సాక్షి,ఢిల్లీ : ఢీల్లీ హైకోర్టులో సీఎం కేజ్రీవాల్‌కు ఊరట దక్కలేదు. కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్‌పై తీర్పు రిజర్వ్ చేసింది. ఢిల్లీ మద్యం పాలసీ కేసుకు సంబంధించిన సీబీఐ అరెస్ట్ కేసులో తనకు బెయిల్ మంజూరు చేయాలని కేజ్రీవాల్ బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టు సోమవారం విచారణ చేపట్టింది. వాదనలు పూర్తి కావడంతో తీర్పును రిజర్వ్ చేసింది.
ఢిల్లీ లిక్కర్ కేసులో రెండు కేంద్ర దర్యాప్తు సంస్థలు సీబీఐ, ఈడీ విచారణ ప్రారంభిస్తున్నాయి. అయితే ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ఈడీ దర్యాప్తులో సుప్రీంకోర్టు కేజ్రీవాల్‌కు బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆయన ఇంకా తీహార్ జైల్లో జ్యుడీషియల్ కస్టడీలో కొనసాగాల్సి వచ్చింది. సీబీఐ కేసులో బెయిల్ వస్తేనే కేజ్రీవాల్ జైలు నుంచి విడుదల కానున్నారు.
Comments
Please login to add a commentAdd a comment