Preliminary investigation
-
ముందు దర్యాప్తు.. ఆపై విచారణ!
సాక్షి, హైదరాబాద్: బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేసిన ఆరోపణలపై సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లపై నమోదైన కేసుల విషయంలో పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. తొలుత ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేయాలని, వెలుగులోకి వచ్చిన అంశాల ఆధారంగా బాధ్యులకు నోటీసులు జారీ చేసి విచారించాలని భావిస్తున్నారు. దేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, అసోం మినహా మిగతా రాష్ట్రాల్లో ఆన్లైన్ బెట్టింగ్ నేరం కాకపోవడం, మరికొన్ని అంశాల నేపథ్యంలో ఆచితూచి వ్యవహరించాలని ఆలోచనకు వచ్చారు. న్యాయ నిపుణుల సలహా తీసుకుని ముందుకు వెళ్లాలని నిర్ణయించారు. హైదరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఉన్న పంజాగుట్ట పోలీస్‌స్టేషన్‌లో 11 మంది యాంకర్లు, ఇన్ఫ్లుయెన్సర్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలోని మియాపూర్ పోలీసుస్టేషన్లో 25 మంది నటీనటులు, ఇన్ఫ్లుయెన్సర్లపై కేసులు నమోదైన విషయం తెలిసిందే. రాష్ట్రంలో 2017 నుంచే నిషేధం అమలు.. తెలంగాణలో కొన్నేళ్లుగా పేకాటపై నిషేధం ఉంది. దీనితో పేకాట క్లబ్బులన్నీ మూతపడ్డాయి. కానీ చాలా మంది ఆన్లైన్ రమ్మీ, పేకాటకు అల వాటు పడ్డారు. దీనికోసం తొలినాళ్లలో ప్రత్యేక వెబ్సైట్లు, యాప్‌లు వచ్చా యి. వాటి సర్వర్లను రాష్ట్రం వెలుపల ఏర్పాటు చేసుకున్న నిర్వాహకులు యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ వచ్చారు. దీన్ని తీవ్రంగా పరిగణించిన రాష్ట్ర ప్రభుత్వం.. గేమింగ్ యాక్ట్‌కు సవరణలు చేసి, రాష్ట్ర పరిధిలో ఆన్లైన్ గ్యాంబ్లింగ్‌పైనా నిషేధం విధించింది. 2017లో ఇది అమల్లోకి వచ్చింది. ఇంటర్నెట్ సేవలను అందించే సంస్థలకు లేఖలు రాయడం ద్వారా పోలీసులు రాష్ట్రంలో గ్యాంబ్లింగ్ సైట్లు/యాప్‌లు ఓపెన్ కాకుండా చర్యలు తీసుకున్నారు. కానీ ఆన్లైన్ గేమింగ్‌కు బానిసలుగా మారినవారు నకిలీ జీపీఎస్, లొకేషన్ యాప్స్, వీపీఎన్ల సాయంతో ఆయా సైట్లు, యాప్స్‌ను వినియోగిస్తున్నారు. పలువురు నటులు, ఇన్ఫ్లుయెన్సర్లు డబ్బులు తీసుకుని ఆ గ్యాంబ్లింగ్ వెబ్సైట్లు, యాప్స్‌కు ప్రమోట్ చేశారు. ఈ క్రమంలోనే వారిపై చర్యలకు పోలీసులు ఉపక్రమించారు. నాటి ప్రకటనలే అని చెబుతూ.. బెట్టింగ్ యాప్స్‌ను ప్రమోట్ చేయడంపై కేసులు నమోదవడంతో చాలా మంది ప్రముఖులు స్పందించారు. ఆ ప్రకటనలన్నీ గేమింగ్ చట్ట సవరణకు ముందే 2016–17 సమయంలో చేసినవని, తర్వాత ఆ ఒప్పందాలు రద్దు చేసుకున్నామని కొందరు చెప్తున్నారు. మరికొందరు తెలుగు రాష్ట్రాల బయట మాత్రమే ఆ ప్రమోషనల్ వీడియోలను వినియోగించుకోవడానికి అంగీకరించామని అంటున్నారు. దీంతో సెలబ్రిటీలు, ఇన్ఫ్లుయెన్సర్లు, యాంకర్లతో బెట్టింగ్ కంపెనీలకు జరిగిన ఒప్పందాలను సేకరించాలని దర్యాప్తు అధికారులు నిర్ణయించారు. వాటిని అధ్యయనం చేయడం ద్వారా ఎవరు? ఎప్పుడు? ఏఏ యాప్స్‌తో ఒప్పందాలు చేసు కున్నారు? ఏయే ప్రాంతాల్లో ప్రచారం చేసేలా నిబంధనలు ఉ న్నాయి? తదితర అంశాలను పరిశీలించనున్నారు. ఇక ఇన్ఫ్లుయెన్సర్లకు, బెట్టింగ్ యాప్స్ నిర్వాహకులకు మధ్య కొందరు ఈవెంట్ మేనేజర్లు దళారులుగా వ్యవహరించినట్టు పోలీసులు భావిస్తున్నారు. వారి వివరాలు సైతం ఆరా తీసి, నిందితులుగా చేర్చాలని యోచిస్తున్నారు. న్యాయ నిపుణుల సల హాలు తీసుకున్న తర్వాతే నిందితులకు నోటీసులు జారీ చేయాలని భావిస్తున్నారు. -
సంచలనం కోసమే ఎంపీపై హత్యాయత్నం
సిద్దిపేటకమాన్: సంచలనం సృష్టించడం కోసమే దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డిపై హత్యాయత్నానికి పాల్పడినట్లు నిందితుడు తమ ప్రాథమిక విచారణలో అంగీకరించాడని సిద్దిపేట పోలీసు కమిషనర్ శ్వేత బుధవారం తెలిపారు. ఎంపీపై దాడి ఘటనకు సంబంధించి గ్రామానికి చెందిన నర్సింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని సీపీ తెలిపారు. నిందితుడు వివిధ ఆన్లైన్ చానళ్లలో పనిచేస్తున్నట్లు తెలిసిందని, విలేకరిని అని చెప్పుకుంటూ బెదిరించి వారి వద్ద నుంచి డబ్బులు వసూలు చేసే వాడన్నారు. ఎంపీపై దాడి చేయాలనే ఉద్దేశంతో వారం రోజుల క్రితం దుబ్బాక మార్కెట్ లో నిందితుడు కత్తిని కొనుగోలు చేశాడన్నారు. ఎంపీ ఏయే గ్రామా ల్లో ప్రచారం చేస్తున్నారనే విషయమై సోషల్ మీడియా ద్వారా సోమవారం సూరంపల్లి గ్రామానికి వస్తున్న ట్లు తెలుసుకున్నాడని చెప్పారు. ఈ క్రమంలో దాడికి పాల్పడినట్లు తెలిపారు. నిందితుడు దాడి చేయడానికి ఎవరైనా ప్రోత్సహించారా? ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా?.. అనే కోణాల్లో విచార ణ జరిపి వివరాలు వెల్లడిస్తామన్నా రు. ఆస్పత్రిలో చికిత్స అనంతరం డిశ్చార్జి కావడంతో నిందితుడిని అదుపులోకి తీసు కున్నామని, బుధవారం అరెస్ట్ చేసి గజ్వేల్ కోర్టులో హాజరుపర్చగా 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ఢిల్లీ సీఎం కేజ్రివాల్ అధికార నివాసం నిర్మాణంలో అవకతవకలు..
న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పారీ్ట(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రివాల్ కోసం చేపట్టిన నూతన అధికారిక నివాసం నిర్మాణంలో భారీగా అవకతవకలు జరిగినట్లు వచ్చిన ఆరోపణలపై సీబీఐ ప్రాథమిక దర్యాప్తు ప్రారంభించింది. ఢిల్లీ ప్రభుత్వానికి చెందిన గుర్తుతెలియని అధికారులపై ఈ దర్యాప్తు కొనసాగిస్తోంది. ఈ విషయాన్ని సీబీఐ అధికారులు బుధవారం వెల్లడించారు. ఆరోపణలకు తగిన ఆధారాలు ఉన్నట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలితే పూర్తిస్థాయి ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారు. సీఎం కొత్త ఇంటి నిర్మాణానికి సంబంధించిన రికార్డులన్నీ తమకు అందజేయాలని సీబీఐ సోమవారం ఢిల్లీ ప్రజా పనుల విభాగానికి లేఖ రాసింది. కేజ్రివాల్ కొత్త ఇంటి నిర్మాణం కోసం ఢిల్లీ ప్రభుత్వం రూ.43.70 కోట్లు కేటాయించింది. కానీ, రూ.44.78 కోట్లు ఖర్చు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.. 2020 సెప్టెంబర్ 9 నుంచి 2022 జూన్ దాకా ఈ సొమ్ము ఖర్చు చేశారు. -
డ్రైవర్ తప్పిదం వల్లే..
- చర్చిగేట్ స్టేషన్లో లోకల్ రైలు ప్రమాదం - ప్రాథమిక దర్యాప్తులో తేల్చిన రైల్వే సాంకేతిక బృందం - విచారణ జరుపుతున్న ప్రత్యేక కమిటీ సాక్షి, ముంబై: చర్చిగేట్ రైల్వే స్టేషన్లో లోకల్ రైలు ప్రమాదం మానవ తప్పిదం వల్లే జరిగిందని ప్రాథమిక దర్యాప్తులో వెలుగులోకి వచ్చింది. ప్రమాదం జరిగిన వెంటనే బ్రేక్ ఫెయిల్ అయినట్లు చిత్రీకరించేందుకు మోటర్మాన్ (డ్రైవర్) క్యాబిన్లోకి ఓ డ్రైవర్ చొరబడి మరో సిబ్బంది సహాయంతో బ్రేక్ పరికరాలను పాడు చేసినట్లు సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డయ్యింది. ప్రమాదం జరిగిన వెంటనే క్యాబిన్లోకి ఎందుకు వెళ్లారో తెలుసుకునేందుకు ఇద్దరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు స్టేషన్ జనరల్ మేనేజర్ సునీల్‌కుమార్ సూద్ చెప్పారు. జూన్ 28 మధ్యాహ్నం చర్చిగేట్ స్టేసన్‌లో లోకల్ రైలు బఫ్ఫర్ స్టాపర్లను ఢీకొని ప్లాట్‌ఫాంపైకి దూసుకెళ్లిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో మోటర్మాన్ సహా నలుగురు గాయపడ్డారు. దీనిపై దర్యాప్తు చేపట్టేందుకు పశ్చిమ రైల్వే పరిపాలనా విభాగం ప్రత్యేకంగా నలుగురు సభ్యులతో కూడిన కమిటీని ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ఇంకా విచారణ జరుపుతోంది. నివేదిక ఇంకా రావాల్సి ఉంది. అయితే అంతకు ముందుగానే రైల్వే సాంకేతిక బృందం జరిపిన ప్రాథమిక దర్యాప్తులో ఇంకా పలు వాస్తవాలు వెలుగుచూశాయి. మాటల్లో పడి..? రద్దీ సమయంలో డ్రైవర్ క్యాబిన్లో ముగ్గురు, నలుగురు సిబ్బంది లోకల్ రైలు ప్రయాణిస్తుంటారు. ఈ సందర్భంగా వారితో మాటల్లో పడి డ్రైవర్ రైలును నియంత్రించలేక పోయాడా, ప్రమాదం జరిగిన రోజు క్యాబిన్లో మరెవరైనా సిబ్బంది ప్రయాణించారా, అనే కోణంలో ప్రత్యేక కమిటీ దర్యాప్తు జరుగుతోంది. స్టేషన్లో అమర్చిన బఫ్ఫర్ స్టాపర్లు చాలా ఏళ్ల కిందట ఏర్పాటు చేసినవి. కొత్తగా వచ్చిన లోకల్ రైళ్లన్నీ కొంచెం ఎక్కువ ఎత్తు ఉన్నాయి. దీంతో చర్చిగేట్‌లో ఉన్న బఫ్ఫర్ స్టాపర్లు, కొత్త రైళ్లకు అమర్చిన బఫ్ఫర్ స్టాపర్ల మధ్య చాలా వ్యత్యాసం ఏర్పడింది. సాధారణంగా బఫ్ఫర్ స్టాపర్‌ను ఢీ కొన్న తరువాత కొంత వెనక్కి వెళ్లి రైలు ఆగిపోవాలి. కాని అవి సమాంతరంగా లేకపోవడం వల్ల ఆ రోజు వేగంగా వచ్చిన రైలు వాటిని ఢీ కొన్ని ఏకంగా ప్లాట్‌ఫాంపైకి ఎక్కేసింది. -
క్రూడాయిల్ అక్రమ రవాణాపై విచారణ
అశ్వారావుపేట రూరల్ : అశ్వారావుపేట పట్టణంలోని పామాయిల్ ఫ్యాక్టరీలో క్రూడాయిల్(ముడి పామాయిల్)ను తెట్టు(స్లడ్జ్) పేరుతో తక్కువ ధరకు విక్రయించి రవాణా చేస్తున్న ఘటనపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. బుధవారం రాత్రి పామాయిల్ అక్రమంగా రవాణా చేస్తుండగా రైతులు అడ్డుకున్న విషయం విదితమే. ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించడంతో హైదరాబాద్ నుంచి సీనియర్ మేనేజర్ రంగారెడ్డి, ప్లాంట్స్ మేనేజర్ ఎండీ బాషా, ఫైనాన్స్ మేనేజర్ తిరుపతిరెడ్డి, డిప్యూటీ ఫైనాన్స్ మేనేజర్ సీతారాములుతో కూడిన బృందం విచారణ నిమిత్తం గురువారం ఫ్యాక్టరీకి వచ్చింది. తొలుత వారు ఫ్యాక్టరీలోని క్రూడ్ ఆయిల్‌ను పరిశీలించారు. ట్యాంక్‌ల ద్వారా ఈటీపీ ప్లాంట్‌ను పరిశీలించారు. అనంతరం ఈటీపీ ప్లాంట్ వెనుక భాగంలోగల స్లడ్జ్ చెరువును కూడా పరిశీలించి దాంట్లో క్రూడ్ ఆయిల్ కొంతమేర కలుస్తున్నట్లు ప్రాథమికంగా తేల్చారు. స్లడ్జ్లో క్రూడ్ ఆయిల్ కలవడం జరుగుతుంటుందని, ప్రస్తుతం 0.1 శాతం కలిసిందని బృందం గుర్తించారు. అధికారుల నిర్లక్ష్యంతోపాటు, సామర్థ్యానికి మించి గెలల క్రషింగ్ వల్ల, పైపులైను ద్వారా లీకై స్లడ్జ్లో క్రూడాయిల్ కలుస్తుందని వారు అభిప్రాయపడ్డారు. విచారణ బృందాన్ని నిలదీసిన రైతులు విచారణ బృందం వస్తుందన్న సమాచారం తెలుసుకున్న పలు రైతు సంఘాలు, రైతులు అక్కడికి చేరుకున్నారు. ఫ్యాక్టరీలో వరుసగా జరుగుతున్న అవినీతి, అక్రమాలపై నిలదీశారు. గెలల క్రషింగ్‌లో జాప్యం జరుగుతోందని, ఆయిల్ రికవరీ కూడా దారుణంగా తగ్గిపోతుందని మాజీ జడ్పీటీసీ జేకేవీ రమణరావు, జడ్పీటీసీ అంకత మల్లికార్జునరావుతో పాటు పలువురు రైతులు విచారణ బృందం దృష్టికి తీసుకెళ్లారు. క్రషింగ్ జాప్యం కావడంతో గెలలు కుళ్లిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో ఫ్యాక్టరీకి మంచి రోజులు వస్తాయని వారు సర్థిచెప్పేందుకు యత్నించగా, మంచి రోజులేమీ రావడం లేదని, నిత్యం అవినీతి అక్రమాలే రాజ్యమేలుతున్నాయని, ఫ్యాక్టరీ మూతపడే స్థితికి చేరుకుంటుందని అన్నారు.