స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి ....
సిటీబ్యూరో: స్వైన్ ఫ్లూ రోగులను గుర్తించి, వారికి మరింత మెరుగైన చికిత్స అందించేందుకు గాంధీ ఆస్పత్రి అవుట్ పేషెంట్ విభాగంలో ప్రత్యేక ఓపీని ప్రారంభిస్తున్నట్లు ఆస్పత్రి సూపరిండెంట్ డాక్టర్ ధైర్యవాన్ , స్వైన్ ఫ్లూ నోడల్ ఆఫీసర్ డాక్టర్ నర్సింహులు తెలిపారు. బుధవారం నుంచి ఓపీ సేవ లు అందుబాటులోకి రానున్నట్లు వారు పేర్కొన్నారు. అనుమానం ఉన్న వారు ఓపీకి వచ్చి స్వైన్ ఫ్లూ వ్యాధి నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాలని సూచించారు.