
బలమైన ఆర్థికశక్తిగా భారత్
‘నవశకానికి నాంది’ పుస్తకావిష్కరణలో కేంద్రమంత్రి దత్తాత్రేయ
హైదరాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, పథకాల్లో మార్పులు భారత్‌ను ప్రపంచంలోనే బలమైన ఆర్థికశక్తిగా తీర్చిదిద్దుతాయని కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ ఆశాభావం వ్యక్తం చేశారు. బీజేపీ యువమోర్చా నేత, ఆర్థిక నిపుణులు ఏనుగుల రాకేశ్‌రెడ్డి రాసిన ‘నవశకానికి నాంది’ పుస్తకాన్ని శనివారం హైదరాబాద్‌లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ మాట్లాడుతూ.. వేగవంతమైన ఆర్థిక వ్యవస్థ కోసం జవాబుదారీతనం, పారదర్శకత, అవినీతిరహిత సుపరిపాలనతో కేంద్రం అనుసరిస్తున్న విధానాలు, వాటి లోతుపాతులు, భవిష్యత్‌లో రాబోయే సానుకూల పరిణామాలను ‘నవశకానికి నాంది’ పుస్తకంలో వివరించారన్నారు.
బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి పి.మురళీధర్‌రావు, బీజేపీ శాసనసభాపక్ష నేత కె.లక్ష్మణ్ మాట్లాడుతూ భారత్‌కు సరిపోయే ఆర్థిక విధానాలు, పథకాలతో మోదీ తెచ్చిన సం స్కరణలను, వాటి ప్రభావాలను ఈ పుస్తకంలో పొందుపర్చడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ గవర్నర్ వి.రామారావు, జర్నలిస్టు దేవులపల్లి అమర్, ఎమ్మెల్యే ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్, పేరాల చంద్రశేఖర్‌రావు, వేణుగోపాలరెడ్డి, కుటుం బరావు తదితరులు పాల్గొన్నారు.