత ఐదు రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నా తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని వారు అసహనం వ్యక్తం చేశారు. డైరెక్టర్ తన మాటలు ఉపసంహరించుకోవాలని, పాత విధానం ద్వారానే ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీభూషన్ రాజు, కృష్ణారెడ్డితో పాటు వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు. -
ఉస్మానియాలోనే ఎమర్జెన్సీ, ఓపీ సేవలు
సాక్షి, హైదరాబాద్: ‘రోగుల తరలింపు అంశంపై కొందరు అనవసర రాద్ధాంతం చేస్తున్నారు. ఈ అంశంపై ఏ ఒక్కరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అత్యవసర వైద్య సేవలు సహా ఓపీ సేవలు ఉస్మానియాలోనే కొనసాగుతాయి’ అని మంత్రి సి.లక్ష్మారెడ్డి స్పష్టం చేశారు. అత్యవసర పరిస్థితుల్లో ఆస్పత్రికి వచ్చిన క్షతగాత్రులు, ఇతర రోగులకు పూర్తి వైద్యసేవలు ఇక్కడే అందిస్తామన్నారు. ఆదివారం ఆయన నిమ్స్‌ను సందర్శించారు. ఆస్పత్రిలో తొలి కాలేయ మార్పిడి శస్త్రచికిత్సను విజయవంతంగా చేసిన వైద్యులను అభినందించారు. అనంతరం డెరైక్టర్ నరేంద్రనాథ్‌తో కలసి మంత్రి మాట్లాడుతూ నిరుపేద రోగులకు మరింత మెరుగైన వైద్యసేవలు అందించేందుకు ఉస్మానియా ఆస్పత్రి ప్రాంగణంలో ట్విన్ టవ ర్స్ నిర్మించి తీరుతామని మరోసారి స్పష్టం చేశారు. ఆస్పత్రి పాత భవనం ప్రస్తుతం పూర్తిగా శిథిలావస్థకు చేరుకుందని, గత పాలకుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని విమర్శించారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేని ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ ఈ అంశంపై అనవసర రాద్ధాంతం చేస్తోందని దుయ్యబట్టారు. పేదల గురించి మాట్లాడే కమ్యూనిస్టు నాయకులు కూడా ఆలోచించకుండా విమర్శించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. శస్త్రచికిత్సలన్నీ ప్రభుత్వ ఆస్పత్రుల్లోనే.... ప్రభుత్వ ఆసుపత్రుల్లో పేదవాడికి కార్పొరేట్ వైద్యం అందించడమే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు పోతోందని మంత్రి లక్ష్మారెడ్డి చెప్పారు. అందులో భాగంగా ఇప్పటివరకు ఉస్మానియా, నిమ్స్ ఆస్పత్రుల్లో రెండు కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు విజయవంతంగా నిర్వహించినట్లు తెలిపారు.ఖరీదైన ఈ చికిత్సను ఆరోగ్యశ్రీ సహకారంతో(రూ.10.50 లక్షలు) ఉచితంగా చేసినట్లు చెప్పారు. కాలేయ మార్పిడి చికిత్స కోసం నిమ్స్‌లో మరో ఐదుగురు రిజిస్ట్రర్ చేయించుకున్నారని, వారికి కూడా ప్రభుత్వ సహకారం అందిస్తామని తెలిపారు. -
కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై వార్!
* అధికారులు, ఉద్యోగ సంఘాల మధ్య ఘర్షణ వాతావరణం * ఆర్థికంగా భారమైతే మీకేంటని ఉద్యోగ నేతల నిలదీత * సర్కారుకు వాస్తవాలు చెబుతున్నామంటున్న అధికారులు సాక్షి, హైదరాబాద్: కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వంపైపడే ఆర్థికభారం గురించి అధికారులు చెబుతున్న వివరాలపై ఉద్యోగ సంఘాల నేతలు గుర్రుగా ఉన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సేవలు అందకుండా అధికారులే అడ్డుగా మారారని వారు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో ప్రభుత్వ ఉద్యోగులకు నిమ్స్ తరహా మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలు అందిస్తే ప్రభుత్వంపై రూ. 500 కోట్లు అదనపు భారం పడుతుందని ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేష్‌చందా సీఎస్ రాజీవ్‌శర్మకు వివరించారు. ఈ సందర్భంగా.. అంతకుముందు జరిగిన పలు సమావేశాల్లో ఉద్యోగ సంఘాల నేతలు అధికారులతో తీవ్రస్థాయిలో వాదోపవాదాలకు దిగినట్లు తెలిసింది. ప్రభుత్వంపై ఎంత భారం పడితే మీకెందుకని... ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య ప్యాకేజీపై సర్కారు నిర్ణయం తీసుకోకపోవడంలో అధికారులే అడ్డుగా ఉన్నారని నేతలు నిలదీసినట్లు సమాచారం. దీంతో ఉన్నతాధికారులు కూడా నేతల తీరుపట్ల తీవ్ర ఆక్షేపణ వ్యక్తంచేసినట్లు తెలిసింది. ‘ప్రభుత్వానికి వాస్తవాలు చెప్పాల్సిన బాధ్యత మాదే. ఎంత భారం పడుతుందో చెప్పకుండా.. ఆర్థికశాఖ ఆమోదం లేకుండా ముందుకు సాగడం కష్టం. మీకేమైనా అభ్యంతరాలుంటే సీఎం వద్ద, వైద్య మంత్రి వద్ద తేల్చుకోండి’ అని ఒక ఉన్నతాధికారి ఘాటుగా సమాధానం చెప్పినట్లు విశ్వసనీయ సమాచారం. మొదటి నుంచీ వెనుకంజే: మొదటి నుంచీ ఉద్యోగులకు కార్పొరేట్ వైద్య సదుపాయంపై నిర్ణయాలు తీసుకోవడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోంది. కార్పొరేట్ ఆసుపత్రుల యాజమాన్యాలతో వైద్య మంత్రి లక్ష్మారెడ్డి పలుమార్లు చర్చలు జరిపినా ఎటువంటి నిర్ణయం తీసుకోలేకపోయారు. ఔట్ పేషెంట్ (ఓపీ) సేవలు ఉచితంగా ఇవ్వాలని, మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. కానీ ఈ రెండింటినీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు తిరస్కరిస్తున్న సంగతి తెలిసిందే. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని... మహా అయితే రూ. 150 కోట్లకు మించి ఖర్చు కాదని అధికారులు అంటున్నారు. ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని చెబుతున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై అదనపు భారం పడుతుందని చెబుతున్నారు. -
మెడికల్ ప్యాకేజీ, ఓపీ సేవలకు 500 కోట్లు
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ ఉద్యోగులు, పింఛనుదారులకు కార్పొరేట్ ఆసుపత్రుల్లో వైద్య సేవలకు సంబంధించి ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. నగదు రహిత ఆరోగ్య కార్డులు ఇచ్చినప్పటికీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల్లో వారికి వైద్య సేవలు అందడం లేదు. ప్రభుత్వం ఇస్తున్న ప్యాకేజీపై ఆయా ఆసుపత్రుల విముఖత కారణంగానే ఈ పరిస్థితి నెలకొంది. వైద్య సేవలపై అనేకసార్లు ప్రభుత్వానికి, కార్పొరేట్ ఆసుపత్రులకు మధ్య జరిగిన చర్చలు విఫలమైన సంగతి తెలిసిందే. ఇటీవల వైద్య ఆరోగ్యశాఖ మంత్రి లక్ష్మారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన చర్చల్లోనూ పురోగతి లేకుండా పోయింది. ఈ నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి సురేశ్ చందా తాజాగా కసరత్తు పూర్తిచేశారు. కార్పొరేట్ ఆసుపత్రులు కోరుతున్నట్లుగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే ఏ మేరకు ఖర్చు అవుతుందనే అంశంపై ఆయన ఒక అంచనాకు వచ్చారు. ఈ వివరాలను ఆయన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మకు నివేదించారు. రూ. 500 కోట్లు అదనం: ప్రభుత్వానికి, కార్పొరేట్ యాజమాన్యాలకు మధ్య ప్రతిష్టంభనకు ప్రధానంగా రెండు కారణాలున్నాయి. ఓపీ సేవలు ఉచితంగా ఇవ్వాలని.. మెడికల్ ప్యాకేజీ ఇప్పుడున్నట్లే కొనసాగించాలని ప్రభుత్వం కోరుతోంది. వీటిని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల సంఘం (టీశా) తిరస్కరించింది. ఉచితమైతే ఉద్యోగులు అవసరం ఉన్నా లేకున్నా ఓపీ, వైద్య పరీక్షలు చేయించుకుంటారన్నది టీశా ప్రతినిధుల అంటున్నారు. ప్రస్తుతమున్న మెడికల్ ప్యాకేజీ ఆమోదయోగ్యంగా లేదని స్పష్టం చేస్తున్నారు. నిమ్స్ మాదిరిగా మెడికల్ ప్యాకేజీ, ఓపీ చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనికి అంగీకరిస్తే మెడికల్ ప్యాకేజీ, ఓపీలకే రూ. 500 కోట్ల మేర ప్రభుత్వంపై భారం పడుతుందని సురేశ్‌చందా అంచనా వేశారు. శస్త్రచికిత్సల ప్యాకేజీ 25 శాతం పెంచినా పెద్దగా భారం ఉండదని అంటున్నారు. ఉచిత ఓపీ, మెడికల్ ప్యాకేజీలపైనే అధిక భారం ఉంటుందని సమాచారం. దీనిపై త్వరలో సీఎస్‌తో సమావేశం కావాలని.. ఆర్థికశాఖకు భారంపై నివేదించి సీఎం దృష్టికి తీసుకెళ్లి నిర్ణయం తీసుకోవాలని భావిస్తున్నారు. -
నేటి నుంచి గాంధీలో స్వైన్‌ఫ్లూ ఓపీ
సిటీబ్యూరో: స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ధైర్యవాన్ , స్వైన్ ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నర్సింహులు తెలిపారు. బుధవారం నుంచి ఓపీ సేవ లు అందుబాటులోకి రానున్నట్లు వారు పేర్కొన్నారు. అనుమానం ఉన్న వారు ఓపీకి వచ్చి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.