న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ కోసం చేపట్టిన నూతన అధికారిక నివాసం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులపై ఈ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు.
ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే పూర్తిస్థాయి ఎఫ్‌ఐఆర్ నమోదు చేస్తారు. సీఎం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని సీబీఐ సోమవారం ఢిల్లీ ప్రజా పనుల విభాగానికి లేఖ రాసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.43.70 కోట్లు కేటాయించింది. కానీ, రూ.44.78 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. 2020 సెప్టెంబర్ 9 నుంచి 2022 జూన్ దాకా ఈ సొమ్ము ఖర్చు చేశారు.
Comments
Please login to add a commentAdd a comment