
న్యూఢిల్లీ: ఢిల్లీ హైకోర్టులో ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు ఊరట లభించింది. లిక్కర్ స్కాం కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్న కేజ్రీవాల్‌ను ఢిల్లీ సీఎం పదవి నుంచి తొలగించాలంటూ దాఖలైన పిటిషన్‌ను విచారించేదుకు హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేమని కోర్టు పేర్కొంది.
మార్చి 21న కేజ్రీవాల్ అరెస్ట్ తర్వాత దేశ రాజధానిలో ప్రభుత్వ పాలన కొరవడిందని హిందూ సేన జాతీయ అధ్యక్షుడు, సామాజిక కార్యకర్త విష్ణు గుప్తా ఈ ప్రజా ప్రయోజన పిటిషన్‌ను దాఖలు చేశారు. దీనిని గురువారం జస్టిస్ మన్మోహన్, జస్టిస్ మన్మీత్ ప్రీతమ్ సింగ్ అరోడాతో కూడిన డివిజన్ బెంచ్ బెంచ్ కొట్టేసింది. సీఎం పదవిలో కొనసాగాలా వద్దా అనే అంశం కేజ్రీవాల్ వ్యక్తిగత నిర్ణయంపై ఆధారపడి ఉంటుందన్నారు.
అయితే పిటిషనర్ ఈ అంశంపై రాజ్యాంగ అధికారులను(రాష్ట్రపతి లేదా గవర్నర్) సంప్రదించాలని హైకోర్టు కోరింది. ‘కొన్నిసార్లు వ్యక్తిగత ప్రయోజనం జాతీయ ప్రయోజనాలకు లోబడి ఉండాలి. కానీ అది అతని (కేజ్రీవాల్) వ్యక్తిగత నిర్ణయం. ఇది న్యాయస్థానం, కోర్టు ఎప్పుడైనా రాష్ట్రపతి పాలన, గవర్నర్ పాలన విధించిన సందర్భాలు ఉన్నాయా? దీనిపై ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ లేదా రాష్ట్రపతి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
చదవండి: తీహార్ జైలు నుంచి ఆప్ ఎమ్మెల్యేలకు కేజ్రీవాల్ సందేశం
ప్రభుత్వం పనిచేయడం లేదని మేము ఎలా చెప్పగలం? దానిని నిర్ణయించడానికి లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు పూర్తి సామర్థ్యం ఉంది. ఆయనకు మా మార్గదర్శకత్వం అవసరం లేదు. చట్టాం ప్రకారం ఏం చేయాలో ఆయన చేస్తారు’ అని పేర్కొంది.
అనంతరం పిటిషనర్ గుప్తా మాట్లాడుతూ.. తన పిటిషన్‌ను ఉపసంహరించుకుంటున్నట్లు తెలిపారు. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ ముందు దీనిని ప్రస్తావించనున్నట్లు చెప్పారు. కాగా సీఎంగా అరవింద్ కేజ్రీవాల్‌ను తొలగించాలంటూ హైకోర్టులో దాఖలైన రెండో పిటిషన్ ఇది. కాగా మార్చి 28న సుర్జిత్ సింగ్ యాదవ్ అనే వ్యక్తి దాఖలు చేసిన పిల్‌ను హైకోర్టు కొట్టివేసింది.
Comments
Please login to add a commentAdd a comment