ఢిల్లీ: సీఎం అరవింద్ కేజ్రీవాల్ విషయంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్(ఈడీ)పై ఢిల్లీ హైకోర్టు ప్రశ్నల వర్షం కురిపించింది. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్ట్ చేయాలని చూస్తున్నారా? అని ప్రశ్నించింది. మీరు(ఈడీ) ఏం చేయాలనుకుంటున్నారు అని అడిగింది.
కాగా, ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం కేజ్రీవాల్‌కు ట్రయల్ కోర్టుకు ఇచ్చిన బెయిల్‌ను ఈడీ సవాల్ చేస్తూ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఇక, ఈడీ పిటిషన్‌పై నేడు ఢిల్లీ హైకోర్టులో విచారణ జరిగింది. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ నీనా బన్సల్ మాట్లాడుతూ..‘కేజ్రీవాల్ విషయంలో నేను అయోమయంలో ఉన్నాను. మీరు అసలు ఏం చేయాలనుకుంటున్నారు. కేజ్రీవాల్‌ను మళ్లీ అరెస్టు చేయాలనుకుంటున్నారా?’ అంటూ ప్రశ్నించారు. అనంతరం విచారణను సెప్టెంబర్ ఐదో తేదీకి వాయిదా వేసింది.
ఇదిలా ఉండగా..మనీలాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్‌ఎ) కేసులో కేజ్రీవాల్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు జూన్ 20న బెయిల్ మంజూరు చేసింది. కాగా రౌస్ అవెన్యూ కోర్టు ఇచ్చిన ఉత్తర్వును ఢిల్లీ హైకోర్టు నిలిపివేసింది. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) వాదనలను వినే వరకు కేజ్రీవాల్‌కు కల్పించిన బెయిల్ ఉపశమనంపై మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment