నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్! | OP services closed in NIMS hospital | Sakshi
Sakshi News home page

నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్!

Published Fri, Aug 7 2015 8:25 PM | Last Updated on Sun, Sep 3 2017 6:59 AM

నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్!

నిమ్స్‌లో సాయంత్రం ఓపీ సేవలూ బంద్!

పంజగుట్ట (హైదరాబాద్): నిమ్స్ ఆసుపత్రిలో వైద్యులు తమ ఆందోళనను ఉధృతం చేశారు. శుక్రవారం సాయంత్రం ఓపీ సేవలు బంద్ చేయడంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ డిమాండ్ల సాధనకు మున్ముందు ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని వైద్యులు హెచ్చరించారు. శనివారం నుంచి ఆసుపత్రి అసోసియేట్ డీన్స్ నలుగురూ విధులు బహిష్కరించనున్నట్లు తెలిపారు. అంతకు ముందు తనను కలిసిన ఫ్యాకల్టీ అసోసియేషన్, జూనియర్ వైద్యుల బృందం ప్రతినిధులను ఉద్దేశించి నిమ్స్ డెరైక్టర్... ఇక్కడి సర్జన్స్ కన్నా గుంటూరు హౌస్ సర్జన్స్ ఎంతో నయం అని అనడంతో వైద్యులు తీవ్ర ఆగ్రహానికి గురయ్యారు.

గత ఐదు రోజులుగా శాంతియుత వాతావరణంలో నిరసన వ్యక్తం చేస్తున్నా తమను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడని వారు అసహనం వ్యక్తం చేశారు. డైరెక్టర్ తన మాటలు ఉపసంహరించుకోవాలని, పాత విధానం ద్వారానే ప్రమోషన్లు కల్పించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ శ్రీభూషన్ రాజు, కృష్ణారెడ్డితో పాటు వైద్యులు, జూనియర్ వైద్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement