
కేజ్రీవాల్‌కు రేపు నలుగురితో ముప్పు!
న్యూఢిల్లీ: గణతంత్ర దినోత్సవం రోజున ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ను కొందరు టార్గెట్ చేసినట్లు తెలిసింది. ఈ మేరకు ఓ ఈ మెయిల్ కేజ్రీవాల్ కార్యాలయానికి పంపించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాల అధికారి ఒకరు చెప్పారు. కనీసం నలుగురు వ్యక్తులు అతడిని లక్ష్యంగా చేసుకొని దాడి చేసే అవకాశం ఉందని కేజ్రీవాల్‌కు చెప్పినట్లు తెలిపారు.
చదవండి.. (రిపబ్లిక్ డేకు ఢిల్లీ అంతటా గప్‌చుప్)
లష్కరే తోయిబాలాంటి ఉగ్రవాద సంస్థలు హెలికాప్టర్ చార్టర్‌లాంటి సర్వీసులు, చార్టర్ విమానాలతో గణతంత్ర దినోత్సవం రోజున దాడి చేసే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల సమాచారం నేపథ్యంలో ఇప్పటికే ఢిల్లీలో దాదాపు 50 వేల బలగాల్ని మోహరించిన విషయం తెలిసిందే.