ఆస్పత్రుల్లో ఓపీ బంద్ నేడు
ఆస్పత్రుల్లో ఓపీ బంద్ నేడు
Published Wed, Nov 16 2016 1:45 AM | Last Updated on Sat, Oct 20 2018 6:19 PM
నెల్లూరు(అర్బన్): ప్రభుత్వం ప్రజలకు, డాక్టర్లకు అనుకూలంగా ఉన్న ఐఎంసీ(ఇండియన్ మెడికల్ కౌన్సిల్) చట్టాన్ని రద్దు చేసి దాని స్థానంలో నూతనంగా ఎన్‌ఎంసీ(నేషనల్ మెడికల్ కమిషన్)ను ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ జిల్లాలో ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఓపీల్లో వైద్య సేవలు బంద్ చేసి నిరసన కార్యక్రమం చేపడుతున్నామని ఐఎంఏ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ ఎమ్వీవీ ప్రసాద్ అన్నారు. ఓపీల బంద్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను స్థానిక దర్గామిట్టలోని ఐఎంఏ హాల్లో మంగళవారం డాక్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నూతన చట్టం వస్తే గతంలో మాదిరిగా ఎంబీబీఎస్ చదివిన డాక్టర్లు నేరుగా ప్రాక్టీసు చేసేదానికి లేదని, కోర్సు చేసిన వారు ట్ పరీక్ష రాయాల్సి ఉందని అన్నారు. దీనిని తాము వ్యతిరేకిస్తున్నామన్నారు. దేశవ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా తాము కూడా బుధవారం సత్యాగ్రహ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఉదయం 9 గంటలకు ఐఎంఏ హాలు నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహిస్తామని, డాక్టర్లంతా తరలిరావాలని కోరారు. ప్రభుత్వ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ శ్రీనివాసన్ నూతన చట్టం వల్ల కలిగే నష్టాలను వివరించారు. కార్యక్రమంలో ఐఎంఏసీనియర్ నాయకులు డా.అశోక్, గౌరవాధ్యక్షుడు డా.భక్తవత్సలం, డా.మల్లిఖార్జునయ్య, డా.బీవీ రవిశంకర్, డా.సుస్మిత పాల్గొన్నారు.
Advertisement