
ఎంఐఎంతో టీఆర్ఎస్ రహస్య ఒప్పందం
కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ
కాచిగూడ: జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అ ధికార టీఆర్‌ఎస్ పార్టీ ఎంఐఎంతో ర హస్య ఒప్పందం చేసుకోవడం హై దరాబాద్ మహానగరానికి ప్రమాదకరమని కేంద్ర కార్మిక శాఖ మంత్రి బం డారు దత్తాత్రేయ అన్నారు. శుక్రవారం బర్కత్‌పురలోని బీజేపీ గ్రేటర్ కార్యాలయంలో పార్టీ గ్రేటర్ అధ్యక్షులు బి.వెంకట్‌రెడ్డి అధ్యక్షతన కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టీఆర్‌ఎస్ ఎంఐఎం కన్నుసన్నల్లో నడు స్తూ ఏకపక్ష నిర్ణయాలతో హై దరాబాద్‌ను ఉగ్రవాదనగరంగా మారుస్తున్నదని ఆ రోపించారు. ఈ ప్ర మాదాన్ని నివారించేందుకు ప్రజలు సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ము ఖ్యమంత్రి కేసీఆర్ తన మాటల గారడీతో ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. నిర్థిష్టమైన విధానమం లేకుండా చేపట్టిన స్వచ్ఛ్ హైదరాబాద్ కార్యక్రమయాన్ని విజయవంతం చేయలేకపోయారన్నారు.
ఐడిహెచ్ కాలనీలో మిన హా నగరంలో ఎక్కడా ఇళ్ల నిర్మాణం చేపట్టలేదని, వాటిని చూపుతూ ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారన్నారు. గ్రేటర్ శివార్లలో నిరుపయోగంగా ఉన్న 35వేల ఇళ్లను లబ్ధిదారులకు కేటాయించకుండా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరి స్తోందన్నా రు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ-టీడీపీ (మిత్రపక్షాలు), టీఆర్‌ఎస్ మ ధ్యనే పోటి ఉంటుందని, ఇరుపార్టీల కార్యకర్తలు సమన్వయంతో విజయానికి కృషి చేయాలన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి మా ట్లాడు తూ మెజార్టీ కార్యకర్తల అభిప్రాయం మేరకు అభ్యర్థులను ప్రకటిం స్తామని, వారిని గెలిపించుకోవాల్సిన బాధ్యత కూడా కార్యకర్తలపైనే ఉందన్నారు.
నాయకులు, కార్యకర్తలు విబేధాలను పక్కన పెట్టి కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో నాయకులు మురళీధర్‌రావు, ఎమ్మెల్యేలు డాక్టర్ కె.లక్ష్మణ్, చింతల రాం చంద్రారెడ్డి, ఎమ్మెల్సీ ఎన్.రాంచందర్‌రావు, రాష్ట్ర నాయకులు వెంకటరమణి, మంత్రి శ్రీని వాస్, రాజశేఖర్‌రెడ్డి, ఎక్కాల నందు, కన్నె రమేష్‌యాదవ్, రామన్‌గౌడ్, బండారి రాధిక, దేవిరెడ్డి విజితారెడ్డి తదితరులు పాల్గొన్నారు.